వాషింగ్టన్: అమెరికాలో పనిచేస్తున్న 60 మంది రష్యా దౌత్యాధికారుల్ని అమెరికా సోమవారం బహిష్కరించింది. వీరందరూ రష్యా ఇంటెలిజెన్స్ అధికారులని ఆరోపించింది. కుటుంబాలతో సహా 7 రోజుల్లోగా దేశంవిడిచి వెళ్లాలని ఆదేశించింది. సియాటెల్‌లోని రష్యా కాన్సులేట్‌ను మూసివేయాలని సూచించింది. బ్రిటన్‌లో రష్యా మాజీ గూఢచారి స్క్రిపాల్, ఆయన కుమార్తెపై పుతిన్ ప్రభుత్వం విషప్రయోగం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ట్రంప్ ఈ ఉత్తర్వులిచ్చారు. బహిష్కరణకు గురైనవారిలో 12 మంది ఐరాసలో పనిచేస్తున్నారు. అమెరికా చరిత్రలో భారీస్థాయిలో రష్యా దౌత్యాధికారుల్ని బహిష్కరించడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment