Man Uses Beak-Shaped Face Mask for Eating Video Goes Viral - Sakshi
Sakshi News home page

వాట్‌ ఏ మాస్క్‌..ఎంచక్కా తీయకుండానే అలానే ఆహారం తినేయొచ్చు

Published Sat, Dec 24 2022 3:43 PM | Last Updated on Sat, Dec 24 2022 4:28 PM

Viral Video: Man Eating With Beak Shaped Mask Gone Viral  - Sakshi

చైనాలో అత్యంత ఘోరంగా కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. జీరో కోవిడ్‌ పాలసీ ఆంక్షలను సడలించాకే అత్యంత దారుణంగా కేసులు పెరగడం అందర్నీ విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఒక పక్క ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతుంటే మరోవైపు వైద్యులు వారికి చికిత్స అందించలేక సొమ్మసిల్లి కుప్పకూలిపోతున్నారు. చైనాలో విస్తృతంగా పెరుతున్న కేసుల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్ని ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి కూడా.

చైనా ప్రభుత్వ ఆరోగ్య గణాంకాల ప్రకారం... ప్రస్తుతం సుమారు 37 మిలియన్ల మంది కరోన బారిన పడి ఉండవచ్చునని అంచనా వేసింది. టీకాలు సత్వరమే వేయడంలో వైఫల్యం తోపాటు ప్రజలకు వాటిపై సరైన అవగాహన కల్పించకపోవడం తదితర కారణాల రీత్యా ఈ దుస్థితిని చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలోని ఒక వ్యక్తి ఒక వెరైటీ ఆకృతిలోని మాస్కోని ధరించి అందర్నీ ఆకర్షించాడు.

సదరు వ్యక్తి పెద్ద ముక్కు ఆకృతిలోని పేపర్‌ మాస్క్‌ని ధరించాడు. పైగా దానికి ఓపెనింగ్‌ కూడా ఉంది. ఎంచక్కా మాస్క్‌ తీయకుండానే అలానే తినేయవచ్చు. అతను ఒక రెస్టారెంట్‌లో ఆ మాస్క్‌ ధరించి చక్కగా పదార్థాలను లాగించేస్తున్నాడు. చూస్తుంటే అచ్చం పక్షుల మాదిరిగి తింటున్నట్లు చూడముచ్చటగా ఉంది. అందుకు సంబంధించిన వీడియోను సఫీర్‌ అనే వినియోగదారుడు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. 

(చదవండి: తలకిందులుగా ల్యాండ్‌ అయిన విమానం: వీడియో వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement