
సాక్షి, అమరావతి: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. ఉక్రెయిన్‌లో ఉన్న ఏపీ వాసులను సురక్షితంగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
చదవండి: గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం జగన్
‘‘అక్కడివారు తిరిగి రాష్ట్రానికి రావడానికి సహాయం కోరుతున్నారు. ఏపీ ప్రభుత్వం నిత్యం కేంద్ర విదేశాంగశాఖతో టచ్‌లో ఉంది. వాళ్లని వెనక్కి తీసుకురావడంలో కావాల్సిన సహకారం కోసం ఢిల్లీలోని ఏపీ భవన్, ఇక్కడి సీఎంవో అందుబాటులో ఉంటుంది. ఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులతో ప్రభుత్వం టచ్‌లో ఉంది. కేంద్రం సూచించిన మేరకు వారంతా వెనక్కి రావడానికి మా వంతు సహకారం అందిస్తున్నామని’’ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment