
భారత్ దౌత్యవేత్తలు, సైనికాధికారులు
ఇస్లామాబాద్: భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు క్షీణించిన సమయంలో ఓ సంచలనం చోటుచేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన పాకిస్తాన్ డే సైనిక పరేడ్‌కు భారత్ దౌత్యవేత్తలు, సైనికాధికారులు హాజరయ్యారు. పరేడ్‌నకు భారత్ అధికారులను పిలవటం ఇదే తొలిసారి. భారత్ ఉన్నతాధికారులను పరేడ్‌నకు ఆహ్వానించాలన్న నిర్ణయం ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాదేనని స్థానిక మీడియా తెలిపింది. భారత్‌తో చెలిమి కోరుకుంటున్నామని తెలిపేందుకు ఆయన ఈ మేరకు ముందడుగు వేశారని సైనిక వర్గాలు తెలిపాయి.
పాక్‌లో భారత రాయబారి బిసారియా, డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్, రక్షణ, సైనిక సలహాదారు బ్రిగేడియర్ సంజయ్ విశ్వాస్ తదితరులు పరేడ్‌లో పాల్గొన్నారు. వీరంతా ఇక్కడి అధికారులు అందజేసిన ‘23 మార్చి పాకిస్తాన్ డే’ అని ఉన్న టోపీలను ధరించి పరేడ్‌ను తిలకించారు. పరేడ్‌లో పాక్ అధ్యక్షుడు మమ్నూ న్ భారత్‌పై నిప్పులు చెరిగారు. భారత్‌లోని పాక్ రాయబారి సొహైల్ గురువారం తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. దౌత్యాధికారులను భారత్ వేధిస్తోందంటూ హైకమిషనర్ మెహమూద్‌ను వారం క్రితం పాక్ వెనక్కి పిలిపించుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment