మోదీ పాలనలో అత్యంత సురక్షిత దేశం
విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడి
‘ఫోరమ్ ఫర్ నేషనలిస్ట్ థింకర్స్’సదస్సులో ప్రసంగం
పాల్గొన్న కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, జేపీ
సాక్షి, హైదరాబాద్: విదేశీ వ్యవహారాల్లో భారత్‌ను విశ్వబంధుగా తీర్చిదిద్దామని.. ప్రపంచమంతా ఇప్పుడు మన దేశం వైపు చూస్తోందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. మనతో కలసి పనిచేసేందుకు ఎన్నో దేశాలు ఎదురుచూస్తున్నాయని చెప్పారు. మంగళవారమిక్కడ ఓ హోటల్లో ఫోరమ్ ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో విదేశాంగ విధానంపై చర్చ జరిగింది.
ఈ కార్యక్రమంలో జైశంకర్ ‘భారత విదేశాంగ విధానం– సందేహం నుంచి విశ్వాసం వైపు పయనం‘అనే అంశంపై మాట్లాడారు. ‘ఒకప్పుడు సరిహద్దు సమస్యలు అంటే ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేవి. వాటికి పరిష్కారం చూపి రక్షణ పరంగా బలమైన దేశంగా నిలిచాం. మోదీ పదేళ్ల పాలనలో భారతే అత్యంత సురక్షిత దేశంగా అంతా భావిస్తున్నారు.
చైనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని సర్దార్ వల్లబాయ్ పటేల్ చెప్పినా.. అది మిత్రదేశమేనంటూ నెహ్రూ వినలేదు. నాటి నెహ్రూ తప్పిదంతో కశ్మీర్ సమస్య తలెత్తింది. కొంత భూ భాగం పాక్ అ«దీనంలోకి వెళ్లింది. కశ్మీర్ విషయంలో నాటి నెహ్రూ తప్పిదాలను పదేళ్లలో ప్రధాని మోదీ సరిచేశారు’అని వెల్లడించారు.
ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
‘ఈ పదేళ్లలో ప్రపంచంలోనే మన దేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. మోదీ గ్యారంటీ దేశంలోనే కాదు.. విదేశీ పాలసీతో ప్రపంచ వ్యాప్తంగా మోదీ గ్యారంటీగా మారింది. మన విదేశాంగ విధానంతో ప్రపంచ దేశాలతో అత్యంత సఖ్యత ఏర్పడింది. 125 దేశాల్లో ఎంబసీలు నెలకొల్పాం’అని జైశంకర్ వివరించారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మే 12న ఆదివారం సెలవు తీసుకుని, 13న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. దేశ భద్రత, భవిష్యత్, అభివృద్ధికి ఓటు వేయాలని కోరారు. 500 ఏళ్ల తర్వాత రాముని జన్మభూమిలో సీతారామ కల్యాణం జరిగిందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైనా, భారత్‌ను జైశంకర్ కాపాడారని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ కితాబిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment