అర్థం చేసుకుంటేనే బంధంలో ఆనందం | - | Sakshi
Sakshi News home page

అర్థం చేసుకుంటేనే బంధంలో ఆనందం

Published Sat, Jun 3 2023 12:56 PM | Last Updated on Sat, Jun 3 2023 1:05 PM

భార్యభర్తలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న జిల్లా ఎస్పీ గంగాధర్‌ రావు   - Sakshi

భార్యభర్తలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న జిల్లా ఎస్పీ గంగాధర్‌ రావు

రాయచోటిటౌన్‌ : భార్యభర్తలు ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే బంధం ఆనందమయమని, సంసారం సంతోషంగా సాగుతుందని అన్నమయ్యజిల్లా ఎస్పీ గంగాధర్‌ రావు అన్నారు. తన భర్త ప్రతి రోజు వేధిస్తున్నాడని ఒక మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. భర్త అమ్మ నాన్నలు, ఆడబిడ్డలు అందరూ వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై దిశ పోలీసులను ఆశ్రయించింది.

దిశ సీఐ చంద్రశేఖర్‌ శనివారం జిల్లా ఎస్పీతో కలసి భార్య భర్తలను ఒకే వేదికపై కుర్చోపెట్టి మాట్లాడించారు. చివరికి వారి తప్పులను తెలుసుకొనేలా తెలియచెప్పారు. కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదని దీనిని అర్థం చేసుకొంటేనే కాపురం సజావుగా సాగుతుందని విడమరిచి చెప్పారు. పూర్తిగా అర్థం చేసుకొన్న తరువాత ఇద్దరు సంతోషంగా ఇంటికి వెళ్లారు. వీరిని జిల్లా ఎస్పీ అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement