![Congress MP Gaurav Gogoi Slams Himanta Sarma](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/gaurav%20gogoi%20and%20his%20wife.jpg.webp?itok=xnATJ3uq)
డిస్పూర్ : అవునా? నా భార్య పాకిస్తాన్ ఐఏస్‌ఐ ఏజెంట్ అయితే.. నేను ఇండియన్ రా ఏజెంట్‌ను’అంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) చేసిన ఆరోపణలకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ (Gaurav Gogoi) కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం హేమంత్ బిశ్వశర్మలో కనిపిస్తోంది. అందుకే ఏం చేయాలో పాలుపోక ఇలా నాపై, నా కుటుంబ సభ్యులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడీ ఇరువురి నేతల మధ్య మాటల యుద్ధం అస్సాం రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారాయి.
సీఎం హిమంత బిశ్వ శర్మ అస్సాం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయన గురించి, ఆయన సతీమణి యూకే సంతతికి చెందిన ఎలిజబెత్ కోల్బర్న్ గురించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ ఎంపీ సతీమణికి పాకిస్తాన్ ఐఎస్ఐ సంబంధాలు, యువకులను పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి తరలించి వారిని బ్రెయిన్‌వాష్ చేయడం, తీవ్రవాదం వైపు మళ్లించడం, గత 12 ఏళ్లుగా భారత పౌరసత్వం తీసుకోవడానికి నిరాకరించడం వంటి అంశాలపై వివరణ ఇవ్వాలనేది’ ఆ ట్వీట్‌లోని సారాశాం.
In 2015, the Pakistani High Commissioner to India, Mr. Abdul Basit, invited a first-term Member of Parliament (MP) and his startup, Policy for Youth, to discuss India-Pakistan relations at the Pakistan High Commission in New Delhi. Notably, this MP was not a member of the…
— Himanta Biswa Sarma (@himantabiswa) February 13, 2025
హిమంత్ బిశ్వశర్మ ట్వీట్‌పై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ స్పందించారు. హిమంత బిశ్వశర్మ, ఆయన పార్టీ (బీజేపీ)లోని ఇతర నేతలు చేస్తున్న ఆరోపణలు నవ్వు తెప్పిస్తున్నాయి. నా భార్య పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెంట్ అయితే, నేను ఇండియన్ రా ఏజెంట్‌ని. కేసులు పెట్టడం, నా కుటుంబంపై ఆరోపణలు చేయడంపై నాకు అభ్యంతరం లేదు. తనపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానిబే సీఎం ఆరోపణలు చేస్తున్నారు.
బీజేపీ చేస్తున్న ఆరోపణలు కొత్తవేం కాదు. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాపై, నా కుటుంబంపై బీజేపీ ఇలాంటి ఆరోపణలు చేసింది. అందుకు (గౌవర్ గోగోయ్ పార్లమెంట్) జోర్హాట్ పార్లమెంట్ ప్రజలు గట్టిగా బదులిచ్చారు.
అదే సమయంలో అస్సాం సీఎం హిమంత శర్మపై సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రజల్లో బీజేపీ విశ్వాసం కోల్పోయింది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగేందుకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయినా హిమంత భిశ్వశర్మ తన పదవిని కోల్పోతానేమోనన్న భయం వెంటాడుతోంది. ఆ భయం బీజేపీలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అందుకే భయపడి, నాపై, నా కుటుంబంపై దుష్ప్రచారం చేసి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు’ అని గొగోయ్ ఆరోపించారు.
👉చదవండి : ‘అప్పుల కుప్పగా తెలంగాణ’.. పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్
Comments
Please login to add a commentAdd a comment