భారత దౌత్యవేత్తలపై నిఘా: కెనడా | Canada's foreign minister warned India's remaining diplomats not to endanger Canadian lives. | Sakshi
Sakshi News home page

భారత దౌత్యవేత్తలపై నిఘా: కెనడా

Published Sat, Oct 19 2024 10:28 AM | Last Updated on Sat, Oct 19 2024 11:22 AM

Canada's foreign minister warned India's remaining diplomats not to endanger Canadian lives.

ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించి ఒట్టావాలోని భారత హైకమిషన్‌ర్‌ను కెనడా అనుమానితునిగా పేర్కొటంతో ఇరు దేశాల దౌత్య సంబంధాలు క్షిణించాయి. కెనడా చేసిన ఆరోపణులను ఇప్పటికే భారత్‌ తీవ్రంగా ఖండించింది. తాజాగా కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కీలక వ్యాఖ్యలు చేశారు. మిగిలిన భారత దౌత్యవేత్తలపై నిఘా వేసి ఉంచామని అన్నారు. ఒట్టావా హై కమిషనర్‌తో సహా ఆరుగురు భారత దౌత్యవేత్తలను తొలగించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా వియన్నా కన్వెన్షన్‌ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదన్నారు. 

చదవండి: కెనడాలో భారతీయుల హవా.. విద్యా, ఉద్యోగాల్లో ముందంజ

‘‘మన దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదు. కెనడా గడ్డపై విదేశీ అణచివేత జరగదు. ఐరోపాలో ఇటువంటి ఘటన చూశాం. జర్మనీ , బ్రిటన్‌లో రష్యా  విదేవీ జోక్యానికి పాల్పడింది. మేం ఈ విషయంలో చాలా దృఢంగా ఉన్నాం’’ అని అన్నారు. ఇతర భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరిస్తారా? మీడియా అడిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘‘ మిగిలిన భారత దౌత్యవేత్తలపై స్పష్టంగా నిఘా వేసి ఉంచాం. భారత దౌత్యవేత్తల్లో ఒట్టావాలోని హైకమిషనర్‌తో సహా ఆరుగురిని బహిష్కరించాం. ఇతరులు ప్రధానంగా టొరంటో, వాంకోవర్‌లో  ఉన్నారని తెలిపారు. అదేవిధంగా  భారత దౌత్య వేత్తలు వియన్నా కన్వెన్షన్‌ ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తే మేం సహించబోం’’ అని అన్నారు.

నిజ్జర్‌ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం పంపింది. ఇక.. దీనిపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన విషయం తెలిసిందే.

చదవండి: దృష్టి మరల్చేందుకే.. నిజ్జర్‌ హత్య తెరపైకి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement