తిరువొత్తియూరు: దిండివనంలో మద్యం మత్తులో వేధింపులు ఇస్తున్న భర్తపై కిరోసిన్ పోసి నిప్పు అంటించి హత్య చేసిన భార్యకు దిండివనం కోర్టు యావజీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. విల్లుపురం జిల్లా రెడ్డివనం టీవీ నగర్‌లో నివాసం ఉంటున్న దక్షిణామూర్తి కుమారుడు సేదు అలియాస్ సేదుపతి (23) పుదుచ్చేరిలో ఉన్న పంచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు.
అదే ప్రాంతానికి చెందిన మురుగవేణి (19)ని 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరు గుడిసె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. 2019 ఆగస్టు ఒకటో తేదీన ఇంట్లో నిద్రిస్తున్న సేతుపతి గుడిసెకు నిప్పు అంటుకోవడంతో మృతిచెందాడు. ఫిర్యాదు మేరకు దిండివనం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇంటికి నిప్పు అంటుకున్న సమయంలో ఇంటి బయట తలుపు వేసి ఉన్నట్లు తెలిసింది.
దీంతో మురగవేని వద్ద పోలీసులు విచారణ చేయగా మద్యం మత్తులో తరచూ అతను వేధిస్తుండడంతో కిరోసిన్ పోసి ఇంటికి నిప్పు అంటించినట్లు ఒప్పుకుంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దిండివనం అదనపు జిల్లా సెసెన్స్ కోర్టులో విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి రహమాన్ మురుగవేనికి యావజ్జీవ శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు. మురుగవేనిని కడలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment