ఢాకా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ)భారత్ అంతర్గత వ్యవహారమని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్ అన్నారు. అయితే, భారత్‌లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల ప్రభావం పొరుగు దేశాలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఏఏ నిరసనలు తగ్గి త్వరలోనే శాంతియుత పరిస్థితి నెలకొంటుందని ఆకాంక్షించారు. అమెరికాలో ఆర్థిక మాంద్యం నెలకొంటే ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తుంది. దీనికి కారణం ఇప్పుడు ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. అలాగే భారత్‌లో ఏ మాత్రం అనిశ్చితి నెలకొన్నా మాకూ ఆందోళనగానే ఉంటుంది’అని అబ్దుల్ మొమెన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment