
న్యూఢిల్లీ:బంగ్లాదేశ్‌కు భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ పట్ల వారి వైఖరి స్థిరంగా ఉండడం లేదన్నారు. అక్కడి మధ్యంతర ప్రభుత్వం భారత్‌ను రోజుకో విధంగా అపఖ్యాతి పాలుచేయాలని చూస్తోందని విమర్శించారు. భారత్‌పై రోజుకు ఒక రకంగా మాట్లాడుతూ మంచి సంబంధాలు కావాలంటే కుదరదన్నారు.
ఏది కావాలో బంగ్లాదేశ్ ముందు తేల్చుకోవాలని సూచించారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు, ఆ దేశ అంతర్గత రాజీకీయాలు భారత్‌తో సంబంధాలను ప్రభావితం చేస్తాయన్నారు. భారత్‌తో శత్రుభావం పెంచుకోవాలనుకునే సంకేతాలివ్వడం బంగ్లాదేశ్‌కు మంచిది కావన్నారు. ఇటీవలే జైశంకర్ బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి హుస్సేన్‌తో భేటీ అయ్యారు. బంగ్లాదేశ్ ఉగ్రవాదంపై మెతక వైఖరితో వ్యవహరించకూడదని ఈ భేటీలో జైశంకర్ స్పష్టం చేశారు.
కాగా, బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనలు జరిగిన షేక్‌హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత మద్యంతర ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. మహ్మద్ యూనిస్ ఆధ్వర్యంలో ఏర్పడిన మద్యంతర ప్రభుత్వం భారత్‌పై శత్రుభావంతో వ్యవహరిస్తోంది. అంతేకాకుండా బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులపైనా దాడులు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment