పాక్లోని దౌత్యాధికారులు వెనక్కివచ్చేయండి!
పాక్లోని దౌత్యాధికారులు వెనక్కివచ్చేయండి!
Published Thu, Nov 3 2016 11:27 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
న్యూఢిల్లీ : పాకిస్తాన్లో పనిచేస్తున్న ఎనిమిది మంది భారత దౌత్యాధికారులను విదేశాంగ వ్యవహారాల శాఖ వెనక్కి రప్పిస్తోంది. వారి గుర్తింపుకు సంబంధించిన ఫోటోలను, పేర్లను అక్కడి స్థానిక మీడియాలో ప్రచురితం కావడంతో, దౌత్యాధికారులకు ప్రమాదం వాటిల్లే అవకాశముందని భావించిన భారత్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గూఢచర్యం అనుమానంతో ఐదుగురు భారత దౌత్యాధికారులను ఇస్లామాబాద్ తొలగించిందని ఆ దేశ మీడియా రిపోర్టు చేసింది. న్యూఢిల్లీలో దౌత్య పరమైన రక్షణలో ఉంటున్న ఆరుగురు పాకిస్తానీ అధికారులనూ ఆ దేశం వెనక్కి రప్పించుకుంది.
భారత్లోని పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేస్తున్న ఈ ఆరుగురు రహస్యంగా వివిధ రకాల సమాచారాన్ని పాక్కు చేరవేస్తున్నారని మెహ్మముద్ అక్తర్ ద్వారా వెల్లడైంది. గూఢచర్య ఆరోపణలతో ఢిల్లీలో అరెస్టు అయిన అక్తర్, ఆపై దేశ బహిష్కరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. మెహ్మముద్ అక్తర్, ఢిల్లీలోని పాక్ హైకమిషన్ వీసా సెక్షన్లో పనిచేస్తున్నాడు. ఇతను రహస్యంగా గూఢచర్యులను నియమిస్తున్నాడు. రాజస్తాన్కు చెందిన ఓ ఇద్దరి నుంచి సెన్సిటివ్ ఇంటెల్, డాక్యుమెంట్లను తీసుకుంటున్న క్రమంలో ఢిల్లీ జూలో ఇతను పోలీసులకు పట్టుబడ్డాడు.. మూడేళ్ల క్రితమే పాకిస్తానీ ఇంటెల్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ ఇతన్ని భారత్లో నియమించిందని, అనంతరం ఢిల్లీలో హైకమిషన్గా పోస్టు చేసిందని వెల్లడైంది..
అక్తర్తో పాటు మరో 16 మంది ఉద్యోగులు దౌత్యపరమైన రక్షణలో పాల్గొంటూ భారత్లో గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఢిల్లీ పోలీసు, ఇంటిలిజెన్స్ ఏజెన్సీల విచారణలో వెల్లడైంది. బీఎస్ఎఫ్, ఆర్మీకి సంబంధించిన సమాచారాన్నంతటిన్నీ రహస్యంగా పాకిస్తాన్కు చేరవేస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ లో ఉన్న భారత దౌత్యాధికార సిబ్బంది వివరాలన్నీ బయటకు వచ్చాయి.
Advertisement