
ట్రంప్ గెలుపు కోసం ఐసిస్ ప్రార్థనలు!
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ను నిర్మూలిస్తానని అమెరికా డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓ పక్క హెచ్చరిస్తుంటే, మరోపక్క ఆయన గెలుపు కోసం ఐసిస్ ప్రార్థనలు చేస్తోంది. ట్రంప్ అధ్యక్షుడైతే ఆయన దూకుడు నిర్ణయాల వల్ల అమెరికా స్వీయవినాశనం తప్పదని ఐసిస్ నమ్ముతున్నట్టు ఫారిన్ ఎఫైర్స్ మేగజైన్ తెలిపింది. ట్రంప్ నిలకడలేని మనిషని, ముస్లిం వ్యతిరేకని ఐసిస్ మద్దతుదారుల ఇంటర్వ్యూలు, సామాజిక మాధ్యమాల్లో చర్చలను పత్రిక ఉటంకించింది. అదే జరిగితే ముస్లిం సమాజం ఏకమవుతుందని, ఇస్లాం మద్దతు-వ్యతిరేక వర్గాలుగా చీలి యుద్ధం జరుగుతుందని జీహాదీలు విశ్వసిస్తున్నారు.
ట్రంప్ తమకు శత్రువని, అయినా ఆయనే అధ్యక్షుడు కావాలని ఐసిస్ కోరుకొంటున్నట్టు పత్రిక వెల్లడించింది. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ముస్లిం వ్యతిరేకిని కాదని ఎప్పటి మాదిరిగానే చెబుతున్నందున ఆమె కంటే ట్రంప్ వస్తేనే లాభమని ఐసిస్ మద్దతు దారులు బలంగా విశ్వసిస్తున్నారని మేగజైన్ పేర్కొంది.