diplomats
-
భారత దౌత్యవేత్తల బహిష్కరణ కథనాలు.. స్పందించిన అమెరికా
న్యూయార్క్:భారత్, కెనడా దేశాల మధ్య పెరుగుతున్న దౌత్యపరమైన ఉద్రికత్తల నేపథ్యంలో ప్రతిస్పందనగా భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించాలని అమెరికా పరిశీలిస్తున్నట్లు ఇటీవల పలు కథనాలు వెలువడ్డాయి. అయితే వాటిపై తాజాగా అమెరికా స్పందించింది. సదరు వార్తలను అమెరికా విదేశాంగశాఖ తోసిపుచ్చింది. సిక్కు వేర్పాటువాది, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో భారతీయ హైకమిషన్ పేరును కెనడా చేర్చిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఇతర దౌత్యవేత్తల ప్రమేయం ఉన్నట్లు కెనడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో అమెరికా సైతం భారత దౌత్యవేత్తలను బహిష్కరించాలని యోచిస్తున్నట్లు ఆ కథనాల సారాంశం.అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. భారత దౌత్యవేత్తలపై చర్యలు తీసుకోవాలని అమెరికా పరిశీలిస్తున్నట్లు వెలువడిన కథనాలను ఖండించారు.‘‘ మేం భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించినట్లు వెలువడ్డ నివేదికల విషయం గురించి నాకు తెలియదు. అటువంటి బహిష్కరణ గురించి మేం ఆలోచించలేదు. అంతా ఊహాగానాలు మాత్రమే’’ అని అమెరికా వైఖరిని స్పష్టం చేశారు.ఈ నెల ప్రారంభంలో భారత దౌత్యవేత్తలపై కెనడా ఆరోపణలు చేయటంతో ప్రతిస్పందనగా భారతదేశం కెనడాలో ఉన్న తన ఆరుగురు దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంది. అదేవిధంగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను కూడా భారత్ బహిష్కరించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రక్తలు క్షీణించిన విషయం తెలిసిందే. ఇక.. ఈ పరిణామాలు కెనడా, భారత్ మధ్య సంబంధాలను మరింత దెబ్బతీశాయి. -
భారత దౌత్యవేత్తలపై నిఘా: కెనడా
ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి ఒట్టావాలోని భారత హైకమిషన్ర్ను కెనడా అనుమానితునిగా పేర్కొటంతో ఇరు దేశాల దౌత్య సంబంధాలు క్షిణించాయి. కెనడా చేసిన ఆరోపణులను ఇప్పటికే భారత్ తీవ్రంగా ఖండించింది. తాజాగా కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కీలక వ్యాఖ్యలు చేశారు. మిగిలిన భారత దౌత్యవేత్తలపై నిఘా వేసి ఉంచామని అన్నారు. ఒట్టావా హై కమిషనర్‌తో సహా ఆరుగురు భారత దౌత్యవేత్తలను తొలగించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా వియన్నా కన్వెన్షన్ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదన్నారు. చదవండి: కెనడాలో భారతీయుల హవా.. విద్యా, ఉద్యోగాల్లో ముందంజ‘‘మన దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదు. కెనడా గడ్డపై విదేశీ అణచివేత జరగదు. ఐరోపాలో ఇటువంటి ఘటన చూశాం. జర్మనీ , బ్రిటన్‌లో రష్యా విదేవీ జోక్యానికి పాల్పడింది. మేం ఈ విషయంలో చాలా దృఢంగా ఉన్నాం’’ అని అన్నారు. ఇతర భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరిస్తారా? మీడియా అడిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘‘ మిగిలిన భారత దౌత్యవేత్తలపై స్పష్టంగా నిఘా వేసి ఉంచాం. భారత దౌత్యవేత్తల్లో ఒట్టావాలోని హైకమిషనర్‌తో సహా ఆరుగురిని బహిష్కరించాం. ఇతరులు ప్రధానంగా టొరంటో, వాంకోవర్‌లో ఉన్నారని తెలిపారు. అదేవిధంగా భారత దౌత్య వేత్తలు వియన్నా కన్వెన్షన్ ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తే మేం సహించబోం’’ అని అన్నారు.నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం పంపింది. ఇక.. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన విషయం తెలిసిందే.చదవండి: దృష్టి మరల్చేందుకే.. నిజ్జర్ హత్య తెరపైకి -
భగ్గుమన్న దౌత్య బంధం
న్యూఢిల్లీ: సిక్కు వేర్పాటువాది, ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతం ఒక్కసారిగా భారత్, కెనడా దౌత్యసంబంధాల్లో మంటలు రాజేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ ఆదివారం భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం పంపింది. దీంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఖలిస్తాన్ వేర్పాటువాది హత్య కేసులో తమ దౌత్యాధికారులను ఇరికించడంపై భారత సర్కార్ తీవ్రంగా స్పందించింది. కెనడా తాత్కాలిక హైకమిషనర్ స్టివార్ట్ వీలర్సహా ఆరుగురు దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. బహిష్కరణకు గురైన వారిలో డెప్యూటీ హై కమిషనర్ ప్యాట్రిక్ హేబర్ట్, ఫస్ట్ సెక్రటరీలు మేరీ కేథరీన్ జోలీ, అయాన్ రోస్ డేవిడ్ ట్రైస్, ఆడమ్ జేమ్స్ చుప్కా, పౌలా ఓర్జులాలు ఉన్నారు. అక్టోబర్ 19వ తేదీన రాత్రి 11.59 గంటల్లోపు భారత్‌ను వీడాలని ఆదేశాలు జారీచేసింది. కెనడాలో విధులు నిర్వర్తిస్తున్న భారత దౌత్యవేత్త, దౌత్యాధికారులు, సిబ్బందిని స్వదేశానికి రప్పిస్తామని సోమవారం భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అంతకుముందు తన నిరసన తెలిపేందుకు కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ రోస్ వీలర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీచేసింది. దీంతో ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చి ఆ శాఖ కార్యదర్శి(తూర్పు) జైదీప్ మజుందార్‌ను కలిశారు. అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త పేరును చేర్చడంపై ఆయన ఎదుట భారత్ తన నిరసనను వ్యక్తంచేసింది. ఇది జరిగిన కొద్దిసేపటికే దౌత్యాధికారులను రప్పించడంపై విదేశాంగశాఖ నిర్ణయం వెలువడింది. ‘‘ కెనడాలో తీవ్రవాదం, హింసాత్మక ఘటనలు, ట్రూడో ప్రభుత్వ చర్యలు అక్కడి భారతీయ దౌత్యాధికారులను ప్రమాదంలోకి నెట్టేశాయి. ప్రస్తుత కెనడా ప్రభుత్వం వీళ్ల భద్రతకు భరోసా కలి్పస్తుందన్న నమ్మకం పోయింది. అందుకే వీళ్లందరినీ వెనక్కి రప్పించుకోవాలని భారత సర్కార్ నిర్ణయంచుకుంది. సిక్కు వేర్పాటువాదానికి మద్దతు పలుకుతూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ట్రూడో సర్కార్ దుందుడుకు చర్యలకు దీటుగా ప్రతిస్పందించే హక్కు భారత్‌కు ఉంది’’ అని విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్, కెనడా దౌత్యసంబంధాలు దారుణస్థాయికి క్షీణించడంతో కెనడాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయ పౌరులు, విద్యనభ్యసిస్తున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రూడో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఓటు బ్యాంక్ రాజకీయ లబి్ధపొందేందుకు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఇలా తమ దౌత్యవేత్తలను అప్రతిష్టపాలు చేస్తోందని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. మీ ప్రభుత్వం నిందారోపణలు చేయడం మానుకోవాలని కెనడా దౌత్యవేత్త ఎదుట భారత్ తన నిరసన వ్యక్తంచేసింది. ‘‘ కెనడాలోని భారతీయ హై కమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులపై ఇలా నిరాధారపూరితంగా వేధించడం ఏమాత్రం ఆమోదనీయం కాదు’’ అని స్పష్టంచేసింది. ఆరోపణలకు తగ్గ ఆధారాలు ఇవ్వలేదు ‘‘ 2023 సెపె్టంబర్లో ఈ ఉదంతంలో భారత ప్రమేయం ఉందంటూ ట్రూడో ఆరోపణలు చేశారు. కానీ ఆ మేరకు సాక్ష్యాధారాలను భారత ప్రభుత్వానికి అందజేయలేదు. ట్రూడో కెనడా ఓటుబ్యాంక్ రాజకీయాల్లో లబ్ది పొందేందుకే కేసు దర్యాప్తు సమగ్రంగా జరక్కముందే వాస్తవాలు లేకుండా భారత హైకమిషనర్ వర్మకు వ్యతిరేకంగా కెనడా వ్యవహరిస్తోందన్నది సుస్పష్టం. 2018లో భారతలో పర్యటించినప్పటి నుంచే ట్రూడో భారత్‌తో ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తున్నారు. భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న, తీవ్రవాదులతో సత్సంబంధాలున్న వ్యక్తులకు ట్రూడో మంత్రివర్గంలో చోటుదక్కింది. 2020 డిసెంబర్లో భారత ఎన్నికల ప్రక్రియలోనూ ట్రూడో జోక్యం చేసుకునేందుకు యతి్నంచారు. ట్రూడో ప్రభుత్వం పూర్తిగా ఒకే రాజకీయ పారీ్టపై ఆధారపడింది. ఆ పార్టీ కేవలం భారత్‌లో సిక్కు వేర్పాటువాదాన్ని ఎగదోయడమే పనిగా పెట్టుకుంది’’ అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.విశ్వసనీయ సమాచారం ఇచ్చాం: వీలర్ భారత విదేశాంగ శాఖ కార్యాలయం నుంచి బయటికొచ్చాక కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ వీలర్ మీడియాతో మాట్లాడారు. ‘‘ భారత్ ఏవైతే ఆధారాలను అడిగిందో వాటిని కెనడా ప్రభుత్వం ఇచి్చంది. కెనడా సొంత గడ్డపై కెనడా పౌరుడి హత్యోదంతంలో భారత సర్కార్‌కు చెందిన ఏజెంట్ల పాత్రపై విశ్వసనీయ, ఖచి్చతమైన సమగ్ర ఆధారాలను భారత్‌కు కెనడా ప్రభుత్వం అందజేసింది. ఇక నిర్ణయం భారత్‌కే వదిలేస్తున్నాం. ఇరు దేశాల స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ తన తదుపరి చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నాం. ఈ విషయంలో సహకరించేందకు కెనడా సిద్ధంగా ఉంది’’అని వీలర్ వ్యాఖ్యానించారు.ఏమిటీ నిజ్జర్ వివాదం? నిజ్జర్ కెనడా కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని గతంలోనే భారత్ కెనడా సర్కార్‌కు తెలియజేసినా ఎలాంటి స్పందనా రాలేదు. 2023 ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో గురుద్వారా సాహెబ్ పార్కింగ్ ప్రదేశంలో నిజ్జర్‌ను గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఈ కాల్పుల ఘటన వెనుక భారత నిఘా ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో గత ఏడాది సెపె్టంబర్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది. హత్యకు సంబంధించి ఆధారాలు సమర్పిస్తే పరిశీలించి దర్యాప్తునకు సహకరించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని భారత్ స్పష్టంగా చెప్పింది. అయితే నిజ్జర్‌ను పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు చంపేసి ఆ నేరం భారత్‌పై మోపాలని కుట్ర జరిగిందని గతంలో అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. నిజ్జర్ హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది జూన్‌లో అక్కడి పార్లమెంట్ దిగువసభలో కెనడా ఎంపీలు నిజ్జర్‌కు నివాళులర్పించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్‌పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తికి ఏకంగా పార్లమెంటులో నివాళులరి్పంచడం దారుణం’’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరీ నిజ్జర్? నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్, ‘గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్’ అధిపతి అయిన నిజ్జర్ సిక్కు వేర్పాటువాదిగా పేరొందాడు. భారత్‌లోని జలంధర్ ప్రాంతంలోని బార్సింగ్పూర్లో జని్మంచాడు. 1997లో తప్పుడు పాస్ట్‌పోర్ట్‌లో కెనడాకు వెళ్లి స్థిరపడ్డాడు. అయితే అక్కడి నుంచే భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాడు. అమెరికాలో నెలకొల్పిన జస్టిస్ ఫర్ సిఖ్స్ సంస్థలో క్రియాశీలకంగా పనిచేశాడు. పంజాబ్‌లో హత్యలకు కుట్రపన్నాడన్న కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద భారత్ ఇతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇతని తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ భారత్‌లోని ఇతని ఆస్తులను స్వా«దీనం చేసుకుంది. -
బ్రిటన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన రష్యా
మాస్కో: గూఢచర్యం ఆరోపణలపై ఆరుగురు బ్రిటన్ దౌత్యవేత్తలను రష్యా బహిష్కరించింది. మాస్కోలోని బ్రిటన్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ఆరుగురు దౌత్యవేత్తలు రష్యా కీలక సమాచారాన్ని శత్రు దేశాలకు చేరవేస్తున్నట్లు ఆధారాలు దొరికాయని అధికారులు తెలిపారు. దీని వల్ల రష్యా భద్రతకు ముప్పుండడంతో వారిని బహిష్కరించినట్లు వెల్లడించారు. బ్రిటిష్ ఎంబసీలోని ఆరుగురు సభ్యులు గూఢచర్యానికి పాల్పడినట్లుగా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ ఆఫ్ రష్యా ఆధారాలు సమర్పించింది. అయితే లండన్‌కు, మాస్కోకు మధ్య ఉన్న స్నేహం కారణంగా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా బహిష్కరించామని అధికారులు తెలిపారు.గూఢచర్యంలో ఇతర దౌత్యవేత్తల ప్రమేయం ఉందని తెలిస్తే వారిని కూడా బహిష్కరిస్తామని చెప్పారు.అయితే రష్యా చేసిన ఈ ఆరోపణలపై మాస్కోలోని బ్రిటన్ ఎంబసీ స్పందించలేదు. కాగా గూఢచర్యం ఆరోపణలతో రష్యా ఎంబసీలో రక్షణ వ్యవహారాలను పర్యవేక్షించే ఓ అధికారిని బ్రిటన్ ఇటీవల బహిష్కరించింది. ఇందుకు కౌంటర్‌గానే తాజాగా రష్యా బ్రిటన్ దౌత్యవేత్తలను బహిష్కరించి ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా -
దౌత్యాధికారుల తగ్గింపు వ్యవహారం.. కెనడాకు అమెరికా, యూకేల మద్దతు
లండన్/వాషింగ్టన్: కెనడాకు చెందిన 41 మంది దౌత్యాధికారుల హోదాను రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో తాము విభేదిస్తున్నట్లు అమెరికా, యూకేలు ప్రకటించాయి. సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని భారత్ తీసుకున్నట్లు భావిస్తున్నామని తెలిపాయి. వియన్నా ఒప్పంద సూత్రాలకు భారత్ ప్రభుత్వ నిర్ణయం వ్యతిరేకమని యూకే పేర్కొనగా, విభేదాల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో దౌత్యాధికారుల అవసరం ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ నొక్కి చెప్పింది. ‘దౌత్య సంబంధాలపై 1961 వియన్నా ఒప్పందం ప్రకారం అన్ని దేశాలు తమ బాధ్యతలను గుర్తిస్తాయని మేం ఆశిస్తున్నాం. దౌత్యవేత్తల భద్రత కోసం కల్పించాల్సిన అధికారాలు, ఇతర హక్కులను ఏకపక్షంగా తొలగించడం వియన్నా సూత్రాల విరుద్ధం. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై స్వతంత్ర దర్యాప్తులో కెనడాతో పాలుపంచుకోవాలని భారత్‌ను కోరుతూనే ఉన్నాం’అని యూకే విదేశాంగశాఖ పేర్కొంది.‘భారత్‌లో దౌత్యాధి కారులను గణనీయంగా తగ్గించాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేయడం, కెనడా తన దౌత్యవేత్తలను వెనక్కి తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. విభేదాలను పరిష్కరించడానికి క్షేత్ర స్థాయిలో దౌత్యవేత్తలు అవసరం. దౌత్యా ధికారులను తగ్గించాలంటూ కెనడాపై ఒత్తిడి తేవద్దని, నిజ్జర్ హత్యపై కెనడా ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తులో సహకరించాలని భారత ప్రభుత్వాన్ని కోరాం’అని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. -
భారత్ నుంచి కెనడా దౌత్యవేత్తల ఉపసంహరణ
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య వివాదం నేపథ్యంలో భారత్ నుంచి 41 మంది దౌత్య వేత్తలను కెనడా ఉపసంహరించుకుందని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ తెలిపారు. కెనడా ప్రతీకార చర్యలకు పాల్పడబోదని ఆమె వెల్లడించారు. కెనడా దౌత్యవేత్తలు భారత్‌ను వీడకపోతే శుక్రవారం ఏకపక్షంగా వారి అధికారిక హోదాను రద్దు చేస్తామని భారత్ బెదిరించిందని జోలీ చెప్పారు. ఈ చర్యతో భారత్ దౌత్య సంబంధాలపై కుదుర్చుకున్న వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. భద్రతపై ఆందోళనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో భారత్ నుంచి దౌత్యవేత్తలను తరలించామని జోలి చెప్పారు. దౌత్యపరమైన విధానాలను నాశనం చేయాలనుకుంటే ప్రపంచంలో ఎక్కడా దౌత్యవ్యవస్థ ఉండబోదని తెలిపారు. అందుకే తాము ప్రతిచర్యకు పాల్పడటం లేదని తెలిపారు. 41 మంది దౌత్యవేత్తలు వారిపై ఆధారపడిన 42 మంది సభ్యులను భారత్ నుంచి తరలించామని తెలిపారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీంతో భారత్-కెనడా మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదంలో ఇరుదేశాలు దౌత్యపరమైన ఆంక్షలు కూడా విధించుకున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపిస్తోందని భారత్ మండిపడింది. ఈ పరిణామాల అనంతరం భారత్‌లో ఉన్న కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని కేంద్రం కోరింది. అక్టోబర్ 10 నాటికి ఉపసంహరించుకోవాలని గడువును కూడా విధించింది. ఇదీ చదవండి: రష్యా, హమాస్ ఒకటే: బైడెన్ -
దౌత్యవేత్తల బహిష్కరణ: దెబ్బకి దెబ్బ కొట్టిన అమెరికా
వాషింగ్టన్: రష్యా చర్యకు అమెరికా ప్రతిచర్యకు దిగింది. తమ దేశం నుంచి ఇద్దరు రష్యా దౌత్యవేత్తను బహిష్కరిస్తూ తాజాగా ప్రకటన చేసింది. కీలక సమాచారం సేకరించారనే ఆరోపణలపై ఇద్దరు అమెరికన్ దౌత్యవేత్తలను తమ దేశం విడిచి వెళ్లాలంటూ కిందటి నెలలో రష్యా ఆదేశించింది. ఈ యాక్షన్‌కు కౌంటర్ యాక్షన్‌గానే.. అగ్రరాజ్యం ఇప్పుడు కౌంటర్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ‘‘మా దౌత్యవేత్తలను రష్యా ప్రభుత్వం కావాలనే వేధింపులకు గురి చేస్తోంది. ఈ పరిణామాన్ని మేం సహించేది లేదు’’ అని అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు. తద్వారా ఇది ప్రతీకారచర్య అనే విషయాన్ని స్పష్టం చేశారాయన. అమెరికాను విడిచి వెళ్లేందుకు రష్యా దౌత్య వేత్తలిద్దరికీ వారం గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వాళ్ల పేర్లు మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉంటే.. వ్లాడివోస్టోక్‌లోని అమెరికా కాన్సులేట్‌కు చెందిన ఓ మాజీ ఉద్యోగి.. రష్యా భద్రతకు సంబంధించిన కీలక సమాచారం సేకరించాడని దర్యాప్తులో తేలింది. దీంతో అతన్ని దోషిగా తేల్చారు. అయితే.. అమెరికా దౌత్యవేత్తలు జెఫ్రీ సిల్లిన్, డేవిడ్ బెర్న్స్టెయిన్లు ఆ మాజీ ఉద్యోగితో సంబంధాలు కలిగి ఉన్నారని, వాళ్లు కూడా ఇందుకు సహకరించారని ఆరోపిస్తూ రష్యా ఈ ఇద్దరిని బహిష్కరించింది. అయితే అమెరికా ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. తమ దౌత్యవేత్తలను రష్యా ఘోరంగా అవమానిస్తోందని విమర్శించింది. మరోవైపు 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా-అమెరికాల మధ్య సంబంధాలు అంతకంతకు దిగజారుతున్నాయి. -
భారత్‌ను వీడిన కెనడా దౌత్యవేత్తలు
ఢిల్లీ: భారత్‌లో ఉన్న కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని కేంద్రం కోరిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కెనడా స్పందించింది. తమ దౌత్య వేత్తలను భారత్ నుంచి ఖాలీ చేయించింది. సింగపూర్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు పరిణామాల అనంతరం దౌత్యవేత్తల సంఖ్యను సమానంగా ఉంచాలని భారత్ కోరిన నేపథ్యంలో కెనడా ఈ మేరకు చర్యలు తీసుకుంది. భారత్‌లో ఉన్న కెనడా దౌత్య వేత్తలను దాదాపు 40 మంది వరకు బయటకు పంపించాలని భారత్ కెనడాకు హెచ్చరికలు జారీ చేసింది. ఇరుదేశాల్లో దౌత్య వేత్తలు సమాన సంఖ్యలో ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్టోబర్ 10 నాటికి చివరి గడువును విధించింది. అప్పటికీ ఖాలీ చేయకపోతే.. రక్షణను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. భారత్ ఘాటుగా స్పందించింది. అయితే.. కెనడా దౌత్య వేత్తలు ఎంత మంది భారత్‌ను వీడారనేది మాత్రం స్పష్టంగా తెలియదు. కానీ వారిని మాత్రం సింగపూర్‌కు తరలించినట్లు కెనడాకు చెందిన ఓ మీడియా కథనం వెల్లడించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ట్రూడో వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడింది. అనంతరం ఇరుదేశాలు ఆంక్షల దిశగా చర్యలు తీసుకున్నాయి. భారత్ కెనడా వీసాలను రద్దు చేసింది. అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదీ చదవండి: ఎన్నికల ముందు ఉచితాలు.. ఆ రెండు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు -
దౌత్య సిబ్బందిపై భారత్ అల్టిమేటం.. స్పందించిన కెనడా
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుతో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌లో కెనడా దౌత్యవేత్తల సిబ్బంది సంఖ్యను తగ్గించాలంటూ కేంద్రం చేసిన అల్టిమేటమ్‌పై కెనడా ప్రభుత్వం స్పందించింది. రెండు దేశాల మధ్య ధైత్య సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తాము భారత ప్రభుత్వంతో వ్యక్తిగతంగా చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు కెనడా విదేశీ వ్యవహరాలమంత్రి మెలానీ జోలీ పేర్కొన్నారు. ఇందుకు కెనడా భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కెనడియన్ దౌత్యవేత్తల భద్రతను తాము చాలా సీరియస్‌గా(తీవ్రమైనవి) తీసుకుంటున్నామని, భారత్‌తో ప్రైవేట్‌గా చర్చలు జరపాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎందుకంటే వ్యక్తిగత దౌత్యపరమైన సంభాషణలు ఉత్తమమైనవిగా తాము భావిస్తున్నట్లు చెప్పారు. చదవండి: అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం 10లోగా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించండి: కెనడాకు భారత్ అల్టిమేటమ్ కాగా భారత్‌లో ఉన్న దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని కెనడా హైకమిషనరేట్‌కు భారత్ అల్టిమేటమ్ జారీ చేసిన విషయం తెలిసిందే భారత్‌లో ఉన్న సుమారు 41 మంది దౌత్యవేత్తల్ని వెనక్కి తీసుకువెళ్లాలని వార్నింగ్ ఇచ్చింది. ఈ నెల 10 వరకు గడువు విధించినట్టు విశ్వసనీయమైన వర్గాల సమాచారం. దౌత్య సిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాలని భారత్ ఎప్పట్నుంచో వాదిస్తోంది. ఒట్టావాలోని భారత దౌత్యసిబ్బంది సంఖ్యతో పోలిస్తే దిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, దాన్ని సమస్థాయికి తీసుకురావాలని చెబుతోంది. ప్రస్తుతం భారత్‌లో కెనడాకు చెందిన 62 మంది దౌత్యవేత్తలు ఉన్నారు. అందులో 41 మందిని తగ్గించాలంటూ కెనడా రాయబార కార్యాలయానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్టుగా జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఒకవేళ గడువులోగా దౌత్యవేత్తల్ని వెనక్కి పిలవకపోతే వారికి రక్షణ కల్పించలేమని కూడా ప్రభుత్వం తెగేసి చెప్పినట్టుగా సమాచారం. వివాదాన్ని పెంచాలనుకోవడం లేదు: కెనడా భారత్‌తో వివాదాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇష్టం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. భారత్‌తో బాధ్యతాయుతంగా, నిర్మాణాత్మకంగా తమ బంధాన్ని కొనసాగిస్తామని అన్నారు. భారతదేశంలోని కెనడియన్ కుటుంబాలకు సహాయం చేసేందుకు తాము అక్కడే ఉండాలని అనుకుంటున్నామని తెలిపారు. అక్టోబర్ 10వ తేదీలోగా 40 మంది దౌత్య సిబ్బందిని వెనక్కు పిలిపించుకోవాలని కెనడాకు భారత్ అల్టిమేటం జారీ చేసిన అనంతరం ట్రూడో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం -
కెనడాకు భారత్ మరోసారి హెచ్చరికలు..!
ఢిల్లీ: కెనడా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యూఢిల్లీలో ఉన్న కెనడా దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని భారత్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అక్టోబర్ 10 నాటికి గడువును కూడా విధించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల్లో సమాన దౌత్య అధికారులు ఉండాలనే నియమంపై భారత్ ఇప్పటికే పలుమార్లు కెనడాను కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో 62 మంది కెనడా దౌత్య అధికారులు ఉంటుండగా.. ఆ సంఖ్యను 41కి తగ్గించుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 10 తర్వాత ఇంకా ఎక్కువ మంది దౌత్య అధికారులు ఉంటే.. వారికి రక్షణను రద్దు చేస్తామని కూడా కేంద్రం స్పష్టం చేసింది. అయితే.. ఈ వార్తలపై అటు.. కేంద్రంగానీ, విదేశాంగ శాఖ గానీ అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం కెనడా-భారత్ మధ్య వివాదాస్పద వాతావరణం నెలకొంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదానికి కారణమైంది. ఈ కేసు దర్యాప్తులో సహకరించాలని భారత్‌ను కెనడా డిమాండ్ చేసింది. ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేశారని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఇరుదేశాలు ఆంక్షలు విధించుకున్నాయి. ఆ తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇదీ చదవండి: ఢిల్లీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు -
ఐరాసలో రష్యా దౌత్యాధికారుల బహిష్కరణ
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో రష్యాకు చెందిన 12 మంది దౌత్యాధికారులను అమెరికా బహిష్కరించింది. వీరంతా గూఢచర్య కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారని ఆరోపించింది. అమెరికాది రెచ్చగొట్టే చర్యన్న రష్యా, ఐరాసకు కేంద్రకార్యాలయం ఉన్న దేశంగా అమెరికా ఈ విధంగా చేయడం ఐరాస నిబద్ధతకు వ్యతిరేకమని విమర్శించింది. ఐరాసలో రష్యా శాశ్వత రాయబార బృందానికి, ఐరాస కేంద్ర కార్యాలయానికి బహిష్కరణ విషయాన్ని తెలియజేశామని ఐరాసలో అమెరికా రాయబారి ప్రతినిధి ఓలివియా డాల్టన్ తెలిపారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని వీరిపై చర్య తీసుకున్నామని, ఐరాస కేంద్రకార్యాలయ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగానే వారిని బహిష్కరించామని వివరించారు. అమెరికా చర్య నిబంధనలకు వ్యతిరేకమని రష్యా రాయబారి వాస్లీ నెబెంజియా విమర్శించారు. అమెరికా చర్యకు తప్పక ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. అనంతరం ఈ విషయాన్ని ఆయన భద్రతామండలి సమావేశంలో ప్రస్తావించారు. అయితే ఎజెండాలో రాయబారుల బహిష్కరణ అంశం లేదని నెబెంజియాను యూఎస్ ప్రతినిధి అడ్డుకున్నారు. ఉక్రెయిన్‌లో మానవీయ సంక్షోభాన్ని చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైందన్నారు. (చదవండి: మెళ్లకు మైళ్లు నడిచి..) -
తీరు మారని చైనా
అధీన రేఖ వద్ద తలెత్తిన ఘర్షణలపై భారత్, చైనాల మధ్య చర్చలు జరిగి నెల్లాళ్లు కాలేదు. చైనా నిర్వహిస్తున్న వింటర్ ఒలింపిక్స్‌ను ‘దౌత్యపరంగా’ బహిష్కరించాలన్న అమెరికా తదితర దేశాల పిలుపును మన దేశం వ్యతిరేకించి రెండు నెలలు కాలేదు. అయినా చైనా ఎప్పటిలాగే తన నైజాన్ని బయటపెట్టుకుంది. ఈ వేడుకల వేళ భారత్‌ను ఇరకాటంలోకి నెట్టేందుకు నిశ్చయించుకుంది. గాల్వాన్ లోయలో మన సైనిక దళాలపై దాడికి దిగి 20 మందిని పొట్టనబెట్టుకున్న తన ఆర్మీ రెజిమెంట్ కమాండర్‌ను శుక్రవారం నిర్వహించిన క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒలింపిక్స్ జ్యోతి చేతబూనేందుకు ఎంపిక చేసింది. ఇందుకు నిరసనగా మన దేశం ప్రారంభోత్సవ కార్యక్రమంతోపాటు ముగింపు వేడుకలను కూడా బహిష్కరించాలని నిర్ణయించింది. ఒలింపిక్స్ ఆటల చరిత్ర గమనిస్తే వివాదాలు రాజుకోవడం కొత్తేమీ కాదు. అప్పటి జాత్యహంకార దక్షిణాఫ్రికాలో పర్యటించిన న్యూజిలాండ్ రగ్బీ టీమ్‌ను 1976 మాంట్రియల్ ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అనుమ తించినందుకు నిరసన వ్యక్తం చేస్తూ ఆఫ్రికా ఖండ దేశాలు ఆ క్రీడలను బహిష్కరించాయి. జర్మనీ లోని మ్యూనిక్‌లో 1972లో జరిగిన ఒలింపిక్స్ క్రీడలపై పాల స్తీనా ఉగ్రవాద సంస్థ ‘బ్లాక్ సెప్టెంబర్’ పంజా విసిరింది. 9 మంది ఉన్న ఇజ్రాయెల్ టీమ్‌ను బందీలుగా పట్టుకుంది. తర్వాత జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ క్రీడాకారులు మరణించారు. అఫ్గానిస్తాన్‌లో అప్పటి సోవియెట్ యూని యన్ దురాక్రమణను నిరసిస్తూ 1980 మాస్కో ఒలింపిక్స్‌ను అమెరికా, దాని మిత్ర దేశాలు బహిష్క రించాయి. క్రీడాకారులు కొందరు తమ ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ ఒలింపిక్ వేదికలపై ప్రకటనలు చేసిన ఉదంతాలున్నాయి. ఆతిథ్యమిచ్చే దేశాలు ఇలాంటి సమస్యలు తలెత్తుతాయన్న అంచనాతో అప్రమత్తంగా ఉంటాయి. కానీ చైనా తీరు ఇందుకు విరుద్ధం. తానే స్వయంగా సమస్య రాజేసి చరిత్ర సృష్టించింది. తనతో సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ఒలిం పిక్స్ క్రీడల విషయంలో అండగా నిలిచిన భారత్‌ను అవమానపరచడానికి ఆ దేశం పూనుకుంది. ఆతిథేయ దేశంలో చోటుచేసుకుంటున్న మానవ హక్కుల ఉల్లంఘనలనూ, దాని దురాక్రమణ పోకడలనూ అంతర్జాతీయ క్రీడల వేడుకలప్పుడు అజెండాలోకి తెస్తే ఆ దేశం నగుబాటు పాలవు తుందన్న అభిప్రాయం ఎప్పటినుంచో ఉంది. దానికి తగ్గట్టే చైనా తీరుతెన్నులున్నాయి. ఆర్థిక రంగంలో అమెరికాతో పోటీపడుతూ, దాని ప్రభావాన్ని క్రమేపీ క్షీణింపజేయటంలో విజయం సాధిస్తున్న చైనాకు అహంభావం ఎక్కువైంది. అకారణంగా తన ఇరుగుపొరుగుతో గిల్లికజ్జాలకు దిగే ధోరణి పెరిగింది. దక్షిణ చైనా సముద్రంలో జపాన్‌తో తగువు, అధీన రేఖ వద్ద మన దేశంతో ఘర్షణలు, హాంకాంగ్‌లో మానవహక్కులను కాలరాయటం, పశ్చిమ షిన్జియాంగ్లోని వీగర్ ముస్లింలపట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ, వారిని నిర్బంధ శిబిరాల్లో చిత్రహింసలకు గురిచేయటం తదితర అంశాల్లో చాన్నాళ్లుగా ప్రపంచ దేశాలు చైనాను నిలదీస్తున్నాయి. వాస్తవానికి వింటర్ ఒలింపిక్స్‌ను ‘దౌత్యపరంగా’ బహిష్కరించాలన్న అమెరికా పిలుపు ఈ నేపథ్యంలో చాలా చిన్నదని చెప్పుకోవాలి. ఒకపక్క తమ ఆటగాళ్లు ఒలింపిక్స్‌లో అన్ని ఈవెంట్లలోనూ పాల్గొంటుండగా ఆ క్రీడల ప్రారంభ, ముగింపు వేడుకలప్పుడు దౌత్య సిబ్బంది పోరాదని మాత్రమే నిర్ణయించటం వల్ల ఒరిగేదేమిటన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే వర్తమాన ప్రపంచీకరణ యుగంలో ఒలింపిక్స్ క్రీడల వంటి సందర్భాలను పూర్తిగా బహిష్కరించటం సాధ్యమయ్యే పని కాదు. 1980 మాస్కో ఒలింపిక్స్‌ను బహిష్కరించినంత తేలిగ్గా ఇప్పుడు వ్యవహరించటం అమెరికాకు సాధ్యపడదు. అప్పట్లో అమెరికా–సోవియెట్లమధ్య ఎలాంటి ఆర్థిక బంధమూ లేదు. కానీ ఎన్ని తగువులున్నా, ఎంతగా నిందించుకుంటున్నా అమెరికా–చైనాలు ఇప్పుడు పరస్పర ఆధారిత దేశాలు. ఆ రెండింటిలో ఎవరు తెగదెంపులకు ప్రయత్నించినా రెండు దేశాలూ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతాయి. అందుకే అమెరికా తెలివిగా ‘పరిమిత స్థాయి’ బహిష్కరణ మంత్రం పఠించింది. అలాగని అది ఊరుకోలేదు. తన దారిలోనే ఇతర దేశాలూ నడవాలని పిలుపునిచ్చింది. వీటిని ‘నరమేథ క్రీడలు’గా అభివర్ణించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ క్రీడలను ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా సజావుగా పూర్తి చేయటం కత్తి మీద సామే. ఒకపక్క కోవిడ్ భూతం కాచుక్కూర్చుంది. క్రీడల కోసం ప్రపంచం నలుమూలలనుంచీ వేలాదిమంది వచ్చి, అక్కడ వైరస్ వ్యాపిస్తే తదనంతరకాలంలో ప్రపంచ మంతా చైనానే తప్పుపడుతుంది. దానికి తోడు ఒలింపిక్స్ వేదికపై అసమ్మతి జాడలు కనబడకుండా వేయి కళ్లతో చూడాలి. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కూడా అది భారత్‌పై అక్కసు వెళ్లగక్కడానికి కారణం ఉంది. గాల్వాన్ లోయ ఘర్షణల్లో తమ సైనికులు కేవలం నలుగురు మాత్రమే మర ణించారని చైనా అప్పట్లో చేసిన ప్రకటన ఉత్త బుకాయింపేనని ఆస్ట్రేలియా పత్రిక తాజాగా బయటపెట్టింది. ఆ ఉదంతంలో 38 మంది చైనా సైనికులను భారత్ సేనలు మట్టుబెట్టాయని వెల్లడించింది. వింటర్ ఒలింపిక్స్ వేళ చైనాకు ఇది మింగుడుపడని విషయం. అందుకే ఏరికోరి ఒలింపిక్ జ్యోతిని తీసుకెళ్లే బృందంలో అప్పటి ఆర్మీ రెజిమెంట్ కమాండర్‌ను చేర్చి ఉండొచ్చు. ఇలాంటి చవకబారు ఎత్తుగడలు బెడిసికొడతాయని, అంతిమంగా తాను ఏకాకినవుతానని చైనా గ్రహించటం ఉత్తమం. -
కాబూల్ నుంచి భారతీయ సిబ్బంది వెనక్కి
న్యూఢిల్లీ: తాలిబన్ల వశమైన అఫ్గాన్‌లో పరిస్థితులు దారుణంగా మారడంతో కాబూల్‌లో భారత రాయబారిని, ఇతర దౌత్య సిబ్బందిని కేంద్రం సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చింది. దౌత్య సిబ్బందిని తీసుకువచ్చిన భారత వైమానిక దళానికి చెందిన సి–17 రవాణా విమానంలో మొత్తం 150 మంది దౌత్యవేత్తలు, అధికారులు, భద్రతా సిబ్బందిని తీసుకువచ్చారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని హిండెన్ విమానాశ్రయంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ విమానం ల్యాండయింది. అంతకు ముందే మరో విమానంలో 40 మంది భారత్‌కి చేరుకున్నారు. (చదవండి: తాలిబన్లు సంచలన ప్రకటన) దీంతో అఫ్గాన్ నుంచి దౌత్య సిబ్బంది తరలింపు పూర్తయిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పుడు తమ దృష్టి అంతా అక్కడున్న భారతీయుల్ని తీసుకురావడంపైనే ఉందని స్పష్టం చేసింది. ఢిల్లీకి చేరుకోవడానికి ముందు ఉదయం ఇంధనం నింపుకోవడానికి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో విమానం కాసేపు ఆగింది. అఫ్గానిస్తాన్‌లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ జామ్‌నగర్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాబూల్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు. అఫ్గాన్‌లో ఇంకా చాలా మంది భారతీయులు ఉన్నారని వారిని వెనక్కి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా తప్పనిసరిగా విమానాలు నడపాలన్నారు. అయితే తాము అఫ్గాన్ ప్రజల నుంచి దూరమయ్యేమని భావించడం లేదని , వారి సంక్షేమం కోసం ఏదైనా చేస్తామని అన్నారు. వారితో ఏర్పడిన బంధం విడదీయలేదని చెప్పారు. అందుకే వారితో నిరంతరం టచ్‌లో ఉంటామని, పరిస్థితులు ఎలా రూపాంతరం చెందుతాయో చెప్పలేమని టాండన్ పేర్కొన్నారు. ఎదురైన ఎన్నో సవాళ్లు భారతీయ దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకురావడంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఇన్నాళ్లూ రక్షణ కల్పించిన ఇండో–టిబెట్ సరిహద్దు భద్రతా సిబ్బంది (ఐటీబీపీ) భద్రత మధ్య వీరు విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత్‌కు రావాలనుకునే ప్రయాణికులకు వీసాలు ఇచ్చే కార్యాలయం షహీర్ వీసా ఏజెన్సీపై తాలిబన్లు దాడికి దిగడంతో రెండు విమానాల్లో సిబ్బందిని తీసుకువచ్చారు. తొలివిడతలో ప్రయాణించాల్సిన భారతీయులు కాబూల్ విమానాశ్రయానికి వస్తుండగా తాలిబన్లు అడ్డగించారు. వారి దగ్గరున్న వస్తువులన్నీ లాక్కున్నారు. ఇక రెండో విడత వచ్చిన విమానంలో రాయబారి టాండన్ సహా 30 మంది దౌత్య సిబ్బంది, 99 ఐటీబీపీ కమాండోలు, నలుగురు జర్నలిస్టులతో సహా మొత్తం 21 మంది సాధారణ పౌరులు ఉన్నారు. కాబూల్‌లో పరిస్థితుల్ని సమీక్షిస్తున్నాం: జై శంకర్ మరోవైపు కాబూల్‌లో ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నామని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. ç21 మంది భారత పౌరులను కాబూల్ నుంచి పారిస్‌కు తరలించినందుకు ఫ్రాన్స్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మన పౌరులను క్షేమంగా తీసుకురండి: ప్రధాని మోదీ అఫ్గానిస్తాన్‌లోని భారత పౌరులందరినీ క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంబంధిత అధికారులను ఆదేశించారు. భారత్‌కు రావాలని కోరుకుంటున్న అఫ్గాన్‌లోని హిందువులు, సిక్కులకు మన దేశంలో ఆశ్రయం కల్పించాలని చెప్పారు. అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన నేపథ్యంలో భారత్‌లో భద్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల, జాతీయ భద్రతా సలహాదారు దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ల్, అఫ్గానిస్తాన్‌లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్‌లు హాజరయ్యారు. ఎంతో మంది అఫ్గాన్ పౌరులు భారత్ నుంచి సాయం అర్థిస్తున్నారని మోదీ చెప్పారు. వారందరికీ తగిన సాయం అందించాలని సూచించారు. (చదవండి: తాలిబన్ల తొలి మీడియా సమావేశం.. కీలక వ్యాఖ్యలు) -
అమెరికన్లపై ‘సోనిక్’దాడి.. భయాందోళనలు..
వాషింగ్టన్, అమెరికా : చైనాలో ఉన్న అమెరికా దౌత్యవేత్తలపై సోనిక్ దాడి జరిగిందంటూ అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ దాడిలో దౌత్యవేత్తల బృందంలోని వారందరికీ మెదడు సంబంధిత వ్యాధి వచ్చిందని పేర్కొంది. వారందరినీ హుటాహుటిన స్వదేశానికి రప్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. శత్రుదేశానికి చెందిన వారే దౌత్యవేత్తలపై సోనిక్ తరంగాలను ప్రయోగించినట్లు అమెరికా ఆరోపించింది. బుధవారం చైనాలోని అమెరికా దౌత్యవేత్తల బృందం వింత శబ్దాలను విన్నట్లు ఆ దేశానికి చెందిన పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనివల్ల ఇద్దరు జబ్బు పడ్డారని పేర్కొంది. గతేడాది అచ్చం ఇలాంటి సంఘటనే క్యూబాలో జరిగింది. దాదాపు 24 మంది అమెరికన్లు ఈ దాడిలో బ్రెయిన్ ఇంజ్యురీకి గురయ్యారు. దౌత్యవేత్తలపై గుర్తు తెలియని దాడులు జరుగుతున్నాయని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. -
రష్యా దౌత్యాధికారుల్ని బహిష్కరించిన యూఎస్
వాషింగ్టన్: అమెరికాలో పనిచేస్తున్న 60 మంది రష్యా దౌత్యాధికారుల్ని అమెరికా సోమవారం బహిష్కరించింది. వీరందరూ రష్యా ఇంటెలిజెన్స్ అధికారులని ఆరోపించింది. కుటుంబాలతో సహా 7 రోజుల్లోగా దేశంవిడిచి వెళ్లాలని ఆదేశించింది. సియాటెల్‌లోని రష్యా కాన్సులేట్‌ను మూసివేయాలని సూచించింది. బ్రిటన్‌లో రష్యా మాజీ గూఢచారి స్క్రిపాల్, ఆయన కుమార్తెపై పుతిన్ ప్రభుత్వం విషప్రయోగం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ట్రంప్ ఈ ఉత్తర్వులిచ్చారు. బహిష్కరణకు గురైనవారిలో 12 మంది ఐరాసలో పనిచేస్తున్నారు. అమెరికా చరిత్రలో భారీస్థాయిలో రష్యా దౌత్యాధికారుల్ని బహిష్కరించడం ఇదే తొలిసారి. -
పాక్ డే పరేడ్‌లో భారత ఉన్నతాధికారులు
ఇస్లామాబాద్: భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు క్షీణించిన సమయంలో ఓ సంచలనం చోటుచేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన పాకిస్తాన్ డే సైనిక పరేడ్‌కు భారత్ దౌత్యవేత్తలు, సైనికాధికారులు హాజరయ్యారు. పరేడ్‌నకు భారత్ అధికారులను పిలవటం ఇదే తొలిసారి. భారత్ ఉన్నతాధికారులను పరేడ్‌నకు ఆహ్వానించాలన్న నిర్ణయం ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాదేనని స్థానిక మీడియా తెలిపింది. భారత్‌తో చెలిమి కోరుకుంటున్నామని తెలిపేందుకు ఆయన ఈ మేరకు ముందడుగు వేశారని సైనిక వర్గాలు తెలిపాయి. పాక్‌లో భారత రాయబారి బిసారియా, డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్, రక్షణ, సైనిక సలహాదారు బ్రిగేడియర్ సంజయ్ విశ్వాస్ తదితరులు పరేడ్‌లో పాల్గొన్నారు. వీరంతా ఇక్కడి అధికారులు అందజేసిన ‘23 మార్చి పాకిస్తాన్ డే’ అని ఉన్న టోపీలను ధరించి పరేడ్‌ను తిలకించారు. పరేడ్‌లో పాక్ అధ్యక్షుడు మమ్నూ న్ భారత్‌పై నిప్పులు చెరిగారు. భారత్‌లోని పాక్ రాయబారి సొహైల్ గురువారం తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. దౌత్యాధికారులను భారత్ వేధిస్తోందంటూ హైకమిషనర్ మెహమూద్‌ను వారం క్రితం పాక్ వెనక్కి పిలిపించుకున్న విషయం తెలిసిందే. -
బ్రిటీష్ దౌత్యవేత్తలను తరిమేస్తాం: రష్యా
ఆస్టానా: లండన్ నుంచి రష్యాకు చెందిన 23 మంది దౌత్య వేత్తలను లండన్ నుంచి తరిమేస్తామన్న బ్రిటన్ ప్రభుత్వంపై సరైన నిర్ణయం తీసుకుంటామని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ తెలిపారు. బ్రిటీష్ మాజీ గూఢచారి స్ర్కిపాల్‌పై రష్యా దౌత్యవేత్తలు హత్యాయత్నం చేశారనే ఆరోపణలపై ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకుంటున్నట్టు బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే ప్రకటించారు. సిరియాలో కొనసాగుతున్న అల్లకల్లోల పరిస్థితులపై ఇరాన్, టర్కీ విదేశాంగ మంత్రులతో కలిసి కాజా రాజధాని ఆస్టానాలో గురువారం రష్యా విదేశాంగ మంత్రి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే తామూ అమలు చేస్తామనీ, బ్రిటన్ దౌత్యవేత్తలను రష్యా నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. స్ర్కిపాల్ను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమ దేశానికి లేదని, ఫిఫా ప్రపంచకప్-2018 కి ఆతిథ్యం ఇవ్వబోతున్న రష్యాను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ఇంకెవరైనా స్ర్కిపాల్‌పై దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీనికి ముందు రష్యా అధ్యక్షుడి అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ఈ వివాదంపై మాస్కో భావాలకు అనుగుణంగానే తమ అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. స్ర్కిపాల్, అతని కూతురు యులియా పై జరిగిన దాడిని ఖండిస్తూ.. దానిని ‘యూకే సౌభ్రాతృత్వం పై దాడి’గా పేర్కొంటూ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా దేశాలు ఉమ్మడి ప్రకటన చేశాయి. అంతర్జాతీయ స్థాయి కుంభకోణాన్ని మరుగున పరిచేందుకు బ్రిటీష్ మాజీ గూఢచారి స్ర్కిపాల్, అతని కూతురుపై రసాయనాలతో హత్యాయత్నం జరిగిందని ఆయా దేశాలు ఆరోపించాయి. కాగా మార్చి 4న ఇంగ్లండ్‌లోని సలిస్‌బరిలో స్ర్కిపాల్, అతని కూతురుపై రసాయన దాడి జరిగింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
‘మా వాళ్లను వేధిస్తున్నారు’
ఇస్లామాబాద్ : భారత్‌ను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. భారత్‌లో నివసిస్తున్న తమ దౌత్యవేత్తలను, వారి కుటుంబాలను భారత్ వేధిస్తోందని పాక్ ఆరోపించింది. ఈ అంశాన్ని పాక్ ఇస్లామాబాద్‌లో భారత హైకమిషన్‌తో పాటు భారత విదేశాంగ శాఖ దృష్టికి తీసుకువెళ్లినట్టు డాన్ పత్రిక పేర్కొంది. తమ అధికారులపై వేధింపులు నిలిపివేయకపోతే తమ దౌత్యవేత్తలను, వారి కుటుంబాలను వెనక్కిపిలిపిస్తామని పాక్ హెచ్చరించినట్టు ఈ కథనం వెల్లడించింది. పాక్ డిప్యూటీ హైకమిషనర్ పిల్లలు స్కూలుకు వెళుతుండగా వారిని అడ్డగించి వేధింపులకు గురిచేశారని పాక్ దౌత్యవర్గాలు పేర్కొన్నాయి. మరికొందరు దౌత్య సిబ్బందినీ వేధిస్తున్నారని తెలిపాయి. న్యూఢిల్లీలో తమ సీనియర్ దౌత్యవేత్తనూ వేధించారని పాక్ ఆరోపించినట్టు డాన్ పేర్కొంది. పాకిస్తాన్ హైకమిషన్‌కు చెందిన పలు వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయని కూడా ఈ కథనం తెలిపింది. కాగా బిన్ లాడెన్, హఫీజ్ సయీద్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ బాధిత దేశంగా ప్రపంచం ముందు నిలవాలని ప్రయత్నిస్తోందని ఐరాస వేదికగా భారత్ ధ్వజమెత్తిన నేపథ్యంలో పాక్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. -
పెద్ద నోట్ల రద్దుతో రష్యాకు కూడా కోపం..
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో రష్యాకు కూడా కోపం వచ్చింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తమ దేశానికి చెందిన అధికార ప్రతినిధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపట్ల ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి సమస్యలు తీర్చాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానిదేనని నొక్కి చెప్పింది. వెంటనే తమ దౌత్య ప్రతినిధులకు ఎదురవుతున్న డబ్బు సమస్యను తీర్చాల్సిందిగా రష్యా కోరింది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ సమస్య ప్రభావం ఒక్క భారత్‌లోని సామాన్యులనే కాకుండా భారత్‌లో ఉంటున్న, పర్యటిస్తున్న పొరుగు దేశాల వారికి ఇక్కట్లు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తమ సమస్యను భారత్‌లో రష్యా రాయబార కార్యాలయ అధికారులు వారి దేశానికి చెప్పగా ఈ విషయంపై కాస్తంగా గట్టిగా చెప్పింది. ఈ సమస్య ఇలాగే కొనసాగితే భారత్‌తో తాము నిర్వహించాల్సిన పనులు వేగం మందగిస్తుందని, ఒక వేళ తీర్చలేమంటే తాము ప్రత్యామ్నాయాలు కూడా చూసుకుంటామని కూడా ఆ నోటీసుల్లో పేర్కొంది. మాస్కోలోని భారత రాయభార కార్యాలయ అధికారులకు నోటీసులు కూడా పంపిస్తామని మందలించింది. చిన్నచిన్న పనులకు కూడా తమ అధికారులు డబ్బును విత్ డ్రా చేసుకునే పరిస్థితి భారత్‌లో లేకుండా పోయిందని రష్యా రాయబారి అలెగ్జాండర్ కడాకిన్ అన్నారు. విదేశాంగ వ్యవహారాల శాఖ వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. -
పాక్ నుంచి ముగ్గురు దౌత్యవేత్తలు వెనక్కి
న్యూఢిల్లీ: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని తన హైకమిషన్‌కు చెందిన ముగ్గురు దౌత్యవేత్తలను భారత్ మంగళవారం వెనక్కి పిలిపించింది. వీరి ఫొటోలు, ఇతర వివరాలు పాక్ మీడియాలో రావడం, పాక్ వీరిపై గూఢచర్య అభియోగాలు మోపడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అనురాగ్ సింగ్(ప్రథమ కార్యదర్శి-వాణిజ్యం), విజయ్ కుమార్ వర్మ, మాధవన్ నందకుమార్‌లు పాక్ నుంచి బయల్దేరారు. పలువురు భారత దౌత్యవేత్తలు దౌత్య పనుల పేరుతో తమ దేశంలో ఉగ్రవాద, విద్రోహ చర్యలను సమన్వయం చేస్తున్నారని పాక్ విదేశాంగ శాఖ ఆరోపించడం తెలిసిందే. డిప్యూటీ హై కమిషనర్‌ను పిలిచిన పాక్ ఇదిలా ఉండగా భారత దళాలు సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ ఇస్లామాబాద్‌లోని భారత డిప్యూటీ హై కమిషనర్ జేపీ సింగ్‌ను పాక్ విదేశాంగ శాఖ పిలిపించుకుని నిరసన తెలిపింది. -
పాక్‌లోని దౌత్యాధికారులు వెనక్కివచ్చేయండి!
-
పాక్‌లోని దౌత్యాధికారులు వెనక్కివచ్చేయండి!
న్యూఢిల్లీ : పాకిస్తాన్లో పనిచేస్తున్న ఎనిమిది మంది భారత దౌత్యాధికారులను విదేశాంగ వ్యవహారాల శాఖ వెనక్కి రప్పిస్తోంది. వారి గుర్తింపుకు సంబంధించిన ఫోటోలను, పేర్లను అక్కడి స్థానిక మీడియాలో ప్రచురితం కావడంతో, దౌత్యాధికారులకు ప్రమాదం వాటిల్లే అవకాశముందని భావించిన భారత్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గూఢచర్యం అనుమానంతో ఐదుగురు భారత దౌత్యాధికారులను ఇస్లామాబాద్ తొలగించిందని ఆ దేశ మీడియా రిపోర్టు చేసింది. న్యూఢిల్లీలో దౌత్య పరమైన రక్షణలో ఉంటున్న ఆరుగురు పాకిస్తానీ అధికారులనూ ఆ దేశం వెనక్కి రప్పించుకుంది. భారత్‌లోని పాకిస్తాన్ హై కమిషన్‌లో పనిచేస్తున్న ఈ ఆరుగురు రహస్యంగా వివిధ రకాల సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నారని మెహ్మముద్ అక్తర్ ద్వారా వెల్లడైంది. గూఢచర్య ఆరోపణలతో ఢిల్లీలో అరెస్టు అయిన అక్తర్, ఆపై దేశ బహిష్కరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. మెహ్మముద్ అక్తర్, ఢిల్లీలోని పాక్ హైకమిషన్ వీసా సెక్షన్లో పనిచేస్తున్నాడు. ఇతను రహస్యంగా గూఢచర్యులను నియమిస్తున్నాడు. రాజస్తాన్‌కు చెందిన ఓ ఇద్దరి నుంచి సెన్సిటివ్ ఇంటెల్, డాక్యుమెంట్లను తీసుకుంటున్న క్రమంలో ఢిల్లీ జూలో ఇతను పోలీసులకు పట్టుబడ్డాడు.. మూడేళ్ల క్రితమే పాకిస్తానీ ఇంటెల్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ ఇతన్ని భారత్‌లో నియమించిందని, అనంతరం ఢిల్లీలో హైకమిషన్‌గా పోస్టు చేసిందని వెల్లడైంది.. అక్తర్‌తో పాటు మరో 16 మంది ఉద్యోగులు దౌత్యపరమైన రక్షణలో పాల్గొంటూ భారత్‌లో గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఢిల్లీ పోలీసు, ఇంటిలిజెన్స్ ఏజెన్సీల విచారణలో వెల్లడైంది. బీఎస్ఎఫ్, ఆర్మీకి సంబంధించిన సమాచారాన్నంతటిన్నీ రహస్యంగా పాకిస్తాన్‌కు చేరవేస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ లో ఉన్న భారత దౌత్యాధికార సిబ్బంది వివరాలన్నీ బయటకు వచ్చాయి. -
ఆ నలుగురు... 25 లక్షల సాయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కూడా నగరవాసులు చెంబు పట్టుకొని బహిర్భూమికి వెళ్లడం చూసి కదిలిపోయాడు బోస్నియా అంబాసిడర్ సాబిత్ సుబాసిక్. వర్ధమాన దేశం భారత్‌లో కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏమిటని ఆశ్చర్యపోయారు. దీన్ని నిర్మూలించేందుకు తన వంతు సాయం చేయాలనుకున్నారు. మరుగుదొడ్డి సౌకర్యం లేని పేదవారికి ఆ సౌకర్యాన్ని కల్పించాలనుకున్నారు. అందుకు మదిలో ఓ ఆలోచన మెదిలింది. దాన్ని అమలు చేసేందుకు సెర్బియా, గౌతమాల, చిలీ అంబాసిడర్లను (వ్లాదిమీర్ మిరిక్, ఆండ్రెస్ బార్బ్, జార్జెస్ డీ లా రోచెస్) కలిశారు. భారత్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న దౌత్యవేత్తల మధ్య టెన్నిస్ టౌర్నమెంట్‌ను నిర్వహించాలని, దాని ద్వారా వీలైనంత మేరకు డబ్బు సేకరించాలని నలుగురు అంబాసిడర్లు నిర్ణయించారు. అనుకున్నట్లుగానే అఖిల భారత టెన్నిస్ అసోసియేషన్ సహకారంతో ఏప్రిల్ 16, 17 తేదీల్లో ఈ టోర్నమెంట్‌ను ఢిల్లీ నగరంలోని ఆర్కే ఖన్నా స్టేడియంలో విజయవంతంగా నిర్వహించారు. వారు ఊహించని విధంగా స్పాన్సర్‌షిప్‌లు, విరాళాల రూపంలో 25 లక్షల రూపాయలు వచ్చాయి. దేశంలో మరుగుదొడ్ల నిర్మాణం కోసం కషి చేస్తున్న ఎన్జీవో సంస్థ సులభ్ ఇంటర్నేషనల్ సహకారం కూడా తీసుకున్నారు. ఈ పాతిక లక్షల రూపాయలను పేదల మరుగుదొడ్ల నిర్మాణం కోసం తాము వెచ్చిస్తామని బోస్నియా అంబాసిడర్ సాబిత్ మీడియాకు తెలిపారు. విదేశీ దౌత్యవేత్తలకు ఎక్కువగా టెన్నిస్ ఆడడం వచ్చుకనుక తాము విరాళాల కోసం ఈ ఆటను ఎంచుకున్నామని చెప్పారు. మరుగుదొడ్ల సమస్య పట్ల విదేశీ దౌత్యవేత్తల మధ్య అవగాహన పెంచడం కూడా తమ ఈ ఆట ఉద్దేశమని అన్నారు. భవిష్యత్‌లో ఫుట్‌బాల్, క్రికెట్ లాంటి ఆటల పోటీలు కూడా నిర్వహించి మరగుదొడ్ల కోసం విరాళాలు సేకరిస్తామని ఆయన తెలిపారు. -
ఆ అధికారులను కోల్‌కతా మ్యాచ్‌కు రానివ్వలేదు
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం కోల్ కతా వచ్చేందుకు పాక్ దౌత్యవేత్తలకు కేంద్రం అనుమతి నిరాకరించింది. మార్చి 19న భారత్- పాకిస్తాన్ మధ్య కోల్ కతాలో వరల్డ్ టీ 20 మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పాకిస్తాన్ అధికారులు ఏడుగురు కోల్ కతా వచ్చేందుకు అనుమతి కోరగా.. చివరినిమిషం వరకు తమకు అనుమతి ఇవ్వలేదని, చివరినిమిషంలో ఇద్దరు అధికారులకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో వారు కూడా కోల్‌కతాకు వచ్చే అవకాశం లేదని పాక్ వర్గాలు తెలిపాయి. కోల్ కతా మ్యాచ్ కోసం పాక్ దౌత్యవేత్తలకు భారత్ అనుమతి నిరాకరించడం నిజమేనని భారత్ కు చెందిన డిప్యూటీ హై కమిషనర్ జేపీ సింగ్ ఇస్లామాబాద్ లో తెలిపారు. అయితే, ఇద్దరు దౌత్యవేత్తలకు కోల్ కతా వచ్చేందుకు ప్రయాణ అనుమతులు మంజూరు చేశామని, మరో ఐదుగురికి మాత్రం నిరాకరించామని భారత అధికారులు తెలిపారు. ఆ ఐదుగురికి పాకిస్తాన్ అంతర్గత భద్రతా సిబ్బందితో, ముఖ్యంగా ఐఎస్ఐతో సంబంధాలు ఉండటం వల్లే అనుమతి నిరాకరించామని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 వరకు మొత్తం ఏడుగురిలో ఏ ఒక్కరికి అనుమతులు రాలేదని పాకిస్తాన్ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ క్రికెట్ జట్టును ప్రోత్సహించేందుకే దౌత్యవేత్తలు కోల్ కతాకు వెళుదామనుకుంటున్నారని, ఈ విషయంలో భారత ప్రభుత్వం అనవసరంగా సమస్యను సృష్టిస్తోందని పాక్ దౌత్యవర్గాలు ఆరోపిస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా పాక్ జట్టు మ్యాచులు జరగనున్న కోల్ కతా , మొహాలీలను సందర్శించేందుకు పాకిస్తాన్ దౌత్యవేత్తలు, ప్రముఖులతో సహా 45 మందికి అనుమతి ఇవ్వాలని కేంద్ర విదేశాంగ శాఖను పాక్ కోరిందని తెలుస్తోంది. అయితే పాక్ మ్యాచ్ ఆడుతున్న ప్రతిచోటుకీ అంతమందిని అనుమతించడం సాధ్యం కాదని, ఇటువంటి నిర్ణయాలు అన్యోన్యత ఆధారంగా తీసుకుంటారని ఓ భారతీయ అధికారి తెలిపారు -
రెండో ప్రపంచ యుద్ధ వీరులకు నివాళి
సింగపూర్: రెండో ప్రపంచ యుద్ధ వీరులకు ఘన నివాళి అర్పించారు. ఆదివారం సింగపూర్‌లోని ప్రపంచ యుద్ధ వీర సైనికుల స్మారక స్థూపం (రాంజీ వార్ సెమిటరీ) వద్దకు చేరుకున్న పలు దేశాల నేతలు తమతమ దేశాల నుంచి యుద్ధంలో పాల్గొని వీర మరణం పొందిన సైనికులకు ఘన నివాళి అర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. నివాళి అర్పించినవారిలో భారత్, జపాన్‌తోపాటు ఇతర ఎనిమిది దేశాలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు. ఈ యుద్ధం సమయంలో మొత్తం 1,30,000మంది బ్రిటన్ తరుపున సైనికులు పాల్గొనగా వారిలో 67వేలమంది భారత్‌కు చెందిన సైనికులు ఉన్నారు. వీరంతా వీర మరణం పొందారు. కాగా, ఈ సందర్భంగా ప్రపంచ వర్థిల్లాలని పేర్కొంటూ పలు శాంతి సంకేతాలతో కూడా వస్తువులను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.