
ప్రస్తుతం పబ్‌జీ ట్రెండ్ నడుస్తోంది. జనాలు నిద్రాహారాలు మాని పబ్‌జీ గేమ్‌ను ఆడుతున్నారు. ఇదొక వెర్రిగా మారి.. చివరకు వారి ప్రాణాలనూ తీస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ గేమ్‌కు బలయ్యారు. పబ్‌జీ ఆడొద్దన్నారని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కోకొల్లలు. అయితే ఓ భర్త తన భార్యను పబ్‌జీ ఆడొద్దన్నాడని.. విడాకులకు దరఖాస్తు చేసింది భార్య. ఈ ఘటన యూఏఈలో జరిగింది.
తన భార్య నిత్యం ఆన్‌లైన్‌లో పబ్‌జీ ఆడుతుండటంతో.. ఆ ఆటను ఆడొద్దని సూచించాడు. మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వారిద్దరు పోలీసులను ఆశ్రయించారు. చాట్ ఆప్షన్ యాక్టివేట్ చేయకుండా.. తన బంధువులు, స్నేహితులతో మాత్రమే ఆడుతున్నానని ఆమె పోలీసులకు తెలిపింది. అయితే తన భార్య ఇలా నిత్యం ఆటలో మునిగిపోవడంతో భార్యగా తన బాధ్యత, విధులను నిర్వహించకుండా ఉంటుందన్న భయంతోనే ఆడొద్దన్నాని తెలిపారు. అయినా గేమ్ ఆడొద్దు అని అంటే స్వేచ్ఛను హరించడం కాదంటూ.. ఈ చిన్న విషయానికే తన భార్య విడాకులు అడగటం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment