విదేశాంగ మంత్రి సరదా సమాధానం
ఓవైపు అంతర్జాతీయ అంశాలపై అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకునే విదేశాంగ మంత్రి ఎస్.జైశకంర్ తనలోని సరదా కోణాన్ని ఆవిష్కరించారు. వాక్చాతుర్యంతో సభికులను కడుపుబ్బా నవ్వించారు. ఒక కార్యక్రమంలో ముఖాముఖి సందర్భంగా వ్యాఖ్యాత ఆయనకు ర్యాపిడ్‌ఫైర్ ప్రశ్న సంధించారు. ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్, భారత్‌ను విమర్శించే హంగరీ అమెరికన్ కుబేరుడు జార్జ్ సోరోస్‌ల్లో మీరు ఎవరితో భోజనం చేస్తారని అడిగారు. జైశంకర్ ఏ మాత్రం తడుముకోకుండా, ‘దుర్గా నవరాత్రులు కదండీ! నేను ఉపవాస దీక్షలో ఉన్నా!’ అంటూ బదులివ్వడంతో అంతా పగలబడి నవ్వారు.
ఐరాస.. ఓ పాత కంపెనీ
ఐక్యరాజ్యసమితి ప్రస్తుత పరిస్థితిపై జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో స్థలాన్ని ఆక్రమించుకుని, మార్కెట్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చలేని పాత కంపెనీలా మారిందంటూ ఆక్షేపించారు. ఆదివారం ఆయన కౌటిల్య ఆర్థిక సదస్సులో మాట్లాడారు. ‘‘ప్రపంచ దేశాలను నేడు రెండు తీవ్ర సంక్షోభాలు తీవ్రంగా ఆందోళన పరుస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఐరాస ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. కీలకాంశాలను పట్టించుకోకుంటే దేశాలు తమ దారి చూసుకుంటాయి. కోవిడ్ కల్లోలంలోనూ ఐరాస చేసింది చాలా తక్కువ’’ అన్నారు.
– న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment