
హృదయ గాయం!
చూస్తుంటే బొద్దుగుమ్మ పరిణీతిచోప్రా రిలేషన్స్‌లో కాస్త వీక్‌లా ఉంది. కమ్యూనికేషన్ ప్రాబ్లమో... అసలు వద్దనే భావనో... మొత్తానికి ఈ అమ్మడు రెండు హృదయాలకు గాయం చేసిందట. కానీ ఈ చిన్నదాని మనసు ఇప్పుడు ఓ జతగాడిని కోరుకుంటోందట. ‘గతంలో నాకుంది రెండే రిలేషన్స్. ఆ
ఇద్దరినీ కాదని బాధపెట్టా. ఆ పాపం నాకు ఎప్పుడో అప్పుడు తగులుతుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరో ఒకరు నా హృదయాన్ని గాయపరుస్తారు. బట్... ఓకే (నవ్వులు). హార్ట్‌బ్రేక్స్ ఓ మంచి నటిని చేస్తాయి. చాలామంది విషయాల్లో ఇది రుజువైంది కూడా’ అంటూ ఎంతో పరిణతిగా మాట్లాడింది పరిణీతి.