న్యూఢిల్లీ: జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం కోసం ఢిల్లీకి చేరుకున్న చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్‌తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. ఇరుదేశాల సరిహద్దు వెంట బలగాల మొహరింపు, ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి నెలకొల్పడంపైనే చర్చలో ప్రధానంగా దృష్టిపెట్టినట్లు జైశంకర్ గురువారం చెప్పారు.
ద్వైపాక్షిక భాగస్వామ్యానికి సవాళ్లుగా నిలుస్తున్న సమస్యలు భేటీలో చర్చకొచ్చినట్లు ఆయన ఆ తర్వాత ట్వీట్‌చేశారు. డిసెంబర్‌లో చైనా విదేశాంగ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న క్విన్‌తో జైశంకర్ భేటీ కావడం ఇదే తొలిసారి. జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం ఎజెండాపైనా క్విన్‌తో మాట్లాడారు. గతంలో చివరిసారిగా నాటి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో బాలీలో జీ20 సదస్సు సందర్భంగా జైశంకర్ మాట్లాడారు. తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభనను తొలగించాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment