ప్రతీకాత్మక చిత్రం
భర్త విషయంలో భారతీయ స్త్రీలు విపరీతమైన ఆలోచనా ధోరణితో ఉంటారని, తన భర్త తనకు మాత్రమే సొంతం అనుకుంటారని, పరాయి స్త్రీతో బంధాన్ని పంచుకోవడానికి ఏమాత్రం సహించబోరని అలహాబాద్(ఉత్తర ప్రదేశ్) హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
భారతీయ వివాహిత మహిళలు భర్త తమకు మాత్రమే సొంతం అనుకుంటారు. వాళ్ల గురించి విపరీతంగా ఆలోచిస్తుంటారు. ఒకవేళ అతను గనుక వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నా, వివాహం చేసుకోవాలనుకునే ప్రయత్నం.. చివరికి ఆలోచనా చేసినా అది ఆ భార్యను కుదిపేసే అంశమే. అలాంటి విపత్కర పరిస్థితుల్లో తీవ్ర నిర్ణయాలే తీసుకుంటారు. ఈ కేసులోనూ అదే జరిగింది అంటూ జస్టిస్ రాహుల్ చతేర్వేది నేతృత్వంలో ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.
అంతేకాదు.. తన భర్త రహస్యంగా మరో మహిళను వివాహం చేసుకోబోతున్నాడని, లేదంటే వివాహం చేసుకున్నాడనే ఒక్క కారణం చాలూ.. ఆమె తన ప్రాణం తీసుకునేందుకు అంటూ కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కేసు వివరాలు..
వారణాసి మాండువాది చెందిన సుశీల్ కుమార్ అనే వ్యక్తి, అతని కుటుంబం మీద అతని భార్య చనిపోయే ముందు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన వెంటనే ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వాళ్ల మీద కేసు నమోదు అయ్యింది.
అయితే భార్య ఆత్మహత్యకు తామేమీ కారణం కాదని, కేసుల నుంచి ఉపశమనం ఇప్పించాలని సుశీల్ కోర్టులను ఆశ్రయించాడు. అయితే సుశీల్ కుమార్‌కు ఇదివరకే రెండు వివాహాలు అయ్యాయని, మరో వివాహం చేసుకోవడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ధృవీకరించినట్లయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment