wife husband
-
కలతలు లేని కాపురానికి సుధామూర్తి చెప్పిన సూపర్ టిప్స్
రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రముఖ విద్యావేత్త, దాత, రచయితగా పేరు తెచ్చుకున్న సుధామూర్తి తనదైన సూచనలు, సలహాలతో తన అభిమానులకు ప్రేరణగా నిలుస్తుంటారు. ఇటీవల వైవాహిక జీవితంలో భార్యాభార్తల సఖ్యతకు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన సూత్రాల గురించి తెలిపారు.సుధామూర్తి చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారు. ఆమె మాటతీరు, కట్టూ బొట్టూ, ప్రసంగాలు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఆమె నవ దంపతులకు కూడా చాలా కీలకమైన సలహాలు ఇచ్చారు.కలహాలు లేని కాపురం ఎక్కడా ఉండదుభార్యభర్తలమధ్య తేడాలు, అభిప్రాయభేదాలు రాకుండా ఉండవు. వస్తాయి. కానీ వాటిని చిలికి చిలికి గాలి వానలా మారకుండా ఇరువురూ జాగ్రత్త పడాలి. అసలు కలహాలు,కలతలు లేని కాపురాలు ఎక్కడ ఉంటాయి. తగాదాలు పడని వాళ్లు భార్యభర్తలే కాదు అంటూ సుధామూర్తి తెలిపారు. కానీ ఒకరు గట్టిగా మాట్లాడినపుడు, ఆగ్రహంగా ఉన్నపుడు ఇంకొకరు తగ్గాలి. ఇద్దరూ అరుచుకుంటూ ఉంటే సమస్య పరిష్కారం కాదు. శాంతి, సహనం అనేది ఇద్దరి మధ్య ఉండాలి. ఒకర్నొకరు గౌరవించుకోవాలిఒకళ్లు చెప్పింది మరొకరు వినాలి. ఒకరి విజ్ఞానాన్ని మరొకరు పంచుకోవాలి. ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకోవాలి.థ్యాంక్స్ చెప్పుకోవడం, ప్రశంసించుకోవడం ద్వారా ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం, ప్రేమ పెరుగుతుంది. భాగస్వామి చేసే చిన్న పనులను గుర్తించి మెచ్చుకోవాలని సుధా మూర్తి సూచించారు. కొన్ని విషయాల్లో ఎవరు ఒకరు రాజీ పడాలి. మార్పునకు సిద్ధంగా ఉండాలి. రిలేషన్ షిప్ కోసం కొన్ని విషయాల్లో రాజీ పడడం దీర్ఘకాలిక సంతోషాల్ని పంచుతుంది.బాధ్యలు బరువులు పంచుకోవాలిఇంట్లో, జీవితంలో బాధ్యతలను, బరువులను పంచుకోవడం చాలా ముఖ్యం. జీవితం అంటేనే కష్టనష్టాల పయనం. ఎవ్వరమూ పర్ఫెక్ట్ కాదు. లోటుపాట్లను గమనించుకొని అర్థం చేసుకొనిముందుకు సాగాలి. కష్టనష్టాలను, బరువు బాధ్యతలను సమానంగా పంచుకోవడంలోనే అసలైన భార్యభర్తల విలువ తెలుస్తుంది. అబ్బాయిలకో సలహాముఖ్యంగా ఈతరం అబ్బాయిలకు చెప్పేది ఒకటే. వంటగదిలో భార్యకు సహాయం చేయడం అనేది చాలా ముఖ్యం. జీవితభాగస్వామి కష్టాల్ని, బాధ్యతల్ని పంచుకోవడం ద్వారా టీం వర్క్,భాగస్వామ్య అనేభావాలను పెంపొదిస్తుంది. ఆధునిక ప్రేమ అనే అంశంపై ఏర్నాటు చేసిన ఒక కాంక్లేవ్‌లో సుధామూర్తి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగానే ఆమె యువ జంటలకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. దంపతులుగా తామూ ఈ విషయాలను పాటించామని, ఇవే తమ సక్సెస్ మంత్రా అని సుధామూర్తి వివరించారు. -
UK YouTuber Couple: ఆటోప్రయాణంలో అడుగడుగునా ఆనందమే వైరల్
ఇంగ్లాండ్‌కు చెందిన లియామ్, జావిన్ దంపతులకు మన దేశం అంటే చాలా ఇష్టం. ‘దోజ్ హ్యాపీ డేస్’ పేరుతో యూట్యూబ్ చానల్ నడుపుతున్న ఈ దంపతులు మన దేశానికి వచ్చారు. వారి స్థాయికి ఏ ఫైవ్‌స్టార్ హోటల్లోనో ఉండవచ్చు. ఖరీదైన కారులో ప్రయాణించవచ్చు. అలా కాకుండా ఈ డైనమిక్ ద్వయం ఒక ఆటోరిక్షాలో అమృత్సర్ నుంచి తమిళనాడు వరకు ఎన్నో ప్రాంతాలు పర్యటించింది. ఆటోకు ‘పీట్’ అని పేరు పెట్టి అందంగా అలంకరించారు. ఆటోడ్రైవింగ్ నేర్చుకున్నారు. చెన్నైలోని ట్రాఫిక్ ప్రాంతాల్లో డ్రైవింగ్ ప్రాక్టీస్ చేశారు. ‘ఫరవాలేదు. ఇక మనం ముందుకు వెళ్లవచ్చు’ అని నమ్మకం వచ్చిన తరువాతే ప్రయాణం ప్రారంభించారు. తమ ఆటో ప్రయాణంలో చెప్పలేనంత సందడి ఉన్న సంతలను, ధ్యానముద్రతో ఉన్న ప్రశాంత దేవాలయాలను, విభిన్న విశ్వాసాలు, ఆచారాల సామరస్య దృశ్యాలను, బాటసారులను, చెట్టుచేమను చూస్తూ ఎంజాయ్ చేశారు. నోరూరించే వంటకాలను ఆస్వాదించారు. -
భార్యాభర్తల మధ్య గొడవ! భర్త ఒక్కసారిగా..
పటాన్చెరు: భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్పూర్ పరిధిలోని పటేల్‌గూడ బీఎస్ఆర్ కాలనీకి చెందిన రాజుల ధర్మాంజనేయులు (38) పటాన్చెరు మండలం పాశంమైలారం పారిశ్రామిక వాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో కెమికల్ ఇంజనీర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం వారు ఉంటున్న ఇంటి మొదటి అంతస్తు నిర్మాణ ఖర్చుల విషయంలో భార్యాభర్తలు గొడవపడ్డారు. ఆదివారం ఉదయం డ్యూటీ నుంచి వచ్చిన ధర్మాంజనేయులు పిల్లల బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గది నుంచి ధర్మాంజనేయులు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో స్థానికుల సహకారంతో కుటుంబ సభ్యులు తలుపులు తీసి చూడగా ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రాజుల నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: వివాహానికై వచ్చి ఆర్మీ జవాన్ తీవ్ర నిర్ణయం! అసలు కారణాలేంటి? -
భర్త విడాకులు నోటీసు ఇచ్చారని..
తిరుపతి క్రైం: భర్త విడాకులు నోటీస్ ఇచ్చారని ఓ మహిళ మనస్తాపానికి గురై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. అలిపిరి సీఐ అబ్బన్న కథనం మేరకు.. శ్రీనివాసమంగాపురం గ్రామానికి చెందిన భారతి(45)కు నాగలాపురం గ్రామానికి చెందిన తులసీరామ్‌తో 26 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి నికిత(15) కుమార్తె ఉంది. తులసీరామ్ టీటీడీలో అసిస్టెంట్ షరాఫ్‌గా పని చేస్తున్నారు. తులసీరామ్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. గత ఐదేళ్లుగా వీరిద్దరూ దూరంగా ఉండేవారు. భారతి కూతురు నికితతో కలిసి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకనగర్ సీ టైప్ క్వార్టర్స్‌లో నివాసం ఉండేది. అయితే ఇటీవల తులసీరామ్ విడాకులు కావాలంటూ భారతికి నోటీసులు పంపించడంతో ఆమె తీవ్రంగా మనస్తాపానికి గురైంది. భర్త మేనమామ గోవిందరాజులు విడాకులు ఇవ్వాలని బలవంతం చేయడంతో ఏం చేయాలో తెలియకుండా గత నెల 31వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు గుర్తించి, ఆమెను రుయాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలు తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, భర్త తులసీరామ్‌తోపాటు వారి మేనమామను కూడా అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పెళ్లయిన నెల రోజులకే విభేదాలు.. కలిసి ఉండలేమంటూ కోర్టు మెట్లు
సాక్షి, పుట్టపర్తి: వందేళ్లు కలసి బతకాల్సిన వారు చిన్నపాటి కారణాలతో విడిపోతున్నారు. పెళ్లయిన ఆరు రోజుల నుంచి ఆర్నెల్లు గడవకముందే భాగస్వామి అర్ధం కావడం లేదనో, అర్ధం చేసుకోవడం లేదనో విడిపోవాలనుకుంటున్నారు. జీవితాంతం కలిసి ఉండే బలమైన బంధమే దాంపత్య జీవితం అని గుర్తించలేకపోతున్నారు. ఒకరి భావాలను ఒకరు అర్ధం చేసుకోకుండా తమ ఆలోచనల్ని గౌరవించడం లేదంటూ వేదనకు గురవుతున్నారు. ఇద్దరి మధ్య విభేదాల కారణంగా రెండు కుటుంబాల్లో మనస్పర్థలు వస్తున్నాయి. సర్దుకుపోతే ఎలాంటి సమస్య ఉండదని తెలిసినా.. విడాకుల వరకూ వెళ్తున్నారు. ● పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంతి గ్రామ్‌కు చెందిన 24 ఏళ్ల యువతికి పెనుకొండకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో గతేడాది వివాహమైంది. నెల రోజుల వ్యవధిలోనే దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ ఏడాది జనవరిలో పోలీస్ మెట్లు ఎక్కారు. ఇప్పటి వరకూ సమస్య తెగలేదు. పెద్ద మనుషుల సమక్షంలో సర్దిజెప్పినా వినలేదు. పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ● జగరాజుపల్లికి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి అదే గ్రామానికి చెందిన మహిళతో పదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన మూడేళ్ల నుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. ఆరేళ్లుగా పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. విడాకులు తీసుకోలేదు. పెద్ద మనుషుల సమక్షంలో కలిసి జీవిస్తామని వెళ్లినా తిరిగి వారం రోజులకే విడిపోయారు. వారి మధ్యలో ఇద్దరు కుమారులు తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవుతున్నారు. ● గోరంట్లకు చెందిన డిప్లొమా విద్యార్థికి బాగేపల్లికి చెందిన మెకానిక్‌తో ఏడాది క్రితం వివాహమైంది. మూడు నెలలకే గొడవలు మొదలయ్యాయి. అమ్మాయి పుట్టింటికి చేరింది. సర్దిజెప్పినా వినలేదు. తర్వాత అమ్మాయి ఇంటికే అబ్బాయి వచ్చాడు. నెల రోజుల తర్వాత పంచాయితీ మొదటికొచ్చింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. దంపతుల మధ్య సమస్య కారణంగా ఇరు కుటుంబాల్లో గందరగోళం నెలకొంది. అహమే కారణమా? ఏడడుగులు నడిచి ఏడాది గడవక ముందే ఎన్నో జంటలు విడిపోతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి తల్లిదండ్రులకు కన్నీరు మిగిలిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులను పోషించకపోవడం.. మరికొందరు తాగుడుకు బానిసై కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. మనుషుల మధ్య అహంతోనే ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలో చూసి రచ్చకెక్కుతున్నట్లు స్పష్టం అవుతోంది. ప్రతి సోమవారం నిర్వహించే పోలీసు స్పందన కార్యక్రమంలో భార్యభర్తల కేసులు పెరిగిపోతున్నాయి. వచ్చే పిటిషన్లలో మూడింట రెండోవంతు ఉంటున్నాయి. ఆధిపత్య ధోరణితోనే సమస్యలు కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. బండికి రెండు చక్రాలు సమానంగా.. సరిగ్గా ఉంటేనే ముందుకు వెళ్తుంది. అలా కాకుండా ఒకరు ఎక్కువ.. మరొకరు తక్కువ అనే ధోరణి ప్రదర్శిస్తుండటంతో గొడవలు పెరుగుతున్నాయి. తాము చెప్పిందే భార్య వినాలని కొంతమంది భర్తలు, తాను చెప్పినట్లే చేయాలని భార్యలు ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు. ఆమె మాటను ఆయన గౌరవించకపోవడం, ఆయనకు ఆమె విలువ ఇవ్వకపోవడంతోనే కాపురంలో కలతలు పెరుగుతున్నాయి. మొండి వైఖరి.. క్షమాపణ కోరితే పోయేదేమీ లేదు దంపతులు మొండి వైఖరి వీడి సామరస్యంగా మాట్లాడుకుంటే నాలుగు గోడల మధ్యనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎదుటి వారిపై ఆధిపత్యం ప్రదర్శించాలనే ధోరణి మానేయాలి. జీతాలు, హోదాలు ఎన్ని ఉన్నా కుటుంబం ముఖ్యమనే భావనతో మెలగాలి. దంపతుల మధ్య తగాదా వస్తే మూడో మనిషి దగ్గరకు వెళ్లకుండా ఉంటే మంచిది. తప్పెవరిదో తెలిస్తే క్షమాపణ కోరితే పోయేదేమీ లేదు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా పిల్లలు అనాథలుగా మారుతారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తగా అవగాహనతో ముందుకెళ్తే మంచిది. – ఎస్వీ మాధవ్‌రెడ్డి, ఎస్పీ -
అర్థం చేసుకుంటేనే బంధంలో ఆనందం
రాయచోటిటౌన్ : భార్యభర్తలు ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే బంధం ఆనందమయమని, సంసారం సంతోషంగా సాగుతుందని అన్నమయ్యజిల్లా ఎస్పీ గంగాధర్ రావు అన్నారు. తన భర్త ప్రతి రోజు వేధిస్తున్నాడని ఒక మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. భర్త అమ్మ నాన్నలు, ఆడబిడ్డలు అందరూ వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై దిశ పోలీసులను ఆశ్రయించింది. దిశ సీఐ చంద్రశేఖర్ శనివారం జిల్లా ఎస్పీతో కలసి భార్య భర్తలను ఒకే వేదికపై కుర్చోపెట్టి మాట్లాడించారు. చివరికి వారి తప్పులను తెలుసుకొనేలా తెలియచెప్పారు. కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదని దీనిని అర్థం చేసుకొంటేనే కాపురం సజావుగా సాగుతుందని విడమరిచి చెప్పారు. పూర్తిగా అర్థం చేసుకొన్న తరువాత ఇద్దరు సంతోషంగా ఇంటికి వెళ్లారు. వీరిని జిల్లా ఎస్పీ అభినందించారు. -
బ్లాక్ మెయిలింగ్: భర్త సంసారానికి పనికిరాడని తెలిసినా కూడా!
దిశ పోలీస్స్టేషన్లతో కొత్త దశ మొదలైంది. చిన్నారులు, మహిళల సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. ఇవి ఎన్నో సమస్యలు పరిష్కరిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల కాపురాలను చక్కదిద్దుతున్నాయి. కడప అర్బన్ : సమాజంలో భార్యాభర్తల అన్యోన్యతతో కుటుంబ అభివృద్ధి, తద్వారా పిల్లల శ్రేయస్సు, వారి ద్వారా సమాజాభివృద్ధి సుసాధ్యమవుతుంది. వారి మధ్య కలతలు కాపురంలో చిచ్చు రేపుతున్నాయి. గ్రామీణ స్థాయి నుంచి పట్టణ, నగర స్థాయికి వచ్చిన వారు తాము చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాల ‘బిజీ లైఫ్’తో తమ పిల్లల బాగోగులను పట్టించుకునే స్థితిలో వుండరు. దీంతో పిల్లలు శారీరక పెరుగుదల, ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు సాధిస్తున్నారు. కానీ తమ దైనందిన జీవితంలో తల్లిదండ్రులు, పెద్దలు, గురువులను ఎలా గౌరవించాలి. తాను జీవితాంతం తోడు నీడగా వుండాల్సిన భార్య, భర్త స్థానాలు ఎలా వుండాలి? అనే విధానాలపై ‘మానసిక పరిపక్వత’ చెందక అవగాహన రాహిత్యంతో ‘సంసార జీవితాల’ను దూరం చేసుకుంటున్నారు. పూర్వకాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు వుండేవి. అవ్వా,తాతలు తమ పిల్లలకు, మనువలు, మనువరాళ్లకు మంచి, చెడ్డా, కుటుంబ జీవన విధానం, సమాజంలో మెలిగే పద్ధతులను నేర్పించేవారు. రానురాను ఆ విధానంలో వచ్చిన మార్పులతో చిన్నచిన్న కుటుంబాలుగా విడిపోయి, జీవన విధానాలను నగరజీవితాలుగా మార్చుకుని భర్త,భార్య, పిల్లలుగా మారిపోయి ఆర్థికంగా మెరుగు పడాలనే తాపత్రయంలో పడిపోయారు. కాలక్రమేణ వారి పిల్లల కార్పొరేట్ చదువులపై వున్న శ్రద్ధ, వారి క్రమశిక్షణతో జీవితాన్ని సాగించేలా చూడాలనే విధానం సన్నగిల్లిపోయింది. అంతేగాక ఆడ,మగ పిల్లలను చిన్నతనం నుంచే వారికి ఇచ్చే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలతో పెరిగి పెద్దవాళ్లయిన తరువాత కూడా అదే విధానం అవలంబించడం వల్ల జీవితగమనంలో విభేదాలు తలెత్తుతున్నాయి. సమస్యల చుట్టూ పరిభ్రమిస్తున్న జీవితాలు ► ఆధునిక సాంకేతికతతో ‘సెల్‌ఫోన్’ లేకుండా చిన్న పిల్లాడి నుంచి పెద్దల వరకు వుండలేకపోతున్నారు. ‘సెల్‌ఫోన్’ దైనందిన జీవితంలో భాగమవడంతోపాటు, వ్యసనంగా మారింది. ‘దిశ’ మహిళా అప్‌గ్రేడ్ పోలీస్‌స్టేషన్ వారు భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్న కలతలకు కారణాలను తెలుసుకుని ‘కౌన్సెలింగ్’ అనే బ్రహ్మాస్త్రంతో తొలగించేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నారు. ఈ విధానం ద్వారా చాలా కేసుల్లో విజయవంతంగా ముందుకు వెళుతున్నారు. ► 18 ఏళ్ల వయసు రాగానే, పూర్తవకముందే కొందరు ఆడపిల్లలు తల్లిదండ్రులను సైతం లెక్కచేయకుండా తాను ప్రేమించిన యువకుడే సర్వస్వం అంటూ ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఎంత త్వరగా జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నారో, వీరిలో కొందరు అంతే త్వరగా విడిపోవడానికి సిద్ధపడుతున్నారు. ► కొందరు తమ సెల్ఫోన్ల ద్వారా ఇంటిలో పడకగది నుంచి స్నానాల గదుల వరకు ఒకరిపై మరొకరు నమ్మకం లేక వీడియోలను తీసుకుంటూ వారి సంసారాన్ని వారే నాశనం చేసుకుంటున్నారు. ► విద్యావంతులైన వారే కొందరు ఆడపిల్లలు తమ వైవాహిక జీవితాన్ని ఆరు నెలలకు గానీ, ఏడాది పూర్తవక ముందే భర్త సంసారానికి పనికిరాడని నిర్ణయించుకుంటున్నారు. ‘కౌన్సెలింగ్ పీరియడ్’ రెండు నెలల కాలం పూర్తవక ముందే ‘కక్షసాధింపు’ ధోరణిలో ప్రవర్తిస్తూ విడిపోతున్నారు. కడప ‘దిశ’ పోలీస్ స్టేషన్ ద్వారా అందిస్తున్న సేవలు ► కడప దిశ పోలీస్‌స్టేషన్‌కు నేరుగాగానీ, జిల్లా ఎస్పీ నిర్వహించే ‘స్పందన’ ద్వారా వచ్చే భార్యాభర్తల, మహిళల, చిన్నపిల్లల సమస్యలు, నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను డీఎస్పీ స్థాయి అధికారి దృష్టికి వస్తాయి. ఆయన ఆదేశాల మేరకు మొదట బాధితుల సమస్యలను తెలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య ప్రాథమికంగా మనస్పర్థలను తొలగించేందుకు ఇక్కడి సిబ్బంది ప్రయత్నిస్తారు. లేదంటే మొదటి రెండు నెలలు ‘కూలింగ్ పీరియడ్’లో మూడు లేదా ఐదు కౌన్సెలింగ్‌లను నిర్వహించి వారి మధ్య విభేదాలను తొలగించి సజావుగా కాపురం చేసుకునేలా ప్రయత్నిస్తారు. కలువలేని పరిస్థితుల్లో వారి ఇష్ట ప్రకారం ఎఫ్.ఐ.ఆర్‌లను తమ పరిధిలో గానీ, ఆయా పోలీస్స్టేషన్ల ద్వారా నమోదు చేయిస్తారు. తరువాత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఈ కౌన్సెలింగ్‌లను ప్రతి మంగళవారం, శనివారం నిర్వహిస్తారు. ఈ కౌన్సెలింగ్‌కు భార్యాభర్తలను విడివిడిగా పోలీసు అధికారి, మనస్తత్వశాస్త్ర నిపుణులు, న్యాయవాదులు, ఎన్జీఓ సంఘానికి చెందిన సభ్యుల సమక్షంలో విచారణ చేస్తారు. తరువాత ఇద్దరిని కలిపి విచారణ చేసి విడిపోతే కష్ట,నష్టాలు, కలిసుంటే జీవితాంతం సంసారం సాఫీగా సాగుతుందని ‘పోస్ట్ మేరిటల్ కౌన్సెలింగ్’ విధానం ద్వారా వివరిస్తారు. గతంలో ప్రతి మంగళవారం, శనివారం కౌన్సెలింగ్‌ను ఐదు జంటలలోపు నిర్వహించేవారు. ప్రస్తుతం 10 నుంచి 15 జంటలకు నిర్వహించాల్సి వస్తోంది. ► కొందరు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు తమ ఆడపిల్లలకు తక్కువ వయసులోనే వివాహం చేస్తుంటారు. వారికి వైవాహిక జీవితంపై అవగాహన వుండదు. అలాంటి జంటలకు కౌన్సెలింగ్ ద్వారా వారి మధ్య మనస్పర్థలు తొలగించి, వారిని ఒక్కటిగా చేసి పంపిస్తున్నారు. ► ఉద్యోగం వుంటే ఆర్థిక స్వేచ్ఛ కలిగి వుంటుందని కొందరు మహిళలు గానీ, పురుషులుగానీ వివాహేతర సంబంధాలు, రెండో వివాహంపై మొగ్గు చూపుతూ సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో కొందరిని కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా కలుపుతున్నారు. కొందరు ఎన్ని కౌన్సెలింగ్‌లు నిర్వహించినా అవగాహన రాహిత్యంతో దూరంగానే వుంటున్నారు. మచ్చుకుకొన్ని.. ► పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాక తన భర్త సంసారానికి పనికిరాడని తెలుసుకుని తల్లిదండ్రులకు చెప్పలేక తనలోనే కుమిలిపోయి నరకం అనుభవించింది. డబ్బుల కోసం తన భర్త మరో వివాహానికి సిద్ధపడితే పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు వాస్తవాలను విచారణ చేసి వారు విడిపోతేనే మంచిదని భావించారు. ► తనను ప్రేమించిన సమయంలో ఫొటోలు తీసుకున్న యువతిని, వేరే వివాహం చేసుకున్న తరువాత ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలుగా మార్చి ‘బ్లాక్ మెయిలింగ్’కు పాల్పడిన ఓ యువకుడిని పిలిపించి, సదరు న్యూడ్ ఫొటోలను తొలగించి, చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం జరిగేలా కృషి చేశారు. ► ఓ తొమ్మిదినెలల పసిబాబును, భార్యను మనస్పర్థలతో దూరం చేసుకున్న భర్తను ఒకేఒక్క కౌన్సెలింగ్ ద్వారా వారిని కలిపి పంపించారు. ► కొందరు భర్తలు మద్యం, ఇతర చెడు వ్యసనాలకు బానిసలుగా మారి వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం, అవసరమైతే ‘డీ ఆడిక్షన్’ సెంటర్లకు పంపించి వారిని కలిపేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నారు. కౌన్సెలింగ్ ద్వారానే మనస్పర్థలకు చెక్ భార్యాభర్తల మధ్య ఏర్పడిన విభేదాలను తొలగించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది సహకారంతో కృషి చేస్తున్నాం. ప్రతి మంగళ, శనివారాలలో ‘కౌన్సెలింగ్’ను నిర్వహించి వారి మధ్య అభిప్రాయ భేదాలను తొలగించి న్యాయం జరిగేలా చూస్తున్నాం. మహిళలు, చిన్నారుల పట్ల జరిగే నేరాల నియంత్రణకు అహర్నిశలు పనిచేస్తున్నాం. ‘దిశ’ యాప్‌ను జిల్లా వ్యాప్తంగా మహిళల చేత డౌన్లోడ్ చేయించాం. ఆపద సమయాలలో ఆదుకుంటున్నాం. – ఎస్.రమాకాంత్, కడప ‘దిశ’ డీఎస్పీ -
Wife - Husband: క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం
కర్నూలు/ఆలూరు/దేవనకొండ: జీవితాంతం తోడునీడగా ఉంటామని బాస చేసి ఒక్కటైన దంపతులు బలవంతంగా ఈ లోకాన్ని వీడి వెళ్లారు. ఏడు నెలల కుమారుడిని ఒంటరి వాడిని చేశారు. దేవనకొండ మండలం గుడిమిరాళ్ళ గ్రామానికి చెందిన రంగనాయకులు (28) ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఈయనకు పత్తికొండ మండల చిన్నహుల్తి గ్రామానికి చెందిన లత (25)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడు నెలల కుమారుడు ఉన్నాడు. రెండు రోజుల క్రితం రంగనాయకులు ఆస్తి విషయంలో భార్యతో గొడవ పడడంతో ఆమె క్షణికావేశానికి గురై శనివారం ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినా ఫలితం లేక ఆమె అదే రోజు అర్ధరాత్రి మృతి చెందింది. భార్య మరణం తట్టుకోలేక భర్త రంగనాయకులు మనస్తాపానికి గురై ఆదివారం తెల్లవారుజామున కర్నూలులోని కోట్ల రైల్వే స్టేషన్‌కు వెళ్లి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రమాదంలో తలమొండెం వేర్వేరయ్యాయి. అంతకుముందు తన దగ్గర ఉన్న రూ.50వేలు సోదరుడు బాలమురళికి అప్పజెప్పాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతదేహం పక్కనే పడి ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా చిరునామా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. రంగనాయకులకు సంబంధించి రైల్వే పోలీసులు, లతకు సంబంధించి దేవనకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. -
భర్తపై కిరోసిన్ పోసి నిప్పు అంటించిన భార్య..
తిరువొత్తియూరు: దిండివనంలో మద్యం మత్తులో వేధింపులు ఇస్తున్న భర్తపై కిరోసిన్ పోసి నిప్పు అంటించి హత్య చేసిన భార్యకు దిండివనం కోర్టు యావజీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. విల్లుపురం జిల్లా రెడ్డివనం టీవీ నగర్లో నివాసం ఉంటున్న దక్షిణామూర్తి కుమారుడు సేదు అలియాస్ సేదుపతి (23) పుదుచ్చేరిలో ఉన్న పంచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మురుగవేణి (19)ని 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరు గుడిసె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. 2019 ఆగస్టు ఒకటో తేదీన ఇంట్లో నిద్రిస్తున్న సేతుపతి గుడిసెకు నిప్పు అంటుకోవడంతో మృతిచెందాడు. ఫిర్యాదు మేరకు దిండివనం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇంటికి నిప్పు అంటుకున్న సమయంలో ఇంటి బయట తలుపు వేసి ఉన్నట్లు తెలిసింది. దీంతో మురగవేని వద్ద పోలీసులు విచారణ చేయగా మద్యం మత్తులో తరచూ అతను వేధిస్తుండడంతో కిరోసిన్ పోసి ఇంటికి నిప్పు అంటించినట్లు ఒప్పుకుంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దిండివనం అదనపు జిల్లా సెసెన్స్ కోర్టులో విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి రహమాన్ మురుగవేనికి యావజ్జీవ శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు. మురుగవేనిని కడలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. -
నా మొగుడు ఏం చేసినా పర్లేదు.. అమ్మాయిలతో తిరిగినా నాకు కావాల్సింది అదే!
వాషింగ్టన్: భార్యాభర్తల బంధం అన్నింటికంటే దృఢమైంది అంటారు. పెళ్లయ్యాక పతియే తన సర్వస్వంగా భావిస్తుంటారు మహిళలు. ఒకరిపైఒకరు ప్రేమానురాగాలు చూపుతూ ఆనందంగా జీవిస్తారు. వైవాహిక బంధంలో నిజాయితీ, విధేయతతో ఉండాలనుకుంటారు. అలాంటిది తన భర్త మరో మహిళలో సన్నిహితంగా మెలిగితే? మరొకరితో శారీరక సంబంధం పెట్టుకుంటే? ఏ భార్య అయినా భరిస్తుందా? ఆమె కోపం ఎలా ఉంటుందో కూడా ఉహించుకోలేం.. కానీ అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. తన భర్తను ఇతర మహిళలతో సన్నిహితంగా ఉండమని ఆమే ప్రోత్సహిస్తోంది. వాళ్లతో శారీరకంగా కలిసినా పర్వాలేదు అంటోంది. ఆయన ఎవరితో వెళ్లినా, ఏం చేసినా సరే.. సంతోషంగా ఉంటే చాలట. ఆయన హ్యాపీగా ఉంటే తనకు అదే చాలు అని ఆనందంగా చెబుతోంది. ఇది భార్యగా తన బాధ్యత అంటోంది. ఈ మాటలు విన్నాక ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పండి. ఈరోజుల్లో ఇలాంటి భార్యలు కూడా ఉంటారా? అని అనుకుంటారు కదా.. భర్తకు ఇంత ఫ్రీడం ఇచ్చి ఈమె పేరు మోనికా హల్ట్. వయసు 37 ఏళ్లు. భర్త పేరు జాన్. పెళ్లయ్యాక ఇంటికే పరిమితమైంది. రోజంతా ఇంటిపనులే చేస్తూ తీరకలేకుండా ఉంటోంది. జాన్‌కు ఇష్టమైన వంటలు చేసిపెట్టడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతకడం, ఇతర పనులు చేసుకోవడమే ఈమె దినచర్య. అందుకే జాన్‌తో బయటకు వెళ్లే సమయం కూడా ఉండదు. ఈ కారణంగానే భర్తను ఇష్టమైన వారితో గడపమని ఆమే స్వయంగా చెబుతోంది. జాన్‌కు ఏదీ సంతోషం అయితే అది నిరభ్యంతరంగా చేసుకోవచ్చని ప్రోత్సహిస్తోంది. అతను ఇతర మహిళలతో శృంగారంలో పాల్గొన్నా తాను అసలు బాధపడనని అంటోంది. అలాగే తాను రోజు ఏ దుస్తులు ధరించాలో కూడా భర్తే డిసైడ్ చేస్తాడని, ఆయన చెప్పింది తూచ తప్పకుండా పాటిస్తాని మోనికా పేర్కొంది. సెక్సీ, స్పోర్టీ డ్రస్సులంటే తన భర్తకు ఇష్టమని తాను ఇంట్లో అవే ధరిస్తానని వివరించింది. తాను మేకప్ వేసుకుంటే జాన్‌కు అస్సలు నచ్చదని, అందుకే నేచురల్‌గానే ఉంటానంటోంది. భర్తలు వేరే వాళ్లతో మాట్లాడితేనే ఊరుకోని మహిళలు ఉన్న ఈరోజుల్లో ఇలాంటి భార్య దొరకడం నిజంగా జాన్ అదృష్టం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. చూస్తే గుండె గుభేల్..! -
ఫిలిప్పీన్స్‌లో పంజాబీ దంపతుల దారుణ హత్య.. ఇంట్లోకి వెళ్లి కాల్పులు..
మనీలా: పంజాబ్‌కు చెందిన దంపతులు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో దారుణ హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దుండగుడు తుపాకీతో ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపి ఇద్దరినీ హతమార్చాడు. హత్యకు గురైన భార్యాభర్తలను సుఖ్వీందర్ సింగ్(41), కిరణ్‌దీప్ కౌర్(33)గా గుర్తించారు. ఇద్దరూ పంజాబ్ జలంధర్ జిల్లా గొరాయాకు చెందినవారు. సుఖ్వీందర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన కాసేపటికే ఓ దుండగుడు తుపాకీతో వెళ్లి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. మొదట భర్తపై కాల్పులు జరిపి, ఆ తర్వాత భార్యపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుఖ్వీందర్ 19 ఏళ్ల క్రితమే ఫిలిప్పీన్స్ వెళ్లి స్థిరపడ్డాడు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితమే కిరణ్‌దీప్ కౌర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం ఎన్నిసార్లు ఫోన్ చేసినా సుఖ్వీందర్ కాల్ లిఫ్ట్ చేయలేదని అతని తమ్ముడు లఖ్వీర్ సింగ్ చెప్పాడు. దీంతో దగ్గర్లోనే ఉన్న తమ అంకుల్‌ను వెళ్లి చూడమన్నానని, అప్పటికే ఇద్దరూ చనిపోయి రక్తపు మడుగులో ఉన్నారని పేర్కొన్నాడు. చదవండి: యూఎస్ టేనస్సీ: స్కూల్లో పూర్వ విద్యార్థి కాల్పులు.. చిన్నారులు, సిబ్బంది మృతి -
తిరుపతిలో దారుణం.. భర్తకి భార్య ప్రియుడి శిరోముండనం
సాక్షి, తిరుపతి: జిల్లాలోని చంద్రగిరి మండల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తన భార్య వివాహేతర సంబంధం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ భర్త. తమ గుట్టును బయటపెట్టడం భరించలేని ఆమె ప్రియుడు.. ఆ భర్తపై పైశాచిక చేష్టలకు దిగాడు. ఆ భర్తకి శిరోముండనం చేసి.. మూత్రం పోశాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. చంద్రగిరి మండలం రంగంపేట గ్రామంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో హర్షవర్థన్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, ఆమెను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడని, రిప్(RIP) అంటూ ఓ వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. అది చూసిన ఆ ప్రియుడు హర్షవర్ధన్ రగిలిపోయాడు. బాధిత భర్తను దొరకబుచ్చుకుని గుండు కొట్టించాడు. ఆపై అతనిపై మూత్రం పోశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపుతామంటూ అతన్ని బెదిరించారు కూడా. అయితే.. ఈ చేష్టలను అడ్డుకోకపోగా.. కొందరు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో పోలీసులకు విషయం చేరింది. ఈ దారుణానికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు ధృవీకరించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి హర్షవర్దన్‌తో పాటు అతని అనుచరుడు అన్వర్‌ను, వీళ్లకు సహకరించిన మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జరిగిన అవమానంతో బాధిత భర్త అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. -
గిరి పల్లెలో విషాదం.. భార్య మృతిని తట్టుకోలేక భర్త కూడా..
సాక్షి, అల్లూరి: చింతూరు మండలంలోని కలిగుండం అనే గిరిజన పల్లెలో విషాదం చోటు చేసుకుంది. భార్య, భర్తల మధ్య చెలరేగిన మనస్పర్థలు వారి బలన్మరణానికి కారణమయ్యాయి. భర్త కొట్టాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. అయితే.. ఆమె మృతిని తట్టుకోలేక భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలాఉన్నాయి. భార్యాభర్తలైన కుంజా భద్రయ్య(70), కుంజా సమ్మక్క(65)బంధువుల ఇంట్లో జరిగిన దినకార్యానికి వెళ్లి ఇంటికి తిరిగివచ్చారు. తనకు భోజనం పెట్టమని భార్య సమ్మక్కను భర్త భద్రయ్య కోరగా నువ్వే పెట్టుకుని తినమని భార్య చెప్పింది. దీంతో ఆగ్రహించిన భద్రయ్య భార్యను కర్రతో కొట్టడంతో ఆమె మనస్తాపానికి గురైంది. ఇంట్లోని పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతిని తట్టుకోలేని భర్త భద్రయ్య కూడా పురుగు మందు సేవించి అపస్మారక స్థితికి చేరాడు. దీంతో అతనిని సమీపంలోని ఏడుగురాళ్లపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదగిరి తెలిపారు. -
'నా భర్త గే.. ఎంత ట్రై చేసినా దగ్గరకు రానివ్వట్లేదు..' కోర్టు కీలక తీర్పు
ముంబై: ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త స్వలింగ సంపర్కుడని, ఈ విషయం దాచి తనను పెళ్లి చేసుకున్నాడని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. పెళ్లయిన తర్వాత ఆయనకు దగ్గరయ్యేందుకు ఎంత ట్రై చేసినా ఫలితం లేకపోయిందని, ఆయనకు పురుషులతో శారీరక సంబంధాలు ఉన్నాయని చెప్పింది. అంతేగాక తనను శారీరకంగా వేధిస్తున్నాడని, దుర్భాషలాడుతూ తన ఆర్థిక పరిస్థితి, కుటుంబాన్ని కించ పరిచేలా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించింది. అయితే వాదనలు విన్న న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. గే అని దాచినందుకు ఆమెకు రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలని, అలాగే ప్రతి నెల రూ.15వేలు ఆర్థిక సాయం అందించాలని ఆదేశించింది. మెజిస్ట్రేట్ కోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది. ఈ తీర్పును ముంబై సెషన్స్ కోర్టులో సవాల్ చేశాడు భర్త. ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. ఆమెకు రూ.లక్ష, ప్రతి నెల రూ.15 చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ దంపతులకు 2016లో వివాహం జరిగింది. పెళ్లై రోజులు గడుసున్నా ఆమెను అతడు దగ్గరకు రానివ్వలేదు. హింసించడం మొదలుపెట్టాడు. అనుమానంతో అతడ్ని గమనించిన భార్య.. చివరకు గే అని కనిపెట్టింది. ఇతర పురుషులతో అతడు నగ్నంగా దిగిన ఫొటోలోను అతని ఫోన్లో చూసింది. వాటినే కోర్టుకు సాక్ష్యంగా సమర్పించింది. చదవండి: డబ్బు విషయంలో భర్తతో గొడవ.. 8 ఏళ్ల కుమారుడ్ని కాలువలోకి విసిరి.. -
భార్య హత్యకు స్కెచ్.. ఊహించని పరిణామంతో పరుగులు
ఆ తాగుబోతు భర్తతో రోజూ ఆమెకు గొడవే. ఇక భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అది అవమానంగా భావించి.. ఆమెను ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశాడు. చివరికి ఆ భర్తకే పెద్ద షాకే తగిలింది. భార్యకు బదులుగా ఆమె తల్లి కన్నుమూసింది. దీంతో ఆ భర్త అక్కడి నుంచి పరుగులు అందుకున్నాడు. మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లా కోట్వాలి స్టేషన్ పరిధిలోని సైఖేదా గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. నిత్యం తాగుతూ ఉండే ఆ భర్త.. రోజూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఇద్దరూ గొడవ పడ్డారు. భర్తను భరించలేక.. నానా తిట్లు తిట్టి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపం పెంచుకున్న ఆ తాగుబోతు.. అత్తింటికి వెళ్లి మరీ భార్యను చంపాలని అనుకున్నాడు. సోమవారం సాయంత్రం అత్తింటికి వెళ్లి.. బయట ఉన్న ఇనుప గేటుకు కరెంట్ వైర్లను కనెక్ట్ చేశాడు. అయితే భార్య బదులు ఆమె తల్లి వచ్చి గేట్‌ను ముట్టుకుంది. దీంతో కరెంట్ షాక్‌తో విలవిలలాడి అక్కడికక్కడే ఆ మహిళ(55) మృతి చెందింది. అది చూసి స్థానికులు కేకలు వేయగా.. ఊహించని పరిణామంతో భయాందోళనకు గురై ఆ భర్త అక్కడి నుంచి పారిపోయాడు. దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూడగా.. పరారీలో ఉన్న తాగుబోతు భర్త గురించి పోలీసులు వెతుకుతున్నారు. ఇదీ చదవండి: గంజాయికి బానిసైన కొడుకు.. నల్లగొండలో దారుణ హత్య -
తాజా తీర్పు: పోల్చి తిడితే ఇంతే సంగతులు
భర్తల నోటికి తాళం. భార్యల వేదనకు ఈ తీర్పు ఒక అవసరం. ఇరుగింటామెతోనూ పొరుగింటామెతోనూ సినిమా హీరోయిన్‌తోనూ పోల్చి భార్యను చులకన చేస్తే సూటిపోటి మాటలంటే అది ‘మానసిక క్రూరత్వం’ కిందకే వస్తుందని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అటువంటి భర్తతో కాపురం చేయనవసరం లేదని విడాకులు మంజూరు చేసింది. గతంలో ముంబై ఫ్యామిలీ కోర్టు కూడా ‘ఆ నువ్వు పెద్ద మగాడివని’ లాంటి గుచ్చే మాటలు మాట్లాడే భార్య నుంచి విడాకులు ఇప్పించింది. భార్యాభర్తలు ఇలాంటి మాటలు అనుకోవడం ఎందుకు? భార్యను చులకన చేయడం భర్తకు సమాజం నుంచి కుటుంబం నుంచి అంగీకారం పొందిన విషయంగా అనిపిస్తుంది. సినిమాల్లో పాత్రలు, టీవీల్లో స్కిట్లు భార్యను భర్త నానా విధాలుగా హేళన చేయడం చూపిస్తూనే ఉంటాయి. ‘మసిబొగ్గులా ఉన్నావు’, ‘బోండాంలా ఉన్నావు’, ‘నిన్ను చేసుకునే బదులు అడవిలో మొద్దును చేసుకుని ఉంటే నయం’, ‘ఏదో ఒక మాయలో పడినట్టుగా నిన్ను చేసుకున్నాను. కాని నీలో ఏ ఆకర్షణ లేదు’, ‘ఆ ఎదురింటామెను చూడు ఎంత అందంగా ఉందో’, ‘ఇదంతా నా ఖర్మ’... ఇలాంటి మాటలు భర్త మాట్లాడితే భార్య లోలోపల బాధ పడటమో తిరిగి తగాదా పడటమో చేస్తూ ఉంటుంది. కాని ‘ఇది అవసరమా నాకు’ అని భార్య అనుకుంటే విడాకులు మంజూరు చేయడానికి ఈ కారణం సరిపోతుందని తాజాగా కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కేరళ హైకోర్టు బెంచిలో జస్టిస్ కె.నరేంద్రన్, సి.ఎస్.సుధ ఈమేరకు తీర్పు వెలువరించారు. ఏమిటి కేసు? కేరళలో ఒక జంట 2009లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఆమెకు 26. అతనికి 29. పెళ్లయిన తర్వాత భర్త కొత్త పెళ్లికూతురు అని కూడా చూడక వెంటనే ఇతర స్త్రీలతో పోల్చసాగాడు. ‘నీకన్నా ఆమె బాగుంది’, ‘ఆమెకున్న మంచి జుట్టు నీకు లేదు’ లాంటి కామెంట్లు చేసేవాడు. అతని తమ్ముడు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే పెళ్లిచూపులకు అన్నగా హాజరయ్యి భార్యతో ‘నా తమ్ముడు అదృష్టవంతుడు. మంచి అమ్మాయిలను వెతుకుతున్నాడు’ లాంటి కామెంట్లు చేసేవాడు. దాంతో ఆమె కనీసం ఆరునెలలు కూడా అతనితో కాపురం చేయలేకపోయింది. జనవరిలో పెళ్లయితే నవంబర్‌లో విడాకులకు ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసింది. ఫ్యామిలీ కోర్టు ‘లైంగిక దూరాన్ని’ కారణంగా చూపుతూ విడాకులు మంజూరు చేసింది. దాని మీద భర్త హైకోర్టుకు అప్లయి చేశాడు. కేరళ హైకోర్టు కూడా తాజాగా విడాకులే సబబైనవిగా తీర్పు ఇచ్చింది. మానసిక క్రూరత్వం ఈ కేసులో విడాకులకు కనిపించే సగటు కారణాల కన్నా భర్త తన భార్యను ఇతర స్త్రీలతో పోల్చుతూ చిన్నబుచ్చడాన్నే హైకోర్టు ప్రధాన కారణంగా తీసుకుంది. దానిని ‘మానసిక క్రూరత్వం’గా వ్యాఖ్యానించింది. అలాంటి క్రూరత్వంతో బంధం నిలవదు అని చెప్పింది. ‘వారు మంచి వయసులో ఉన్న జంటే అయినా ఈ కేసు కొనసాగిన ఇన్నేళ్లుగా తిరిగి కలవలేదు. భాగస్వాములలో ఒకరు విడాకులకు దరఖాస్తు చేసి, ఏళ్ల తరబడి ఇద్దరూ విడిగా ఉండగా ఆ పెళ్లి కుటుంబాలకు, సంఘానికి చెప్పుకోవడానికి ఉంటుందిగాని నిజంగా మనలేదు’ అని విడాకులు మంజూరు చేసింది. భర్తను చిన్నబుచ్చినా అంతే! అయితే 2013లో ముంబై ఫ్యామిలీ కోర్టులో భర్త తరఫు నుంచి ఇటువంటి తీర్పే ఇచ్చింది. భార్య భర్తను ‘నువ్వు పెద్ద మగాడివిలే’, ‘నేను సరిగా ఏడ్చి ఉంటే మావాళ్లు నీకంటే తెలివైన, మంచి కుటుంబం నుంచి కుర్రాణ్ణి వెతికి ఉండేవారు’, ‘నాకు నువ్వు ఏమాత్రం సరి తూగవు’ లాంటి మాటలతో బాధించేది. అప్పటికి వారికి పెళ్లయి పదేళ్లు. ఇద్దరు పిల్లలు. కాని భర్త అలసిపోయి ఆఫీసు నుంచి వస్తే ‘ఒక ముద్దు ముచ్చట లేదు. మగాడివైతేగా’ వంటి మాటలతో బాధించేది. ఏమైనా అంటే ‘ఉరేసుకుని చస్తా’ అని బెదిరించేది. ఈ మాటలన్నింటినీ కోర్టు ‘మానసిక క్రూరత్వం’గా పరిగణించి విడాకులు ఇచ్చింది. ముఖ్యంగా ‘ఆత్మహత్య బెదిరింపులు’ భర్తకు నరక ప్రాయం అవుతాయని వ్యాఖ్యానించింది. ఎందుకు ఈ మాటలు? భార్యాభర్తల మధ్య ప్రేమ, స్నేహం, గౌరవం, సర్దుబాటు ధోరణి, అవగాహన, అర్థం చేసుకోవడం, బలహీనతలను గుర్తించడం, ఎదుటివారికి ఏ పని నచ్చదో దానిని వదలిపెట్టడం... ఇవన్నీ ఉంటే తప్ప కాపురం సజావుగా సాగదు. పెళ్లయ్యాక ఒకరికొకరు సరిపడరు అని అనుకుంటే విడిపోవడం లేదా మౌనంగా కొనసాగడం మేలు. కాని మాటలు చాలా గాయం చేస్తాయి. నిజానికి అవి వంటి మీద పడే దెబ్బల కంటే తీవ్రమైనవి. మాటలతో హింసించి సంతృప్తి పడదామంటే కాలక్రమంలో ఆ బంధం మరింత పలుచనవుతుంది తప్ప గట్టి పడదు. కాబట్టి తిడితే ఏమవుతుందిలే అని భార్య/భర్త అనుకోవద్దు. విడాకులకు అవి చాలు. -
Crime News: ఎంత పని చేశావ్ రమావతి!
భార్యభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు.. అప్పటికో, కాసేపటికో సర్దుకుపోవడం కూడా సహజమే. కానీ, ఒక్కోసారి అవి విపరీతాలకు కూడా దారి తీస్తుంటాయి. భార్యపై చెయ్యి చేసుకున్న ‘పాపాని’కి.. కలలో కూడా ఊహించని శిక్షపడింది ఆ భర్తకు. భార్యను ఎత్తుకెళ్లి.. హత్య చేసిన కేసులో ఓ భర్తకు పదేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ కేసులో దాదాపు ఎనిమిదేళ్లపాటు పోలీసు విచారణ సాగడం గమనార్హం. ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్ మీద వచ్చాడు అతను. మరో నాలుగేళ్ల తర్వాత.. ఈ మధ్యే మబ్బులు వీడిపోయే వార్త ఒకటి అతని చెవిన పడింది. అతని భార్య బతికే ఉందని! ఉత్తర ప్రదేశ్ బహ్రాయిచ్ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. అక్కడి ఏఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జాంపూర్ గ్రామానికి చెందిన కంధాయ్ అనే వ్యక్తి 2006లో అదే గ్రామానికి చెందిన రమావతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే.. మూడేళ్ల తర్వాత అంటే 2009లో ఓరోజు హఠాత్తుగా ఆమె కనిపించకుండా పోయింది. దీంతో రమావతి కుటుంబ సభ్యులు కంధాయ్‌ను కోర్టుకు ఇడ్చారు. తమ బిడ్డను ఎత్తుకెళ్లి హత్య చేశాడని కేసు నమోదు చేయడంతో విచారణ కొనసాగింది. ఎనిమిదేళ్లు అయినా రమావతి తిరిగి రాకపోవడంతో చనిపోయి ఉంటుందని పోలీసులు నిర్ధారించుకున్నారు. అదే సమయంలో కంధాయ్‌కు వ్యతిరేకంగా ఆమె కుటుంబ సభ్యులు సాక్ష్యం చెప్పడంతో.. 2017లో స్థానిక కోర్టు అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆరు నెలల శిక్ష తర్వాత అలహాబాద్ హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు అతను. అయితే కంధాయ్ కూడా ఊహించని ట్విస్ట్ ఒకటి బయటపడింది ఈమధ్యే. బంధువులతో పరుగున.. రమావతి, కంధాయ్ ఇరు కుటుంబాలకు దగ్గరి బంధువైన ఓ వ్యక్తి.. ఈమధ్యే రమావతి సోదరి ఇంటికి వెళ్లాడు. అక్కడ రమావతిని చూసి షాక్ తిన్నాడు అతను. వెంటనే విషయాన్ని కంధాయ్‌కు చేరవేశాడు. భార్య బతికే ఉందన్న విషయం తెలిసిన కంధాయ్.. ఆలస్యం చేయకుండా తన బంధువులతో రమావతి సోదరి ఇంటికి చేరుకున్నాడు. ఈలోపు పోలీసులకు సైతం సమాచారం ఇవ్వడంతో వాళ్లు అక్కడికి వచ్చారు. అంతా రమావతిని చూసి కంగుతిని.. అసలు విషయాన్ని ఆరా తీసేందుకు ఆమెను వన్ స్టెప్ సెంటర్(మహిళా సంక్షేమ కేంద్రం)కు తీసుకెళ్లి విచారించారు. చాయ్ విషయంలో జరిగిన గొడవతో భర్త తనపై చెయ్యి చేసుకున్నాడని, అది నచ్చకనే భర్తను జైలు పాలు చేయాలని ఇలా చేశానని అసలు విషయం చెప్పుకొచ్చిందామె. ఆమె చెప్పిన కారణం విని కంగుతిన్న భర్త, పోలీసులు, బంధువులు.. ఇన్నేళ్లపాటు ఆమె తన జాడను గోప్యంగా ఉంచడంపై ఆశ్చర్యపోతున్నారు. ఆమె అజ్ఞాతవాసం-కంధాయ్ కారాగారవాసం వెనుక రమావతి కుటుంబ ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇవాళ(సోమవారం) రమావతిని కోర్టులో హాజరుపర్చగా.. కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది కోర్టు. -
ఆ ఆపరేషన్ మాకోద్దు బాబోయ్ అంటోన్న పురుషులు.. ఎందుకంటే
సాక్షి, భీమవరం(పశ్చిమ గోదావరి): కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అంటే పురుషులు మాకొద్దు అంటున్నారు. దీంతో నేటికీ 99 శాతానికిపైగా కు.ని. (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్లు మహిళలకే జరుగుతున్నాయి. అప్పటికే ఒకటి నుంచి రెండు ప్రసవాల ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు ట్యూబెక్టమీ కూడా చేయించుకోవాల్సి వస్తోంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మగవారికి ఎంతో సులభమైనా వారు ముందుకు రావడం లేదు. వైద్యుల కౌన్సెలింగ్‌తో మాత్రం కొందరు మగ వారు కు.ని. ఆపరేషన్ చేయించుకుంటున్నారు. మగవారికే సులభం ఈ ఆపరేషన్లు ఆడవారి కంటే మగవారికే సులభమని వైద్యులు చెబుతున్నారు. ఆడవారికి ట్యూబెక్టమీ చేయడానికి సమయం ఎక్కువ పట్టడంతో పాటు వారం నుంచి 10 రోజుల వరకు విశ్రాంతి అవసరం. మగవారికి వేసెక్టమీ చాలా సులభంగా చేయడంతో పాటు నాలుగు రోజుల విశ్రాంతి సరిపోతుంది. అనంతరం వారి పనులు చేసుకోవచ్చు. వేసెక్టమీ చేయించుకుంటే మగవారికి ప్రభుత్వం రూ.1,100 ప్రోత్సాహక నగదు అందజేస్తోంది. అదే ఆడవారికి కేవలం రూ.250 నగదు ఇస్తున్నారు. ఈ ఆపరేషన్ల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేస్తున్నారు. 55 ఆస్పత్రుల్లో కు.ని. ఆపరేషన్లు జిల్లాలోని 55 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. గ్రామాల్లోని 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 ఏరియా ప్రభుత్వ ఆస్పత్రులు, ఒక జిల్లా ఆస్పత్రిలో వేసెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 6,236 కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరగ్గా అందులో కేవలం 24 మంది, ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 1,384 ఆపరేషన్లు జరగ్గా కేవలం 9 మంది పురుషులు మాత్రమే ముందుకు వచ్చారు. మగవారు ముందుకు రావాలి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆడవారి కంటే మగవారికే సులభం. భార్యకు మరో ఆపరేషన్ అవసరం లేకుండా భర్త ముందుకొస్తే చాలా మంచిది. వేసెక్టమీపై మగవారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారి ఇష్టపూర్వకంగా ఆçపరేషన్ చేస్తాం. మగవారిలో మార్పు రావాలి. వారు జనాభా నియంత్రణలో భాగస్వాములు కావాలి. – కె.ఐశ్వర్య, సివిల్ అసిస్టెంట్ సర్జన్, కు.ని.విభాగం భీమవరం ప్రభుత్వాసుపత్రి -
బంధం తెగినా.. ఒక్కటిగానే మృత్యువు ఒడిలోకి..
Indian Family Died in Nepal Plane Crash: మనస్పర్థలు పెరిగాయి. భార్యాభర్తల బంధానికి బీటలు వారింది. చట్టం దృష్టిలో విడాకులతో వాళ్లిద్దరూ విడిపోయారు. కానీ, కన్నబిడ్డల రూపంలో దగ్గరగా గడిపే అవకాశం దొరికింది ఆ జంటకు. వారి మధ్య సంతోషాన్ని చూసి ఆ విధికి కన్ను కుట్టిందేమో.. విషాదాంతంగా ముగిసింది ఆ కుటుంబం కథ. నేపాల్ ఎయిర్‌క్రాఫ్ట్ దుర్ఘటనలో ఇప్పటిదాకా 22 మృతదేహాలను గుర్తించారు. ఘటనస్థలం నుంచి బ్లాక్‌బాక్స్‌ను సేకరించి.. ప్రమాదానికి గల కారణాలను కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అయితే.. దుర్మరణం పాలైన వాళ్లలో భారత్‌కు చెందిన ఓ కుటుంబం కూడా ఉండడం.. విషాదాన్ని నింపుతోంది. ఒడిషాకు చెందిన అశోక్ కుమార్ త్రిపాఠి(54), ఆయన భార్య వైభవి బందేకర్ త్రిపాఠి(51)కి చాలాకాలం కిందటే వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. అశోక్ కుమార్ మరో వివాహం చేసుకున్నాడు. కానీ, వైభవి మాత్రం తన తల్లితో ఉంటూ.. కన్నబిడ్డలిద్దరి బాధ్యతలు చూసుకుంటోంది. అయితే విడాకులతో విడిపోయినా ఆ జంటకు కలిసే అవకాశం కల్పించింది న్యాయస్థానం. ఏడాదిలో పది రోజుల పాటు కొడుకు, బిడ్డతో కలిసి సరదాగా గడపాలని ఈ మాజీ జంటకు ఆదేశించింది. విడాకుల తర్వాత అశోక్ ఒడిషాలోనే ఉంటూ ఓ కంపెనీని రన్ చేస్తున్నాడు. థానే(ముంబై)లో ఉంటూ ఓ ఫైనాన్షియల్ కంపెనీని నడిపిస్తోంది వైభవి. ఈ క్రమంలో.. కొడుకు ధనుష్ (22), కూతురు రితిక(15)తో కలిసి ఈ ఏడాదికిగానూ హిమాలయా పర్యటనకు వెళ్లారు. ఆదివారం నేపాల్ టూరిస్ట్ సిటీ అయిన పొఖారాకు వెళ్లారు. అదే రోజు జరిగిన ఘోర ప్రమాదంలో ఈ కుటుంబం దుర్మరణం పాలైంది. వీళ్ల మరణ వార్తతో థానేలోని బల్కమ్ ఏరియాలో విషాదం నెలకొంది. ఇక్కడే రుస్తోమ్జీ అథేనా హౌజింగ్ సొసైటీలో వైభవి నివాసం ఉంటోంది. ప్రమాదం వార్త విని స్థానికులంతా షాక్‌లో ఉన్నారు. -
అనుమానంతో భార్యపై హత్యాయత్నం
భూపాలపల్లి: భార్యపై అనుమానంతో గొడవపడిన భర్త మద్యం మత్తులో ఆమెపై హత్యాయత్నం చేశాడు. రక్తపు మడుగులో ఉన్న భార్యను చూసి భయపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారంరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలోని బేతిగల్‌కు చెందిన అంబాల రమేశ్ (29) కొన్నేళ్ల క్రితం భూపాలపల్లికి వచ్చి రాంనగర్ లో నివసిస్తూ కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నాడు. రమేశ్‌కు ఆరేళ్ల క్రితం హుజూరాబాద్‌కు చెందిన శైలజతో వివాహం జరిగింది. ఆమెకు పిల్లలు కలగకపోవడంతో ఏడాదిన్నర క్రితం మల్హర్ మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి(24)ని వివాహం చేసుకున్నాడు. రాజ్యలక్ష్మిపై అనుమానంతో రమేశ్ కొద్ది రోజులుగా ఆమెతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి రమేశ్ బాగా మద్యం సేవించి వచ్చి గొడవపడ్డాడు. రాత్రి ఒంటిగంట సమయంలో రాజ్యలక్ష్మిపై హత్యాయత్నం చేశాడు. కడుపు, ఎడమ చేయిపై కత్తితో పొడవడంతో రాజ్యలక్ష్మి రక్తం మడుగులో కుప్ప కూలింది. తర్వాత రమేశ్ అదే కత్తి తో చేతి మణికట్టు వద్ద నరాన్ని కోసుకున్నాడు. అనంతరం బైక్‌పై కొద్దిదూరం వెళ్లి కిందపడిపోయాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో తీవ్ర రక్తస్రావం జరిగి కేటీకే 5వ ఇంక్లైన్ గని సమీపంలోని జామాయిల్ చెట్ల వద్ద మృతి చెందాడు. కాగా, రమేశ్ ఇంటి యజమాని ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రాజ్యలక్ష్మిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. -
మరుగు దొడ్డి విషయంలో మనస్తాపం.. ఉరితాడుకు రమ్య!
చదువుకున్న ఆ అమ్మాయి.. ప్రాణంగా ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ, అతని ఇంట పరిస్థితిని తట్టుకోలేకపోయింది. మచ్చా(బావా) అని ప్రేమగా పిల్చుకునే భర్త దగ్గర బాధను వెల్లగక్కుకుంది. అది అతను అర్థం చేసుకోలేకపోయేసరికి.. పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త మనసు మారిందేమో అని మళ్లీ ప్రయత్నిస్తే.. అతను అదే సమాధానం ఇవ్వడంతో పెళ్లై నెల కూడా గడవక ముందే ఆ కొత్త పెళ్లికూతురు ఏకంగా ప్రాణమే తీసుకుంది. చెన్నై: తమిళనాడులో ఈ ఘటన జరిగింది. 27 ఏళ్ల రమ్య భర్త తన ఇంట మరుగుదొడ్డి కట్టించడం లేదన్న ఆవేదనతో ప్రాణం తీసుకుంది. కడలూరు అరిసిపెరియాన్కుప్పంకు చెందిన రమ్య.. ఎమ్మెస్సీ చదివింది. ఒక ప్రైవేట్ మెడికల్ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తోంది. రెండేళ్లుగా కార్తికేయన్ అనే వ్యక్తితో ఆమె ప్రేమలో ఉంది. పెద్దలను ఒప్పించి కిందటి నెల(ఏప్రిల్ 6న) వీళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే కాపురానికి వెళ్లిన ఆమెకు అక్కడ మరుగు దొడ్డి లేకపోవడం ఇబ్బందిగా అనిపించింది. కడలూరులోనే మరో ఇంటికి మారుదామని అతన్ని కోరింది. కానీ, ఆ కోరిక వివాదానికి దారి తీసింది. అందరిలాగా బహిర్భూమికి వెళ్లమంటూ సలహా ఇచ్చాడు ఆ భర్త. ఈ పరిణామంతో కలత చెందిన రమ్య.. పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే కొన్నిరోజులకు భర్త మనసు మారిందేమో అనే ఉద్దేశంతో.. ఆమె సోమవారం మళ్లీ అతనికి ఫోన్ చేసి మాట్లాడింది. మరుగుదొడ్డి ఉన్న ఇంటికి మారుదామని మరోమారు బతిమాలింది. కానీ, అతను మాత్రం కరగలేదు. ససేమిరా కుదరదని చెప్పేశాడు. దీంతో ఆవేదన చెందిన రమ్య.. తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉరి కొయ్యకు వేలాడుతున్న రమ్యను.. గుర్తించిన ఆమె తల్లి ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రమ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. టాయిలెట్ లేదన్న కారణంతో ఆత్మహత్యకు పాల్పడిన రమ్య ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కష్టాలు ఎదురైనా.. మనోధైర్యంతో ముందుకు సాగే స్ఫూర్తిదాయకమైన కథలు ఎన్నో. అవి చూసి కూడా జీవితం విలువ గుర్తించరు కొందరు. పైగా చిన్నచిన్న కారణాలకే ప్రాణం తీసుకుంటారు. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పరువు తీస్తానని భార్య బెదిరింపు.. భర్త ఆత్మహత్య
పెద్దపల్లి రూరల్: భార్య వివాహేతర సంబంధాన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్తను, ప్రియుడితో కలసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానంటూ బెదిరింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై రాజేశం కథనం ప్రకా రం.. అఫ్రోజ్ జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ప్రాం తంలో బిర్యానీ సెంటర్ నడుపుతున్నారు. ఈ క్రమంలో తనకు బంధువైన ఖాజాను పనిలో పెట్టుకున్నారు. అయితే ఖాజాతో అఫ్రోజ్ భార్యకు ఏర్పడిన సాన్నిహిత్యం వివాహేతర సంబంధానికి దారితీసింది. అఫ్రోజ్ వారిని పలుమార్లు పద్ధతి మార్చుకోవాలని చెప్పినా ఫలితం లేకపోయింది. కొద్ది రోజుల క్రితం వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అఫ్రోజ్ భా ర్యను పుట్టింటికి పంపి, ఖాజాను పని నుంచి తొలగించారు. అప్పటి నుంచి వారిద్దరూ కలసి దిగిన ఫొటోలను అఫ్రోజ్‌కు పంపించి.. వాటిని సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తామంటూ బెదిరింపులకు గురిచేశారు. ఆ వేధింపులు తాళలేక మనస్తాపానికి గురై అఫ్రోజ్ (43) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఖాజా, అఫ్రోజ్ భార్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పెళ్లయిన 35 రోజులకే పక్కా ప్లాన్‌తో భర్తను చంపించింది
సిద్దిపేట కమాన్: ప్రేమించిన వ్యక్తితో కాకుండా మరో వ్యక్తితో పెళ్లి చేయడంతో భర్తను అడ్డు తొలగించి ప్రియుడితో సంతోషంగా ఉండాలనుకుంది. ఆహారంలో ఎలుకల మందు కలిపి భర్తకు పెట్టింది. దాన్ని తిని అనారోగ్య సమస్యలు వచ్చినా ఆస్పత్రిలో చికిత్స పొంది భర్త తిరిగిరావడంతో ఇంకో పథకం వేసింది. వేరే ఊరికి వెళ్దామని చెప్పి భర్తను బయటకు తీసుకెళ్లి ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి చంపించింది. బయటి వాళ్లకు ఛాతీనొప్పితో చనిపోయాడని చెప్పి నమ్మించాలని చూసింది. చివరకు అసలు విషయం తెలియడంతో కటకటాలపాలైంది. పెళ్లయిన 35 రోజులకే జరిగిన ఘటన సిద్దిపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎలుకల మందుతో మొదటి యత్నం తొగుట మండలం గుడికందులకు చెందిన శ్యామలకు దుబ్బాక మండలం చిన్న నిజాంపేటకు చెందిన కోనాపురం చంద్రశేఖర్ (24)తో మార్చి 23న పెళ్లి జరిగింది. చంద్రశేఖర్ వ్యవసాయం చేస్తున్నాడు. అయితే చిన్నప్ప టి నుంచి స్నేహితులైన గుడికందులకు చెందిన శివకు మార్, శ్యామల మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇష్టంలేని పెళ్లి చేశారని, తన భర్తతో సుఖంగా ఉండట్లేదని, భర్తను అడ్డు తొలగిస్తే శివతో సంతోషంగా ఉండొచ్చు అని శ్యామల భావించింది. చంద్రశేఖర్‌ను చంపడానికి శివ సాయం కోరింది. అతను చెప్పినట్టు చంద్రశేఖర్ తినే ఆహారంలో ఏప్రిల్ 19న ఎలుకల మందు కలిపి పెట్టింది. అది తిన్న చంద్రశేఖర్‌కు అనారోగ్య సమస్యలు రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఏప్రిల్ 22న ఇంటికి వచ్చాడు. రెండోసారి పథకం వేసి.. తొలి ప్రయత్నం విఫలం కావడంతో భర్తను ఎలాగైనా చంపాలని శ్యామల మరోసారి శివ సాయం కోరింది. గుడికందులకు చెందిన ఇద్దరు స్నేహితులు రాకేశ్, రంజిత్, శివకు చిన్నమ్మ కొడుకైన సిరిసిల్లకు చెందిన భార్గవ్, మరో బంధువు సాయికృష్ణతో కలిసి ప్రణాళిక వేసింది. చిన్నకోడూర్ మండలం అనంతసాగర్‌లోని సరస్వతీ ఆలయంలో మొక్కు ఉందని చెప్పిన శ్యామల.. భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై ఏప్రిల్ 28న అనంతసాగర్‌కు బయలుదేరింది. మాయ మాటలు చెప్పి అనంతసాగర్ శివారులోని ధన్వంతరి అగ్రహారానికి వెళ్లే మట్టి దారిలోకి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ కారులో మాటు వేసిన శివ, నలుగురు యవకులు చంద్రశేఖర్‌పై దాడి చేసి తువాలతో మెడ చుట్టూ చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. భర్తకు ఛాతీలో నొప్పని.. చంద్రశేఖర్ మృతదేహాన్ని కారులో సిద్దిపేట శివారుకు తీసుకొచ్చారు. ఇదే సమయంలో శ్యామల భర్తకు ఛాతీలో నొప్పి వస్తోందని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని చంద్రశేఖర్ కుటుంబీకులకు ఫోన్ చేసి చెప్పింది. 108కి సమాచారం అందించి వాహనంలో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తెలిపింది. కుటుంబీకులు వచ్చేసరికి చంద్రశేఖర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొడుకు మృతిపై అనుమానం ఉందని తల్లి మనెవ్వ ఫిర్యాదు చేయడంతో పోలీసులు గత నెల 28న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్యామలపై అనుమానంతో ఆమె కాల్ డేటాను పరిశీలించగా శివతో ఎక్కువసార్లు మాట్లాడినట్లు గుర్తించారు. ఆమెను విచారించగా అసలు విషయం తెలిపింది. దీంతో పోలీసులు శ్యామల, శివ, మరో నలుగురిని శనివారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
భర్తను పరస్త్రీతో పంచుకోవడం కంటే.. చావే మేలు అనుకుంది!
భర్త విషయంలో భారతీయ స్త్రీలు విపరీతమైన ఆలోచనా ధోరణితో ఉంటారని, తన భర్త తనకు మాత్రమే సొంతం అనుకుంటారని, పరాయి స్త్రీతో బంధాన్ని పంచుకోవడానికి ఏమాత్రం సహించబోరని అలహాబాద్(ఉత్తర ప్రదేశ్) హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారతీయ వివాహిత మహిళలు భర్త తమకు మాత్రమే సొంతం అనుకుంటారు. వాళ్ల గురించి విపరీతంగా ఆలోచిస్తుంటారు. ఒకవేళ అతను గనుక వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నా, వివాహం చేసుకోవాలనుకునే ప్రయత్నం.. చివరికి ఆలోచనా చేసినా అది ఆ భార్యను కుదిపేసే అంశమే. అలాంటి విపత్కర పరిస్థితుల్లో తీవ్ర నిర్ణయాలే తీసుకుంటారు. ఈ కేసులోనూ అదే జరిగింది అంటూ జస్టిస్ రాహుల్ చతేర్వేది నేతృత్వంలో ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. తన భర్త రహస్యంగా మరో మహిళను వివాహం చేసుకోబోతున్నాడని, లేదంటే వివాహం చేసుకున్నాడనే ఒక్క కారణం చాలూ.. ఆమె తన ప్రాణం తీసుకునేందుకు అంటూ కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాలు.. వారణాసి మాండువాది చెందిన సుశీల్ కుమార్ అనే వ్యక్తి, అతని కుటుంబం మీద అతని భార్య చనిపోయే ముందు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు అయిన వెంటనే ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వాళ్ల మీద కేసు నమోదు అయ్యింది. అయితే భార్య ఆత్మహత్యకు తామేమీ కారణం కాదని, కేసుల నుంచి ఉపశమనం ఇప్పించాలని సుశీల్ కోర్టులను ఆశ్రయించాడు. అయితే సుశీల్ కుమార్‌కు ఇదివరకే రెండు వివాహాలు అయ్యాయని, మరో వివాహం చేసుకోవడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ధృవీకరించినట్లయ్యింది. -
రెండేళ్ల తర్వాత సొంతూరికి.. కాటేసిన రోడ్డు ప్రమాదం!
సాక్షి, చివ్వెంల (సూర్యాపేట): కరోనా వల్ల స్వదేశానికి రాలేకపోయిన ఆ కుటుంబం రెండేళ్ల తర్వాత.. రెక్కలు కట్టుకుని వాలిపోయింది. కానీ, ఊహించని పరిణామం ఆ కుటుంబంలో విషాదం నింపింది. రెప్పపాటులో జరిగిన ప్రమాదం దంపతులను బలిగొనడంతో పాటు వాళ్ల ఇద్దరు పిల్లలకు కన్నవాళ్లను దూరం చేసింది. జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలో బుధవారం తెల్లవారుజామున డివైడర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన పెద్దగమళ్ల హేమాంబరధర్, రజిత దంపతులు పదేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వారికి కుమార్తె భవాగ్న, కుమారుడు పల్విత్ ఉన్నారు. రజిత ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, హేమాంబరధర్ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితమే ఆడిలైడ్‌లో ఇల్లు కోనుగోలు చేశారు. కరోనాతో ఇంతకాలం ఆ కుటుంబం భారత్‌కు రాలేకపోయింది. తిరిగి ఆంక్షలు ఎత్తివేత, విమాన ప్రయాణాల పునరుద్ధరణతో తిరిగి వచ్చింది. స్వగ్రామానికి వెళ్తూ.. హేమాంబరధర్ కుటుంబ సభ్యులు ఈ నెల 25న హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడ బంధువుల ఇంట్లో ఒకరోజు ఉండి, 26న రాత్రి పది గంటల సమయంలో తమ గ్రామానికి చెందిన తిరుపతిరావు కారు కిరాయికి మాట్లాడుకుని రెడ్డిగూడెం బయలుదేరారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జి.తిరుమల్గిరి గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ రహదారిపై కారు కల్వర్టును ఢీకొట్టడంతో హేమంబరధర్(47) అక్కడికక్కడే మతిచెందగా, రజిత సూర్యాపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. వారి పిల్లలు భవాగ్న, పల్విత్, డ్రైవర్ తిరుమలరావు తీవ్రంగా గాయపడ్డారు. వారు విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్ఐ విష్ణుమూర్తి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కారు డ్రైవర్ నిద్రమత్తుతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.