![Viral Video: Mizoram Couples Jugaad On Way To Covid Quarantine Centre - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/1/iso.gif.webp?itok=GB3h2WlT)
ఐజ్వాల్: కరోనా సోకిన తన భార్యను ఆమె భర్త ఐసోలేషన్ వార్డుకు తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. మిజోరాంకు చెందిన దంపతులలో , సదరు వ్యక్తి భార్యకు కరోనా సోకింది. సాధారణంగా కరోనా సోకిన వారికి దూరంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న మహమ్మారి వెంటనే సోకుతుంది. అయితే, తన భార్యను ఐసోలేషన్ సెంటర్‌కు తీసుకెళ్లాటానికి ఆమె భర్త వినూత్నంగా ఆలోచించాడు. అతని జీప్‌కు, వెనుకల ఒక చిన్న ట్రాలీని ఏర్పాటు చేశాడు. అందులో ఆమె కూర్చివేసుకొని హాయిగా కూర్చుంది. ఇలా ఐసోలేషన్ వార్డుకు తరలించాడు.
అయితే, ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రిపున్ శర్మ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇప్పుడిది వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వావ్.. మీ భార్య అదృష్ట వంతురాలు’, ‘ మీ తెలివికి హ్యాట్సాఫ్’, అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, తాజాగా మిజోరాంలో వైరస్ ఉధృతి కొనసాగుతుంది. గడచిన 24 గంటలలో 312 కొత్త కేసులు నమోదైయ్యాయి. 41 మంది చనిపోయారు. అదే విధంగా రాష్ట్రంలో 3,144 కేసులు ఆక్టివ్ గా ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటి వరకు 9,214 మంది ఈ మహమ్మారి బారినుంచి కోలుకున్నారు.
చదవండి: నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళ.. కారణం అదేనా..
Comments
Please login to add a commentAdd a comment