
చైనాలో ఆంక్షలు సడలించిన తర్వాత నుంచి అత్యంత ఘోరంగా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. పేషెంట్లు వెల్లువలా ఆస్పత్రులకు తరలి వస్తున్నారు. వారికి వైద్యం అందించలేక డాక్టర్లు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఒక పక్క ఆస్పత్రులన్ని రోగులతో కిక్కిరిసిపోతుంటే మరోవైపు వారికి చికిత్స అందించలేక సొమసిల్లిపోతున్నారు డాక్టర్లు.
అచ్చం అలానే చైనాలోని ఒక డాక్టర్ అప్పటి వరకు పేషెంట్లకు చక్కగా వైద్యం అందించాడు. అంతే హఠాత్తుగా రోగుల ముందే వైద్యం చేస్తూ కుప్పకూలిపోయాడు. దీంతో సదరు వైద్యుడిని హుటాహుటిన అత్యవసర విభాగానికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని దృశ్యాలు కంటతడి పెట్టించేలా అత్యంత ఘోరంగా ఉన్నాయి.
官方说没有重症,看看重庆医科大学附属第一医院 急诊留观区域。 pic.twitter.com/UsGiKoS4gG
— iPaul🇨🇦🇺🇦 (@iPaulCanada) December 20, 2022
(చదవండి: గుట్టలు గుట్టలుగా శవాలు.. అయినా కరోనాతో ఒక్కరూ చనిపోలేదట.. చైనా జిత్తులమారి లెక్కలు..)