వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్రమోదీతో గల సంబంధాలకు అమెరికా అధ్యక్షుడు ఒబామా అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని వైట్హౌస్ డిప్యూటీ సెక్రటరీ ఎరిక్ షుల్జ్ ప్రకటించారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన సంబంధాల విస్తరణ లాంటి అంశాలలో ఒబామా, మోదీతో మంచి సంబంధాలను కలిగి ఉన్నారని శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో షుల్జ్ తెలిపారు.
పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో వైట్హౌజ్ ప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా, భారత్లు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయని, వీటికి ఒబామా అత్యంత ప్రాధాన్యత ఇస్తారని షుల్జ్ ప్రకటించాడు.