
సాక్షి, అమరావతి : లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని రప్పించేందుకు మరిన్ని విమానసర్వీసులను నడపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గల్ఫ్, సింగపూర్ దేశాల్లో ఎక్కువ మంది తెలుగువారు చిక్కుకుపోయారని వారందరినీ తరలించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖకు సీఎం జగన్ గురువారం లేఖ రాశారు. కాగా విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ ద్వారా ప్రత్యేక విమానాలను నడిపిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment