
ఇంగ్లాండ్‌కు చెందిన లియామ్, జావిన్ దంపతులకు మన దేశం అంటే చాలా ఇష్టం. ‘దోజ్ హ్యాపీ డేస్’ పేరుతో యూట్యూబ్ చానల్ నడుపుతున్న ఈ దంపతులు మన దేశానికి వచ్చారు. వారి స్థాయికి ఏ ఫైవ్‌స్టార్ హోటల్‌లోనో ఉండవచ్చు. ఖరీదైన కారులో ప్రయాణించవచ్చు. అలా కాకుండా ఈ డైనమిక్ ద్వయం ఒక ఆటోరిక్షాలో అమృత్‌సర్ నుంచి తమిళనాడు వరకు ఎన్నో ప్రాంతాలు పర్యటించింది.
ఆటోకు ‘పీట్’ అని పేరు పెట్టి అందంగా అలంకరించారు. ఆటోడ్రైవింగ్ నేర్చుకున్నారు. చెన్నైలోని ట్రాఫిక్ ప్రాంతాల్లో డ్రైవింగ్ ప్రాక్టీస్ చేశారు. ‘ఫరవాలేదు. ఇక మనం ముందుకు వెళ్లవచ్చు’ అని నమ్మకం వచ్చిన తరువాతే ప్రయాణం ప్రారంభించారు. తమ ఆటో ప్రయాణంలో చెప్పలేనంత సందడి ఉన్న సంతలను, ధ్యానముద్రతో ఉన్న ప్రశాంత దేవాలయాలను, విభిన్న విశ్వాసాలు, ఆచారాల సామరస్య దృశ్యాలను, బాటసారులను, చెట్టుచేమను చూస్తూ ఎంజాయ్ చేశారు. నోరూరించే వంటకాలను ఆస్వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment