వాషింగ్టన్, అమెరికా : చైనాలో ఉన్న అమెరికా దౌత్యవేత్తలపై సోనిక్ దాడి జరిగిందంటూ అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ దాడిలో దౌత్యవేత్తల బృందంలోని వారందరికీ మెదడు సంబంధిత వ్యాధి వచ్చిందని పేర్కొంది. వారందరినీ హుటాహుటిన స్వదేశానికి రప్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.
శత్రుదేశానికి చెందిన వారే దౌత్యవేత్తలపై సోనిక్ తరంగాలను ప్రయోగించినట్లు అమెరికా ఆరోపించింది. బుధవారం చైనాలోని అమెరికా దౌత్యవేత్తల బృందం వింత శబ్దాలను విన్నట్లు ఆ దేశానికి చెందిన పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనివల్ల ఇద్దరు జబ్బు పడ్డారని పేర్కొంది.
గతేడాది అచ్చం ఇలాంటి సంఘటనే క్యూబాలో జరిగింది. దాదాపు 24 మంది అమెరికన్లు ఈ దాడిలో బ్రెయిన్ ఇంజ్యురీకి గురయ్యారు. దౌత్యవేత్తలపై గుర్తు తెలియని దాడులు జరుగుతున్నాయని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment