న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. అణ్యవాయుధాల వినియోగం ఆందోళనకు నెలకొన్న వేళ రష్యా పర్యటన చేపట్టనున్నారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. నవంబర్ 8న మాస్కో పర్యటనకు వెళ్లనున్నారని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ టూర్‌లో రష్యా విదేశాంగ మంత్రి సర్గే లావ్రోవ్‌తో సమావేశం కానున్నారు. జైశంకర్ పర్యటనలో ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు, ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల వంటి అంశాలపై చర్చించనున్నట్లు రష్యా తెలిపింది.
డర్టీ బాంబు వినియోగంపై రష్యా, ఉక్రెయిన్‌లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న క్రమంలో జైశంకర్ మాస్కో పర్యటన చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం రష్యా రక్షణ మంత్రి సర్గీ షోయ్‌గూతో మాట్లాడిన భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. అణ్వాయుధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని సూచించారు.
ఇదీ చదవండి: రష్యా ఆరోపణ.. భద్రతా మండలికి డర్టీ బాంబ్ పంచాయితీ! ఖేర్‌సన్ ఖాళీ!!
Comments
Please login to add a commentAdd a comment