ఆత్మరక్షణ కోసం భర్తను చంపిన భార్య | Wife Who Killed Her Husband Karimnagar | Sakshi
Sakshi News home page

ఆత్మరక్షణ కోసం భర్తను చంపిన భార్య

Published Fri, Mar 1 2019 7:40 AM | Last Updated on Fri, Mar 1 2019 7:40 AM

Wife Who Killed Her Husband Karimnagar - Sakshi

భూమల్ల నడ్పిమల్లయ్య మృతదేహం 

మేడిపెల్లి(వేములవాడ): మేడిపెల్లి మండలం కా చారంలో భూమల్ల నడ్పిమల్లయ్య(45)ను ఆయన భార్య భూమల్ల లక్ష్మి అలియాస్‌ మల్లవ్వ(40) గురువారం రాత్రి గొడ్డలితో నరికి చంపింది. స్థాని కులు, పోలీసుల కథనం ప్రకారం. దేశాయిపేటకు చెందిన భూమల్ల నడ్పిమల్లయ్యకు భార్య లక్ష్మి, కూతురు మౌనిక, కొడుకు ఉన్నారు. కాగా కూతురుకు ఇదే మండలంలోని మోత్కురావుపేటకు చెందిన ఓ యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. 2016 జూలై 3న ఆషాఢ మాసం సందర్భంగా తన కూతురును అత్తవారింటి నుంచి దేశాయిపేటకు తీసుకొస్తున్నాడు. ఈక్రమంలో మార్గమధ్యలో అత్యాచారయత్నానికి ప్రయత్నించగా ప్రతిఘటించిన కూతురును చీరతోనే ఉరివేసి చంపాడు.

ఆ సంఘటనలో నడ్పిమల్లయ్య జైలుశిక్ష అనుభవించాడు. బెయిల్‌పై విడుదలై ఇంటికొచ్చిన నడ్పిమల్లయ్యకు భార్య లక్ష్మితో తరచూ గొడవలు జరుగు తుండేవి. దీంతో తనను కూడా ఎక్కడ చంపుతాడోనని భయపడ్డ మల్లవ్వ తల్లిగారి ఊరైన కాచారానికి వచ్చి ఉంటోంది. కూలీ పనులు చేసుకొం టూ కొడుకుతో బతుకుతున్న మల్లవ్వ వద్దకు భర్త తరచూ వస్తూ చంపుతానని బెదిరిస్తూ ఉండేవాడ ని స్థానికుల ద్వారా తెలిసింది. ఈక్రమంలో గురువారం రాత్రి మద్యం తాగి వచ్చిన నడ్పిమల్లయ్య తన భార్యను చంపేందుకు ప్రయత్నించగా.. రక్షించుకునే క్రమంలో మల్లవ్వ సమీపంలోనే ఉన్న గొ డ్డలితో మెడపై నరికింది. దీంతో మల్లయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై శ్రీనివాస్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement