మాస్కో: గూఢచర్యం ఆరోపణలపై ఆరుగురు బ్రిటన్ దౌత్యవేత్తలను రష్యా బహిష్కరించింది. మాస్కోలోని బ్రిటన్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ఆరుగురు దౌత్యవేత్తలు రష్యా కీలక సమాచారాన్ని శత్రు దేశాలకు చేరవేస్తున్నట్లు ఆధారాలు దొరికాయని అధికారులు తెలిపారు. దీని వల్ల రష్యా భద్రతకు ముప్పుండడంతో వారిని బహిష్కరించినట్లు వెల్లడించారు.
బ్రిటిష్ ఎంబసీలోని ఆరుగురు సభ్యులు గూఢచర్యానికి పాల్పడినట్లుగా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ ఆఫ్ రష్యా ఆధారాలు సమర్పించింది. అయితే లండన్‌కు, మాస్కోకు మధ్య ఉన్న స్నేహం కారణంగా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా బహిష్కరించామని అధికారులు తెలిపారు.గూఢచర్యంలో ఇతర దౌత్యవేత్తల ప్రమేయం ఉందని తెలిస్తే వారిని కూడా బహిష్కరిస్తామని చెప్పారు.
అయితే రష్యా చేసిన ఈ ఆరోపణలపై మాస్కోలోని బ్రిటన్ ఎంబసీ స్పందించలేదు. కాగా గూఢచర్యం ఆరోపణలతో రష్యా ఎంబసీలో రక్షణ వ్యవహారాలను పర్యవేక్షించే ఓ అధికారిని బ్రిటన్ ఇటీవల బహిష్కరించింది. ఇందుకు కౌంటర్‌గానే తాజాగా రష్యా బ్రిటన్ దౌత్యవేత్తలను బహిష్కరించి ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది.
ఇదీ చదవండి.. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment