సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన పాస్‌పోర్టు రద్దు చేయడాన్ని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు విదేశాంగ శాఖ వద్ద సవాల్ చేశారు. విదేశాంగశాఖ ద్వారానే ప్రభాకర్ రావును రప్పించే పనిలో పోలీసులు ఇప్పటికే నిమగ్నమయ్యారు.
ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్‌పోర్టును పోలీసులు రద్దు చేయించారు. ఇంటర్‌పోల్ ద్వారా ప్రభాకర్‌రావుకు రెడ్‌కార్నర్ నోటీసు ఇప్పించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. మరోవైపు రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్‌రావు పిటిషన్ పెట్టుకున్నారు. కాగా,ఇదే కేసులోమరో నిందితుడు శ్రవణ్‌రావు చికాగోలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment