Foreign Affairs
-
సరిహద్దుల్లో ఫెన్సింగ్ నిర్మాణం.. భారత హై కమిషనర్‌కు బంగ్లా సమన్లు
ఢాకా: రెండు దేశాల సరిహద్దుల్లోని ఐదు ప్రాంతాల్లో ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించిందంటూ బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఆదివారం ఢాకాలోని భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మకు సమన్లు జారీ చేసింది. కంచె నిర్మాణం ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ప్రణయ్ వర్మ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లి విదేశాంగ శాఖ కార్యదర్శి జషీముద్దీన్‌తో దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిపినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ బీఎస్ఎస్ తెలిపింది. ఈ పరిణామంపై అక్కడి ఆపద్ధర్మ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. సమావేశం అనంతరం హైకమిషనర్ వర్మ మీడియాతో మాట్లాడారు. ‘రెండు దేశాల సరిహద్దులను బీఎస్ఎఫ్, బీజీబీలు కాపలాకాస్తున్నాయి. ఈ రెండు విభాగాలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి కూడా. సరిహద్దుల వెంట నేరాల కట్టడికి రెండు దేశాల మధ్య ఉన్న అంగీకారానికి అనుగుణంగా సహకారం కొనసాగుతుందని ఆశిస్తున్నాం’అని చెప్పారు. అంతకుముందు, బంగ్లాదేశ్ హోం శాఖ సలహాదారు జహంగీర్ ఆలం చౌదరి మీడియాతో మాట్లాడుతూ..ఒప్పందానికి విరుద్ధంగా సరిహద్దుల్లో భారత్ ఫెన్సింగ్ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలను బంగ్లా జవాన్లు, స్థానికులు అడ్డుకున్నారని చెప్పారు. 1974లో కుదిరిన ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని చెప్పారు. -
స్వదేశానికి గుడ్ బై
సాక్షి, అమరావతి: గడచిన రెండు దశాబ్దాల్లో విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం సంపన్న దేశాలకు భారతీయుల వలసలు పెరిగాయి. ఇలా వెళ్లిన వారిలో వ్యక్తిగత సౌకర్యం కోసం విదేశాల్లోనే స్థిరపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా కరోనా అనంతరం భారత పౌరసత్వం వదులుకుని స్వదేశానికి గుడ్‌బై చెబుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2011–2023 మధ్య పదమూడేళ్లలో ఏకంగా 18,79,659 మంది ఎన్నారైలు భారత పౌరసత్వాన్ని వదులుకుని.. విదేశాల్లో పౌరసత్వం స్వీకరించారు. అత్యధికంగా 2022లో 2.25 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 135 దేశాల్లో ఎన్నారైలు పౌరసత్వం స్వీకరించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతోనే వీరందరూ పౌరసత్వం వదులుకున్నట్టు పేర్కొంది.అమెరికాలో రెండో స్థానం వివిధ దేశాల నుంచి అమెరికాకు వెళ్లి అక్కడి పౌరసత్వం స్వీకరిస్తున్న వారిలో భారతీయులు రెండో స్థానంలో ఉంటున్నారు. 2022లో 9.69 లక్షల మంది విదేశీయులు అమెరికా పౌరసత్వం స్వీకరించారు. వీరిలో మెక్సికన్లు 1.28 లక్షలు ఉండగా.. 65,960 మందితో భారత్ రెండో స్థానంలో నిలిచింది. అమెరికాతో పాటు, కెనడా, రష్యా, సింగపూర్, న్యూజిలాండ్, యూకే వంటి దేశాల్లో స్థిరపడటానికి ఎక్కువ మంది ఎన్నారైలు మొగ్గుచూపుతున్నారు. అత్యున్నత జీవన ప్రమాణాలతో పాటు పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రశాంత జీవనం, పిల్లల భవిష్యత్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎక్కువ మంది విదేశాల్లోనే శాశ్వతంగా స్థిరపడటానికి ఇష్టపడుతున్నారు. -
ఫోన్‌ట్యాపింగ్ కేసులో అనూహ్య మలుపు.. ప్రభాకర్‌రావు మరో పిటిషన్
సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన పాస్‌పోర్టు రద్దు చేయడాన్ని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు విదేశాంగ శాఖ వద్ద సవాల్ చేశారు. విదేశాంగశాఖ ద్వారానే ప్రభాకర్ రావును రప్పించే పనిలో పోలీసులు ఇప్పటికే నిమగ్నమయ్యారు.ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్‌పోర్టును పోలీసులు రద్దు చేయించారు. ఇంటర్‌పోల్ ద్వారా ప్రభాకర్‌రావుకు రెడ్‌కార్నర్ నోటీసు ఇప్పించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. మరోవైపు రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్‌రావు పిటిషన్ పెట్టుకున్నారు. కాగా,ఇదే కేసులోమరో నిందితుడు శ్రవణ్‌రావు చికాగోలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
భారత దౌత్యవేత్తలపై నిఘా: కెనడా
ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి ఒట్టావాలోని భారత హైకమిషన్ర్ను కెనడా అనుమానితునిగా పేర్కొటంతో ఇరు దేశాల దౌత్య సంబంధాలు క్షిణించాయి. కెనడా చేసిన ఆరోపణులను ఇప్పటికే భారత్ తీవ్రంగా ఖండించింది. తాజాగా కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కీలక వ్యాఖ్యలు చేశారు. మిగిలిన భారత దౌత్యవేత్తలపై నిఘా వేసి ఉంచామని అన్నారు. ఒట్టావా హై కమిషనర్‌తో సహా ఆరుగురు భారత దౌత్యవేత్తలను తొలగించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా వియన్నా కన్వెన్షన్ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదన్నారు. చదవండి: కెనడాలో భారతీయుల హవా.. విద్యా, ఉద్యోగాల్లో ముందంజ‘‘మన దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదు. కెనడా గడ్డపై విదేశీ అణచివేత జరగదు. ఐరోపాలో ఇటువంటి ఘటన చూశాం. జర్మనీ , బ్రిటన్‌లో రష్యా విదేవీ జోక్యానికి పాల్పడింది. మేం ఈ విషయంలో చాలా దృఢంగా ఉన్నాం’’ అని అన్నారు. ఇతర భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరిస్తారా? మీడియా అడిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘‘ మిగిలిన భారత దౌత్యవేత్తలపై స్పష్టంగా నిఘా వేసి ఉంచాం. భారత దౌత్యవేత్తల్లో ఒట్టావాలోని హైకమిషనర్‌తో సహా ఆరుగురిని బహిష్కరించాం. ఇతరులు ప్రధానంగా టొరంటో, వాంకోవర్‌లో ఉన్నారని తెలిపారు. అదేవిధంగా భారత దౌత్య వేత్తలు వియన్నా కన్వెన్షన్ ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తే మేం సహించబోం’’ అని అన్నారు.నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం పంపింది. ఇక.. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన విషయం తెలిసిందే.చదవండి: దృష్టి మరల్చేందుకే.. నిజ్జర్ హత్య తెరపైకి -
కిమ్ కాదు, సోరోస్ కాదు.. ఉపవాసానికే నా ఓటు!
ఓవైపు అంతర్జాతీయ అంశాలపై అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకునే విదేశాంగ మంత్రి ఎస్.జైశకంర్ తనలోని సరదా కోణాన్ని ఆవిష్కరించారు. వాక్చాతుర్యంతో సభికులను కడుపుబ్బా నవ్వించారు. ఒక కార్యక్రమంలో ముఖాముఖి సందర్భంగా వ్యాఖ్యాత ఆయనకు ర్యాపిడ్‌ఫైర్ ప్రశ్న సంధించారు. ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్, భారత్‌ను విమర్శించే హంగరీ అమెరికన్ కుబేరుడు జార్జ్ సోరోస్ల్లో మీరు ఎవరితో భోజనం చేస్తారని అడిగారు. జైశంకర్ ఏ మాత్రం తడుముకోకుండా, ‘దుర్గా నవరాత్రులు కదండీ! నేను ఉపవాస దీక్షలో ఉన్నా!’ అంటూ బదులివ్వడంతో అంతా పగలబడి నవ్వారు. ఐరాస.. ఓ పాత కంపెనీ ఐక్యరాజ్యసమితి ప్రస్తుత పరిస్థితిపై జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో స్థలాన్ని ఆక్రమించుకుని, మార్కెట్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చలేని పాత కంపెనీలా మారిందంటూ ఆక్షేపించారు. ఆదివారం ఆయన కౌటిల్య ఆర్థిక సదస్సులో మాట్లాడారు. ‘‘ప్రపంచ దేశాలను నేడు రెండు తీవ్ర సంక్షోభాలు తీవ్రంగా ఆందోళన పరుస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఐరాస ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. కీలకాంశాలను పట్టించుకోకుంటే దేశాలు తమ దారి చూసుకుంటాయి. కోవిడ్ కల్లోలంలోనూ ఐరాస చేసింది చాలా తక్కువ’’ అన్నారు. – న్యూఢిల్లీ -
దీదీ వ్యాఖ్యల్ని ఖండించిన బంగ్లాదేశ్
ఢాకా: తమ దేశ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ స్పందించింది. సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారా శాఖ మంగళవారం భారత ప్రభుత్వానికి ఒక అధికారిక నోట్ పంపించింది.చదవండి: సీఎం మమత వ్యాఖ్యలపై గవర్నర్ అభ్యంతరం.. ‘నివేదిక ఇవ్వండి’‘‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మీద మాకు గౌరవం ఉంది. వారితో మేము చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాం. కానీ బంగ్లాదేశ్ ప్రజల పట్ల ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మేము భారత ప్రభుత్వానికి ఒక అధికారిక నోట్ పంపుతున్నాం’’ అని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రి హసన్ మహమూద్ తెలిపారు.నిస్సహాయులైన బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని ఇటీవల నిర్వహించిన ఓ ర్యాలీలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు చేసిన నిరసన హింసాత్మకంగా మారింది. వారం రోజులు పాటు తీవ్రంగా జరిగిన విద్యార్థుల ఆందోళనలో వందకుపైగా నిరసనకారులు మృతి చెందారు. ఇలాంటి సమయంలో సరిహద్దు రాష్ట్రం పశ్చిమబెంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.చదవండి: బంగ్లా దేశీయులకు ఆశ్రయం ఇస్తాం: సీఎం మమత -
భారత్‌కు మాల్దీవుల మంత్రి.. కారణం అదేనా?
ఢిల్లీ: భారత్, మాల్దీవుల మధ్య దౌత్యపరంగా విబేధాలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.వివరాల ప్రకారం.. గురువారం(మే 9వ తేదీన) భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మూసా జమీర్ ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా భారత్, మాల్దీవుల మధ్య కీలక సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు ప్రాంతీయపరమైన అంశాలను చర్చించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌కు మాల్దీవులు కీలక భాగస్వామి. జమీర్ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం అందిస్తుందని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది.ఇక, మాల్దీవుల నుంచి భారత బలగాలను వెనక్కి తీసుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు మయిజ్జు కోరిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను మే 10వ తేదీ వరకు గడువు విధించారు. ఈ నేపథ్యంలో మే 9వ తేదీన జరిగే సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక, మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులు ఇప్పటికే చాలా మంది వెనక్కి వచ్చేశారు.ఇదిలా ఉండగా.. మాల్దీవులకు మయిజ్జు అధ్యక్షుడైన తర్వాత భారత్‌కు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రాగన్ కంట్రీ చైనాకు మద్దతు పలికారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ కూడా మాల్దీవులకు కౌంటరిచ్చే విధంగా లక్షద్వీప్‌కు సపోర్టు చేశారు. దీంతో, మాల్దీవులకు భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీని ప్రభావం మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావితం చూపించింది. -
విదేశీ వ్యవహారాల్లో భారత్ విశ్వబంధు
సాక్షి, హైదరాబాద్: విదేశీ వ్యవహారాల్లో భారత్‌ను విశ్వబంధుగా తీర్చిదిద్దామని.. ప్రపంచమంతా ఇప్పుడు మన దేశం వైపు చూస్తోందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. మనతో కలసి పనిచేసేందుకు ఎన్నో దేశాలు ఎదురుచూస్తున్నాయని చెప్పారు. మంగళవారమిక్కడ ఓ హోటల్లో ఫోరమ్ ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో విదేశాంగ విధానంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో జైశంకర్ ‘భారత విదేశాంగ విధానం– సందేహం నుంచి విశ్వాసం వైపు పయనం‘అనే అంశంపై మాట్లాడారు. ‘ఒకప్పుడు సరిహద్దు సమస్యలు అంటే ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేవి. వాటికి పరిష్కారం చూపి రక్షణ పరంగా బలమైన దేశంగా నిలిచాం. మోదీ పదేళ్ల పాలనలో భారతే అత్యంత సురక్షిత దేశంగా అంతా భావిస్తున్నారు. చైనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని సర్దార్ వల్లబాయ్ పటేల్ చెప్పినా.. అది మిత్రదేశమేనంటూ నెహ్రూ వినలేదు. నాటి నెహ్రూ తప్పిదంతో కశ్మీర్ సమస్య తలెత్తింది. కొంత భూ భాగం పాక్ అ«దీనంలోకి వెళ్లింది. కశ్మీర్ విషయంలో నాటి నెహ్రూ తప్పిదాలను పదేళ్లలో ప్రధాని మోదీ సరిచేశారు’అని వెల్లడించారు. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ‘ఈ పదేళ్లలో ప్రపంచంలోనే మన దేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. మోదీ గ్యారంటీ దేశంలోనే కాదు.. విదేశీ పాలసీతో ప్రపంచ వ్యాప్తంగా మోదీ గ్యారంటీగా మారింది. మన విదేశాంగ విధానంతో ప్రపంచ దేశాలతో అత్యంత సఖ్యత ఏర్పడింది. 125 దేశాల్లో ఎంబసీలు నెలకొల్పాం’అని జైశంకర్ వివరించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మే 12న ఆదివారం సెలవు తీసుకుని, 13న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. దేశ భద్రత, భవిష్యత్, అభివృద్ధికి ఓటు వేయాలని కోరారు. 500 ఏళ్ల తర్వాత రాముని జన్మభూమిలో సీతారామ కల్యాణం జరిగిందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైనా, భారత్‌ను జైశంకర్ కాపాడారని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ కితాబిచ్చారు. -
ప్రధాని మోదీపై వ్యాఖ్యలు సిగ్గుచేటు.. కానీ..
మాలే: ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇరుదేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలు సిగ్గుచేటు.. జాత్యాహంకారం అని ఆ దేశ మాజీ డిప్యూటీ స్పీకర్ ఇవా అబ్దుల్లా అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల ఆమె భారతదేశానికి క్షమాపణలు చెప్పారు. బైకాట్ మాల్దీవులు నిర్ణయాన్ని వదిలివేయాలని భారతీయులను అభ్యర్థించారు. "మా దేశ మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం అర్థం చేసుకోవచ్చు. భారతీయులు న్యాయబద్ధంగా కోపంగా ఉన్నారు. ఆ వ్యాఖ్యలు దారుణమైనవి. కానీ ఇవి మాల్దీవుల ప్రజల అభిప్రాయాన్ని ఏ విధంగానూ ప్రతిబింబించవు. ఈ వ్యాఖ్యలకు భారతదేశ ప్రజలకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా" అని ఆమె అన్నారు. ప్రధాని మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ కూడా స్పందించారు. విదేశీ నాయకులపై ఈ వ్యాఖ్యలు ఆమోదించలేనివని అన్నారు. మాల్దీవుల ప్రభుత్వ అధికారిక అభిప్రాయాన్ని ప్రతిబింబించవని చెప్పారు. భారత్‌తో మాల్దీవులు నిర్మాణాత్మక, సానుకూల సంభాషణను పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: Lakshadweep Islands History: లక్షద్వీప్‌పై పాక్ కన్ను.. భారత్ ఎత్తుగడతో చిత్తు! -
ఖలిస్తానీల ఆగడాలను అడ్డుకోండి
లండన్: దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ దుర్వినియోగం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని యునైటెడ్ కింగ్డమ్(యూకే) హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ, జాతీయ భద్రతా సలహాదారు టిమ్ బారోకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విజ్ఞప్తి చేశారు. యూకేలో ఖలిస్తాన్ తీవ్రవాదం నానాటికీ పెరిగిపోతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఖలిస్తాన్ సభ్యుల ఆగడాలు, భారత్‌కు వ్యతిరేకంగా వారు సాగిస్తున్న కార్యకలాపాలను జేమ్స్ క్లెవర్లీ, టిమ్ బారో దృష్టికి తీసుకెళ్లారు. జైశంకర్ బుధవారం లండన్‌లో వారిద్దరితో సమావేశమయ్యారు. ఖలిస్తాన్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. అనంతరం యూకే ప్రధానమంత్రి రిషి సునాక్‌తో భేటీ అయ్యారు. ఇండియా–యూకే సంబంధాల్లో పురోగతిపై చర్చించారు. ఇండియా–యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతం జరుగుతున్న సంప్రదింపులతోపాటు రోడ్‌మ్యాప్–2030 అమలు తీరును ఇరువురు నేతలు సమీక్షించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల్లో సానుకూల పురోగతి కనిపిస్తోందని వారు హర్షం వ్యక్తం చేశారు. యూకేలో జైశంకర్ ఐదు రోజుల పర్యటన బుధవారం ముగిసింది. -
ఢిల్లీలో భూటాన్ రాజుకు ఘనస్వాగతం
న్యూఢిల్లీ: భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్చుక్కు ఆదివారం ఢిల్లీలో భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ విమానాశ్రయంలో ఆయనకు ఆహ్వానం పలికారు. అనంతరం ఆయనతో భేటీ అయ్యారు. భారత్‌లో రాజు వాంగ్‌చుక్ ఎనిమిది రోజుల పర్యటన ఈ నెల 3న అస్సాం రాజధాని గువాహటిలో మొదలైంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన సమావేశం కానున్నారు. -
భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్‌లో మరణశిక్ష!
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై భారత నావికాదళానికి చెందిన ఎనిమిది మంది మాజీ అధికారులకు ఖతార్‌లో మరణశిక్ష విధించారు. గురువారం ఖతార్‌లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ వెల్లడించింది. అయితే.. ఈ తీర్పుపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై అప్పీలుకు వెళ్లనున్నట్టు ప్రకటించింది. ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పు వివరణాత్మక కాపీ కోసం ఎదురు చూస్తున్నామనీ, బాధితుల కుటుంబ సభ్యులు, న్యాయవాద బృందంతో చర్చించి అన్ని చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసుకు అధిక ప్రాముఖ్యతనిస్తామని, అన్ని రకాల సాయాన్ని అందిస్తామని వెల్లడించింది. గూఢచర్యం కేసులో ఈ 8 మందిని గతంలో అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. ఇండియన్ నేవీకి చెందిన 8 మందితో పాటు ఖతార్‌కు చెందిన మరో ఇద్దరిపై కూడా గూఢచర్యం ఆరోపణలు ఉన్నాయి. దానికి కావాల్సిన ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు కూడా ఉన్నట్లు ఖతార్ అధికారులు వాదన. వీరి బెయిల్ పిటీషన్లను పలుమార్లు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కోర్టు తాజా తీర్పు సంచలనం రేపుతోంది. నిందితులు ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేట్ సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పని చేస్తున్న క్రమంలో ఇటలీనుంచి అధునాతన జలాంతర్గాముల కొనుగోలుకు ఖతార్ రహస్యకార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఇజ్రాయెల్‌కు అందించా రనేది వారి ఆరోపణ. ఖతార్ అధికారులతో కలిసి ఈ నిఘాకు పాల్పడినట్టు ఆరోపింది. ఇదే కేసులో ఒక ప్రైవేటు డిఫెన్స్ కంపెనీ సీఈవోను, ఖతార్‌కు చెందిన అంతర్జాతీయ సైనిక కార్యకలాపాల అధిపతిని కూడా అరెస్ట్ చేసింది. వీరందరినీ భారతీయ నౌకాదళానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు ఎనిమిది మందిని 2022 ఆగస్టులో ఖతార్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అప్పటినుంచి అంటే ఏడాదికిపైగా కాలంగా వీరంతా జైల్లోనే ఉన్నారు. మరణశిక్షను ఎదుర్కొంటున్న వారిలో కెప్టెన్ నవతేజ్‌సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, అమిత్‌నాగల్, పురేందు తివారి, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, సెయిలర్ రాజేశ్ ఉన్నారు. -
భారత్ వ్యవహారాల్లో కెనడా జోక్యం
న్యూఢిల్లీ: కెనడా దేశస్తులకు వీసా సేవల పునరుద్ధరణ అంశం, ఆ దేశంలోని భారత దౌత్యవేత్తలకు కల్పించే భద్రతపై ఆధారపడి ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కుండబద్దలు కొట్టారు. కెనడాతో దౌత్యపరమైన సమానత్వం వియన్నా సూత్రాల ప్రకారమే భారత్ కోరుతోందని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత్ నుంచి 41 మంది దౌత్యాధికారులను కెనడా ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో భారత్–కెనడా సంబంధాలపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కెనడా భారత్ అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కొనసాగిస్తోందనే ఆందోళనతోనే దౌత్యపరమైన సమానత్వంపై పట్టుబట్టాల్సి వస్తోందని మంత్రి వివరించారు. ‘ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. కాలక్రమంలో మరికొన్ని అంశాలు బయటకు వస్తాయి. భారత్ చర్యలపై చాలా మందికి ఎందుకు అసౌకర్యం కలిగిందనే విషయం ప్రజలు అర్థం చేసుకుంటారు’అంటూ వ్యాఖ్యానించారు. ‘కెనడాతో సంబంధాలు ప్రస్తుతం ఇబ్బందికరంగా మారాయి. ఆ దేశ రాజకీయాల్లోని ఒక వర్గం, దానికి సంబంధించిన విధానాలతో మాకు కొన్ని సమస్యలున్నాయి. కెనడాలోని మన దౌత్యాధికారుల భద్రత ప్రమాదంలో పడింది. అందుకే వీసాల జారీని నిలిపివేశాం. పరిస్థితుల్లో మార్పు కనిపిస్తేనే వీసాల జారీ పునరుద్ధరణ సాధ్యమవుతుంది’ అని జైశంకర్ అన్నారు. దౌత్యాధికారుల భద్రత, రక్షణ అంశం వియన్నా సూత్రాల్లో కీలకమైందని వివరించారు. జూన్‌లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది నిజ్జర్ హత్యకు గురయ్యాడు. ఘటన వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తముందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో ఉద్రిక్తతలు మొదలైన విషయం తెలిసిందే. -
సరిహద్దుల్లో శాంతితోనే చైనాతో సత్సంబంధాలు
న్యూఢిల్లీ: చైనాతో సత్సంబంధాలపై భారత్ మరోసారి స్పష్టతనిచ్చింది. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా ఆ దేశంతో సాధారణ సంబంధాలను సాగించడం వీలుకాదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కుండబద్దలు కొట్టారు. సరిహద్దులకు అత్యంత సమీపంలో చైనా తన బలగాలను మోహరించడమే ప్రధాన సమస్య అని ఆయన గురువారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. చైనాతో సంబంధాలను మెరుగుపర్చుకోవాలని భారత్ కూడా కోరుకుంటోందన్న ఆయన.. రెండు దేశాల సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత నెలకొన్నప్పుడు మాత్రమే అలాంటిది సాధ్యమని పేర్కొన్నారు. చైనా ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని ఆ దేశానికి తెలియజేశామన్నారు. ఘర్షణలు, రెచ్చగొట్టే చర్యలు, తప్పుడు కథనాలు వంటి వాటికి భారత్ భయపడబోదన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ల పట్ల చైనాకు తన నిరసనను భారత్ పలుమార్లు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఇరు దేశాలకు ఉందన్నారు. ‘ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న పరిస్థితులు చైనాకు కూడా ఏమంత మంచివికావు. సరిహద్దుల్లో పరిస్థితుల ప్రభావం ఇప్పటికే రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపింది..ఇంకా చూపుతోంది. సరిహద్దుల్లో ప్రశాంతత లేనప్పుడు సాధారణ సంబంధాలను ఆశించడం సరికాదు’అని జై శంకర్ అన్నారు. 2020 మేలో సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తినప్పుడు చైనా బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను మీడియా ప్రస్తావించగా.. సరిహద్దులకు అత్యంత సమీపంలో రెండు దేశాల బలగాల మోహరింపే అసలైన సమస్య అని మంత్రి బదులిచ్చారు. సమస్య పరిష్కారానికి రెండు పక్షాలు చర్చలు జరుపుతున్నాయని చెప్పారు. ‘సంబంధాలు మాత్రం తెగిపోలేదు. విషయం ఏమిటంటే..రెండు దశాబ్దాల్లోనే అత్యంత భీకరంగా 2020 జూన్‌లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి. గల్వాన్ ఘర్షణల తర్వాత రోజు ఉదయం చైనా విదేశాంగ మంత్రితో ఫోన్లో మాట్లాడాను కూడా. ఆ తర్వాత కూడా దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు సాగిస్తున్నాం. అయితే, చైనా మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఘర్షణలకు దిగుతోంది. అందుకే ఆ దేశంతో సంబంధాలు గాడినపడటం లేదు’అని వివరించారు. ఒక్క చైనాతో తప్ప అన్ని ముఖ్యమైన అన్ని దేశాలు, సమూహాలతో భారత్ సంబంధాలు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. -
యుద్ధం తర్వాత ఇదే తొలిసారి.. భారత్‌లో పర్యటించనున్న ఉక్రెయిన్ మంత్రి!
ఉక్రెయిన్ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా భారత్‌లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితులు, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ సమస్యలపై చర్చించనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఆమెకిదే మొదటి అధికారిక పర్యటన కావడం గమనార్హం. సోమవారం( ఏప్రిల్ 10) భారత్‌లో అడుగుపెట్టనున్న జపరోవా... నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఝపరోవా ఈ పర్యటనలో విదేశాంగ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో పాటు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్రీని కూడా కలవనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్ భారతదేశంతో స్నేహపూర్వక సంబంధాలు, బహుముఖ సహకారాన్ని పంచుకుంటోంది. దౌత్య సంబంధాలను నెలకొల్పిన గత 30 సంవత్సరాలలో, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం వాణిజ్యం, విద్య, సంస్కృతి, రక్షణ రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించింది. పరస్పర అవగాహన, ఆసక్తులను మరింత పెంచుకునేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని‘ తెలిపింది. ఈ పర్యటనలో ఆమె ప్రధాని నరేంద్ర మోదీని కైవ్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించే అవకాశం ఉన్నట్ల ఓ వార్తాపత్రిక పేర్కొంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు ఉక్రెయిన్ నాయకుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో అనేక సార్లు మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య సమస్యని శాంతియుతంగా పరిష్కరించాలని సూచిస్తూ వచ్చారు. -
ఉగ్రవాదంపై ‘క్వాడ్’ కార్యాచరణ బృందం
న్యూఢిల్లీ: ఆధునిక యుగంలో కొత్త రూపు సంతరించుకుంటున్న ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని కఠినంగా అణచివేయడానికి చేపట్టాల్సిన చర్యల కోసం ‘వర్కింగ్ గ్రూప్ ఆఫ్ కౌంటర్–టెర్రరిజం’ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ‘క్వాడ్’ దేశాల విదేశాంగ మంత్రులు ప్రకటించారు. ‘క్వాడ్’ కూటమిలో భాగమైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులు ఎస్.జైశంకర్, ఆంటోనీ బ్లింకెన్, యోషిమస హయషీ, పెన్నీ వాంగ్ శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రపంచమంతటా ఉగ్రవాద భూతం విస్తరిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్ర మూకల ఆటకట్టించడానికి నాలుగు దేశాల కార్యాచరణ బృందం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ వాణిజ్యానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. చట్టబద్ధ పాలన, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, శాంతియుతంగా వివాదాల పరిష్కారానికి మద్దతు కొనసాగుతుందని తేల్చిచెప్పారు. జీ7 కూటమికి జపాన్, జీ20 కూటమికి భారత్ సారథ్యం వహిస్తుండడంతోపాటు ఈ ఏడాది ఆసియా–పసిఫిక్ ఎకనామిక్ కో–ఆపరేషన్(ఏపీఈసీ)కి అమెరికా ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ‘క్వాడ్’ అజెండా అమలు కోసం సన్నిహితంగా కలిసి పనిచేయాలని తీర్మానించుకున్నట్లు వివరించారు. అనంతరం క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు ఢిల్లీలో ‘రైజినా డైలాగ్’లో పాల్గొన్నారు. -
సరిహద్దులో శాంతిపైనే చర్చ
న్యూఢిల్లీ: జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం కోసం ఢిల్లీకి చేరుకున్న చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్‌తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. ఇరుదేశాల సరిహద్దు వెంట బలగాల మొహరింపు, ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి నెలకొల్పడంపైనే చర్చలో ప్రధానంగా దృష్టిపెట్టినట్లు జైశంకర్ గురువారం చెప్పారు. ద్వైపాక్షిక భాగస్వామ్యానికి సవాళ్లుగా నిలుస్తున్న సమస్యలు భేటీలో చర్చకొచ్చినట్లు ఆయన ఆ తర్వాత ట్వీట్‌చేశారు. డిసెంబర్లో చైనా విదేశాంగ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న క్విన్‌తో జైశంకర్ భేటీ కావడం ఇదే తొలిసారి. జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం ఎజెండాపైనా క్విన్‌తో మాట్లాడారు. గతంలో చివరిసారిగా నాటి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో బాలీలో జీ20 సదస్సు సందర్భంగా జైశంకర్ మాట్లాడారు. తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభనను తొలగించాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. -
ఏకాభిప్రాయం సాధిద్దాం
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు జి–20లో సహకారంపై ప్రభావం చూపనీయరాదని, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏకాభిప్రాయానికి రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభంపై దేశాల మధ్య విభేదాలు పొడచూపిన నేపథ్యంలో గురువారం జి–20 దేశాల విదేశాంగ మంత్రులకు ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశం పంపారు. ‘మహాత్మాగాంధీ, గౌతమబుద్ధుడి నేలపై కలుసుకున్న మీరు, భారతదేశ నాగరికత, తాత్వికతల నుంచి ప్రేరణ పొందాలని, మనల్ని విభజించే వాటిపై కాకుండా, మనల్ని ఐక్యంగా ఉంచే అంశాలపై దృష్టి పెట్టాలి’అని సూచించారు. ‘అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాజాతీయ నేరాలు, అవినీతి, ఉగ్రవాదం, ఆహారం, ఇంధన భద్రత’వంటి అంశాల్లో పరిష్కారం కోసం ప్రపంచం జి–20 వైపు చూస్తోంది. ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధించి, ఫలితాలను రాబట్టే సామర్థ్యం జి–20కి ఉంది’అని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సమాజంలో తీవ్ర విభేదాలు తలెత్తిన సమయంలో మనం కలుసుకున్నాం. మన మధ్య జరిగే చర్చలు భౌగోళిక రాజకీయాల ప్రభావం ఉండటం సహజం. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాల ప్రతినిధులుగా ఇక్కడ లేని వారి పట్ల కూడా మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది’అని ప్రధాని పేర్కొన్నారు. వ్యవస్థలు విఫలం ‘గత కొద్ది సంవత్సరాల్లో ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి, ఉగ్రవాదం, యుద్ధాలు..వంటి వాటిని ఎదుర్కొన్న విధానం చూస్తే అంతర్జాతీయ వ్యవస్థలు ఎలా దారుణంగా విఫలమయ్యాయో స్పష్టమవుతోంది. ఈ వైఫల్యం విషాదరకర పరిణామాలను అభివృద్ధి చెందుతున్న దేశాలే ఎక్కువగా ఎదుర్కొన్నాయనే విషయం మనం అంగీకరించాలి. ఏళ్లపాటు సాధించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు తిరోగమించే ప్రమాదం ఉంది’అని ప్రధాని హెచ్చరించారు. అభివృద్ధి చెందుతున్న చాలా దేశాలు తమ ప్రజానీకానికి ఇంధన, ఆహార భద్రతను అందించే క్రమంలో తీవ్రమైన రుణ భారంతో అవస్థలు పడుతున్నాయన్నారు. ధనిక దేశాల కారణంగా వచ్చిన గ్లోబల్ వార్మింగ్తోనూ ఆయా దేశాలు ప్రభావితమయ్యాయని చెప్పారు. తమ నిర్ణయాల వల్ల ఎక్కువగా ప్రభావితమైన వారి మాట వినకుండా ఏ వర్గం కూడా తమదే ప్రపంచ నాయకత్వమంటూ చాటుకోలేదని మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి జై శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమెరికా, రష్యా, చైనా, యూకేల విదేశాంగ మంత్రులు వరుసగా ఆంటోనీ బ్లింకెన్, లావ్రోవ్, క్విన్, క్లెవెర్లీతోపాటు ఈయూ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటలీ ప్రధానితో చర్చలు భారత్, ఇటలీలు రక్షణ సహకారంలో కొత్త అధ్యాయానికి తెరతీస్తూ తమ ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. గురువారం ఢిల్లీకి చేరుకున్న ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీతో వివిధ అంశాలపై ఆయన విస్తృతంగా చర్చలు జరిపారు. అనంతరం మెలోనీతో కలిసి మోదీ మీడియాతో మాట్లాడారు. సంయుక్త భాగస్వామ్యం, సంయుక్త అభివృద్ధి రంగాల్లో భారత్‌లో నూతన అవకాశాలకు దారులు తెరుచుకున్నాయన్నారు. ఈ బంధం ఉభయతారకమని చెప్పారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం అంశాలపై రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. -
పెరిగిన పాస్‌పోర్టు సేవలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పాస్‌పోర్టు సేవలు మెరుగయ్యాయి. గతంలో మాదిరిగా నెలల తరబడి నిరీక్షణకు చెక్ చెబుతూ ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాలు (ఆర్‌పీవోలు) ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాయి. దరఖాస్తుల క్లియరెన్స్‌పై దృష్టిసారించాయి. కరోనా అనంతరం పరిస్థితులు మెరుగుపడుతుండటంతో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోజురోజుకు దరఖాస్తులు పెరుగుతున్నాయి. విశాఖపట్నం, విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. ఉపాధి, ఉన్నతవిద్య, ఇతర అవసరాల కోసం విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. రోజులు, నెలల తరబడి కాళ్లరిగేలా తిరిగినా స్లాట్ దొరికే పరిస్థితి ఉండేది కాదు. కానీ విదేశీ వ్యవహారాలశాఖ తీసుకున్న కీలక నిర్ణయాలతో పాస్‌పోర్టు సేవలు సులువయ్యాయి. దళారుల ప్రమేయం లేకుండానే దరఖాస్తుదారుల చేతికి పాస్‌పోర్టు లభిస్తోంది. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నంలో ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాలున్నాయి. తత్కాల్, సాధారణ అపాయింట్మెంట్లను పెంచి, కాలపరిమితిని తగ్గించడంతోపాటు శనివారం కూడా సేవలు అందిస్తుండటంతో పాస్‌పోర్టుల జారీప్రక్రియ కూడా వేగవంతం అయింది. మరోవైపు పోలీసులు వెరిఫికేషన్ ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తిచేస్తూ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) ఇస్తున్నారు. ఈ సంస్కరణల కారణంగా పాస్‌పోర్టు కేంద్రాల్లో పనితీరు జోరందుకుంది. వారం రోజుల్లో చేతికి.. కరోనా తర్వాత భారత్‌లో విదేశీ ప్రయాణాలు చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పాస్‌పోర్టు దరఖాస్తుల సంఖ్య అదే స్థాయిలో పెరుగుతోంది. పాత నిబంధనల ప్రకారం పాస్‌పోర్టు కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. అన్నిరకాల పత్రాలు సమర్పించాల్సి వచ్చేది. అవన్నీ ఒకేవిధంగా ఉండాలి. వాటిలో ఒక్క చిన్నతప్పు దొర్లినా.. కథ మళ్లీ మొదటికి వచ్చేది. ఒకవేళ అన్నీ ఉన్నా ఇచ్చిన సమాచారాన్ని నిజనిర్ధారణ చేసుకునేందుకు పోలీస్ విచారణ కోసం నెలల సమయం పట్టేది. ప్రజల సౌలభ్యం కోసం విదేశీ వ్యవహారాలశాఖ జారీచేసిన ఆదేశాల మేరకు దరఖాస్తుతోపాటు నాలుగు పత్రాలుంటే చాలు వారం రోజుల్లో పాస్‌పోర్ట్ చేతిలో ఉంటుంది. ఆధార్‌కార్డు (ఇందులో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి), ఎలక్ట్రానిక్ ఫొటో ఐడెంటిటీకార్డు, పాన్‌కార్డు ఉండాలి. వీటితోపాటు స్థానికత, క్రిమినల్ రికార్డు, ఇంటి చిరునామా వివరాలున్న లాయర్ అఫిడవిట్ ఉంటే చాలు. వీటిలో ఉన్న సమాచారం నిజమని నిర్ధారించుకున్న వెంటనే పాస్‌పోర్టు జారీచేసేస్తున్నారు. పోస్టాఫీసుల్లో సేవలు తపాలా కార్యాలయాల్లోను పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకి వచ్చాయి. విజయవాడ ఆర్పీవో పరిధిలో రెండు పాస్‌పోర్టు సేవాకేంద్రాలతో పాటు 13 పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవాకేంద్రాలను (పీవోపీఎస్కేలను) అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖపట్నం ఆర్పీవో పరిధిలో రెండు పాస్‌పోర్టు సేవాకేంద్రాలతో పాటు ఏడు పీవోపీఎస్కేలున్నాయి. వీటన్నింటి ద్వారా రోజూ 3,020 మంది దరఖాస్తుదారులకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఈ పీవోపీఎస్కేల ద్వారానే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) స్లాట్లు కూడా జారీ చేస్తుండటంతో పరిశీలన ప్రక్రియ మరింత సులభతరంగా మారింది. పెరుగుతున్న దరఖాస్తులు కోవిడ్ తర్వాత సేవలు మొదలైనప్పుడు ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాలకు రోజుకు సగటున 250 మంది మాత్రమే దరఖాస్తు దారులు వచ్చేవారు. కరోనా ఆంక్షలు పూర్తిగా తొలగిపోవడం, పరిస్థితులు చక్కబడిన తర్వాత స్లాట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. విజయవాడ కార్యాలయంలో రోజుకు 1,860 వరకు అపాయింట్మెంట్స్ ఉండగా, విశాఖ కార్యాలయంలో 1,160 దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నారు. శనివారం కూడా పాస్‌పోర్టు సేవలందిస్తుండటంతో తత్కాల్, సాధారణ పాస్‌పోర్టుల కోసం దరఖాస్తులు గణనీయంగా పెరుగుతున్నాయి. పారదర్శకంగా పాస్‌పోర్టు సేవలు ఏపీలో రెండు ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాల్లో సేవలు పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. కోవిడ్ తర్వాత దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. వీలైనంత త్వరగా వాటిని క్లియర్ చేస్తున్నాం. పాస్‌పోర్టు కోసం దళారుల్ని ఆశ్రయించవద్దని సూచిస్తున్నాం. పాస్‌పోర్టు సేవల పనిదినాలు కూడా తగ్గాయి. సాధారణ పాస్‌పోర్టు దరఖాస్తులకు 15, సాధారణ తత్కాల్ దరఖాస్తులకు ఎనిమిది రోజులకు పనిదినాలు కుదించాం. దరఖాస్తుదారులకు సమీప తేదీల్లో అపాయింట్మెంట్ ఉండేలా చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రెన్యువల్ కోసం చివరి తేదీ వరకు ఆలస్యం చేయటం సరికాదు. ఆరునెలల ముందుగానే దరఖాస్తు చేసుకుంటే.. పాత పాస్‌పోర్టు గడువు ముగిసేలోగా కొత్త పాస్‌పోర్టు మంజూరవుతుంది. – విశ్వంజలి గైక్వాడ్, విశాఖ ఆర్పీవో -
ఐదేళ్లలో 36 సార్లు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఖర్చు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో విదేశాల్లో అధికారిక పర్యటనలు చేపట్టారు. తాజాగా గడిచిన ఐదేళ్లలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను పార్లమెంట్లో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు వివరాలను బహిర్గతం చేయాలని సీపీఎం ఎంపీ ఎలమారమ్ కరీమ్ అడిగిన ప్రశ్నకు.. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో ప్రధాని విదేశీ పర్యటనల కోసం రూ.239 కోట్లుకుపైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ‘అంతర్జాతీయంగా వివిధ దేశాలతో సన్నిహత సంబంధాలను పెంపొందించుకోవటం, స్థానిక, అంతర్జాతీయ స్థాయిలో భారత కార్యకలాపాలను విస్తరించటమే ప్రధాని విదేశీ పర్యటనల లక్ష్యం. దేశ ప్రయోజనాలతో పాటు విదేశాఘ విధాన లక్ష్యాలను చేరుకునేందుకు ఈ పర్యటనలు ఎంతో ముఖ్యం.’ అని పేర్కొన్నారు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్. మోదీ విదేశీ పర్యటన వివరాలు.. ► ఇటీవల జీ20 సమ్మిట్ కోసం పీఎం మోదీ ఇండోనేసియాకు వెళ్లారు. దాని ఖర్చు రూ.32,09,760గా కేంద్ర మంత్రి వెల్లడించారు. అంతకు ముందు సెప్టెంబర్ 26-28 మధ్య జపాన్ పర్యటనకు వెళ్లగా అప్పడు రూ.23,86,536 అయింది. ► 2022 తొలినాళ్లలో యూరప్ పర్యటనకు రూ.2,15,61,304, 2019 సెప్టెంబర్ 21-28 మధ్య అమెరికా వెళ్లగా రూ.23,27,09,000 అయింది. ► గడిచిన ఐదేళ్లలో 36 విదేశీ పర్యటనలు చేయగా అందులో 31 పర్యటనలకు బడ్జెట్ నుంచి కేంద్రం ఖర్చు చేసింది. ► 2017లో తొలుత ఫిలిప్పైన్స్‌లో పర్యటించారు. 2021లో బంగ్లాదేశ్, అమెరికా, బ్రిటన్, ఇటలీకి వెళ్లారు. మొత్తంగా ఐదేళ్లలో రూ.239 కోట్లు ఖర్చు కాగా.. అందులో అమెరికా వెళ్లినప్పుడు అత్యధికంగా రూ.23 కోట్లు ఖర్చు అయింది. ఇదీ చదవండి: సోనియాకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు -
7న రష్యాకు జై శంకర్
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ ఈ నెల 7, 8వ తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో మాస్కోలో భేటీ అవుతారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం చెప్పారు. ఫిబ్రవరిలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక వీరిద్దరు నాలుగుసార్లు సమావేశమయ్యారు. అమెరికా, పశ్చిమదేశాలు రష్యాపై అన్ని రకాలుగా తీవ్ర ఆంక్షలు విధించాయి. ఆయా దేశాల అభ్యంతరాలను సైతం లెక్క చేయకుండా భారత్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను ఇటీవలి కాలంలో పెంచింది. -
‘డర్టీ బాంబ్’ ఆందోళనల వేళ రష్యాకు జైశంకర్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. అణ్యవాయుధాల వినియోగం ఆందోళనకు నెలకొన్న వేళ రష్యా పర్యటన చేపట్టనున్నారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. నవంబర్ 8న మాస్కో పర్యటనకు వెళ్లనున్నారని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ టూర్లో రష్యా విదేశాంగ మంత్రి సర్గే లావ్రోవ్తో సమావేశం కానున్నారు. జైశంకర్ పర్యటనలో ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు, ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల వంటి అంశాలపై చర్చించనున్నట్లు రష్యా తెలిపింది. డర్టీ బాంబు వినియోగంపై రష్యా, ఉక్రెయిన్లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న క్రమంలో జైశంకర్ మాస్కో పర్యటన చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం రష్యా రక్షణ మంత్రి సర్గీ షోయ్‌గూతో మాట్లాడిన భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. అణ్వాయుధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని సూచించారు. ఇదీ చదవండి: రష్యా ఆరోపణ.. భద్రతా మండలికి డర్టీ బాంబ్ పంచాయితీ! ఖేర్సన్ ఖాళీ!! -
జర భద్రం..! ఆ దేశానికి వెళ్లే వారికి కేంద్రం హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: కెనడాలోని భారతీయులు, ఆ దేశానికి వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు కేంద్రం శుక్రవారం కీలక సూచనలు చేసింది. కెనడాలో విద్వేష దాడులు, భారతీయులను లక్ష్యంగా చేసుకుని నేరాలు, హింస పెరుగుతోందని తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ దేశంలో ఉన్న భారతీయులు, భవిష్యత్తులో అక్కడకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది. భారతీయులు లక్ష్యంగా కెనడాలో జరుగుతున్న దాడులపై ఆ దేశంతో చర్చించినట్లు కేంద్రం పేర్కొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇప్పటివరకు జరిగిన నేరాల్లో ఒక్క బాధ్యుడ్ని కూడా శిక్షించలేదని గుర్తుచేసింది. సిక్కులకు ప్రత్యేక దేశం కోరతూ ఖలిస్థాన్ అనుకూల శక్తులు కెనడాలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం దౌత్యపరంగా వివాదానికి దారీ తీసిన సమయంలోనే కేంద్రం ఈ సూచన చేయడం గమనార్హం. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఈ ప్రజాభిప్రాయ సేకరణను ఉగ్రవాద, రాడికల్ శక్తుల హాస్యాస్పద చర్యగా అభివర్ణించారు. భారత్‌తో మంచి సంబంధాలున్న దేశం దీన్ని అనుమతించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కెనడాలో 16 లక్షల మంది భారత సంతతి వ్యక్తులు ఉన్నారు. ఈ సంఖ్య ఆ దేశ జనాభాలో మూడు శాతం. అయితే ఇటీవల కాలంలో అక్కడ జాతి విద్వేష దాడులు జరుగుతున్నాయి. భారతీయులు లక్ష్యంగా దుండగులు కాల్పులతో రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం కీలక సూచనలు చేసింది. చదవండి: కెనడాలో కాల్పుల కలకలం.. భారతీయ విద్యార్థి మృతి -
Elizabeth-2: అంత్యక్రియలకు వెళ్లి సెల్ఫీకి పోజులా? అదేమైనా బర్త్‌డే పార్టీనా?
లండన్: మెక్సీకో విదేశాంగ మంత్రి మార్సెలో ఇబ్రార్డ్ను నేటిజన్లు ఏకిపారేశారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు వెళ్లిన ఆయన.. భార్యతో కలిసి సెల్ఫీకి పోజులివ్వడంపై మండిపడ్డారు. దేశం తరఫున ప్రతినిధిగా వెళ్లి రాణి అంత్యక్రియల్లో ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తారా? అని విమర్శలు గుప్పించారు. 'మీరు భార్యతో కలిసి సెల్ఫీలు తీసుకోవడానికి అదేం బర్త్‌డే పార్టీ కాదు. మెక్సీకో ప్రతినిధిగా వెళ్లారు. అది గుర్తుపెట్టుకోండి' అని ఓ నెటిజన్ ఇబ్రార్డ్కు చురకలు అంటించాడు. 'ఈయన లండన్ పర్యటనకు వెళ్లిన వింత సందర్శకుడిలా ప్రవర్తించారు. ఇతరులను ఇబ్బందిపెట్టి అందరూ తనవైపు చూడాలనుకుంటున్నారమో?' అని మరో యూజర్ విమర్శించాడు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం జరిగాయి. 2,000 మంది విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో ఇబ్రార్డ్ ఒకరు. అయితే అంత్యక్రియలకు ముందు ఆయన భార్యతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇరకాటంలో పడ్డారు. En el Funeral de Estado de S.M. la Reina Isabel II pic.twitter.com/GUiNPtJrSo — Marcelo Ebrard C. (@m_ebrard) September 19, 2022 చదవండి: ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్ -
‘అత్యంత క్లిష్ట దశలో భారత్-చైనా సంబంధాలు’
బ్యాంకాక్: సరిహద్దుల్లో చైనా చేస్తున్న దుశ్చర్యలను ఖండించారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ప్రస్తుతం భారత్-చైనా సంబంధాలు అత్యంత క్లిష్ట దశలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రెండు పొరుగు దేశాలు కలిసి పని చేస్తేనే ఆసియా అభివృద్ధి పథంలో వెళ్తుందని సూచించారు. బ్యాంకాక్ చులలాంగ్‌కోర్న్ యూనివర్సిటిలో ఇండో-పసిఫిక్‌లో భారత్ విజన్‌పై మాట్లాడిన తర్వాత ఎదురైన ప్రశ్నలకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు జైశంకర్. ‘సరిహద్దులో డ్రాగన్ చేసిన పనికి ప్రస్తుతం భారత్-చైనా సంబంధాలు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. భారత్, చైనా కలసి నడిచేందుకు ఒక్క శ్రీలంక మాత్రమే కాదు, చాలా కారణాలున్నాయని నేను భావిస్తున్నా. అయితే, అది భారత్, చైనా వ్యక్తిగత నిర్ణయం. చైనా వైపు సానుకూల స్పందన ఉంటుందని మాకు నమ్మకం ఉంది. శ్రీలంకకు అన్ని విధాలా భారత్ సాయం చేసింది. ఈ ఏడాదిలోనే 3.8 బిలియన్ డాలర్ల సాయం అందించింది. ఐఎంఎఫ్ వద్ద శ్రీలంకకు అవసరమైన మద్దతును ఇస్తాం.’ అని తెలిపారు విదేశాంగ మంత్రి జైశంకర్. రోహింగ్యాల సమస్యపై అడిగిన ప్రశ్నకు.. బంగ్లాదేశ్‌తో చర్చిస్తున్నామని సమాధానమిచ్చారు మంత్రి జైశంకర్. వారిని తిరిగి స్వదేశానికి పంపించటమే ప్రధాన అంశమని, ఆ విషయంలో బంగ్లాదేశ్‌కు మద్దతు ఇస్తామన్నారు. మరోవైపు.. రష్యా నుంచి చమురు దిగుమతులపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు జైశంకర్. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నది ఒక్క భారత్ మాత్రమే కాదన్నారు. పలు ఐరోపా దేశాలు సైతం చమురు దిగుమతలు చేసుకుంటున్నాయని గుర్తు చేశారు. ఇదీ చదవండి: అమెరికాలో సెటిల్ కావడానికి ప్లాన్ చేసిన గొటబయా రాజపక్స!