north korea leader
-
కిమ్ కాదు, సోరోస్ కాదు.. ఉపవాసానికే నా ఓటు!
ఓవైపు అంతర్జాతీయ అంశాలపై అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకునే విదేశాంగ మంత్రి ఎస్.జైశకంర్ తనలోని సరదా కోణాన్ని ఆవిష్కరించారు. వాక్చాతుర్యంతో సభికులను కడుపుబ్బా నవ్వించారు. ఒక కార్యక్రమంలో ముఖాముఖి సందర్భంగా వ్యాఖ్యాత ఆయనకు ర్యాపిడ్‌ఫైర్ ప్రశ్న సంధించారు. ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్, భారత్‌ను విమర్శించే హంగరీ అమెరికన్ కుబేరుడు జార్జ్ సోరోస్ల్లో మీరు ఎవరితో భోజనం చేస్తారని అడిగారు. జైశంకర్ ఏ మాత్రం తడుముకోకుండా, ‘దుర్గా నవరాత్రులు కదండీ! నేను ఉపవాస దీక్షలో ఉన్నా!’ అంటూ బదులివ్వడంతో అంతా పగలబడి నవ్వారు. ఐరాస.. ఓ పాత కంపెనీ ఐక్యరాజ్యసమితి ప్రస్తుత పరిస్థితిపై జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో స్థలాన్ని ఆక్రమించుకుని, మార్కెట్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చలేని పాత కంపెనీలా మారిందంటూ ఆక్షేపించారు. ఆదివారం ఆయన కౌటిల్య ఆర్థిక సదస్సులో మాట్లాడారు. ‘‘ప్రపంచ దేశాలను నేడు రెండు తీవ్ర సంక్షోభాలు తీవ్రంగా ఆందోళన పరుస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఐరాస ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. కీలకాంశాలను పట్టించుకోకుంటే దేశాలు తమ దారి చూసుకుంటాయి. కోవిడ్ కల్లోలంలోనూ ఐరాస చేసింది చాలా తక్కువ’’ అన్నారు. – న్యూఢిల్లీ -
కిమ్ కంట కన్నీరు.. ఎందుకంటే..?
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కంటతడి పెట్టుకున్నారు. ఆ దేశంలో జననాల రేటు దారుణంగా క్షీణించడమే ఇందుకు కారణం. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .. దయచేసి ఎక్కువ పిల్లల్ని కనండి అంటూ కన్నీరు కార్చారు. Kim Jong Un CRIES while telling North Korean women to have more babies. The dictator shed tears while speaking at the National Mothers Meeting as he urged women to boost the countries birth rate. pic.twitter.com/J354CyVnln — Oli London (@OliLondonTV) December 5, 2023 ఉత్తర కొరియా 1970-80లలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికితోడు 1990లో తీవ్ర కరువు ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో జనాభా రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం.. ఉత్తరకొరియాలో జననాల సంఖ్య భారీ స్థాయిలో క్షీణించింది. 2023లో జననాల రేటు 1.8 ఉంది. ఉత్తర కొరియా జనాభా 2034 నుండి ఘణనీయంగా తగ్గిపోతుందని హ్యుందాయ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. 2070 నాటికి జనాభా 23.7 మిలియన్లకు తగ్గుతుందని అంచనా వేసింది. పక్కనే ఉన్న దక్షిణ కొరియాలోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు ఉంది. పిల్లల సంరక్షణ, పిల్లల చదువులు, కార్పొరేట్ సంస్కృతి వంటి కారణాలు జననాల రేటుపై ప్రభావం చూపుతున్నాయి. జననాల సంఖ్యను పెంచడానికి కిమ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది పిల్లల కోసం ప్రిఫరెన్షియల్ ఉచిత హౌసింగ్ ఏర్పాట్లు, సబ్సిడీలు, ఉచిత ఆహారం, వైద్యం, గృహోపకరణాలు, విద్యాపరమైన ప్రోత్సాహకాలను అందిస్తోంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలతో ఉన్న కుటుంబాల కోసం ప్రత్యేక రాయితీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇదీ చదవండి: అదే రోజున పార్లమెంట్‌పై దాడి.! భారత్‌కు పన్నూ బెదిరింపులు -
చరిత్ర సృష్టించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
-
కిమ్ జోంగ్‌పై జోకులకు చెల్లుచీటీ
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మీద ఇప్పటివరకు సోషల్ మీడియాలలో చాలా జోకులు పేలుతున్నాయి. కానీ, ఇక మీదట చైనాలో మాత్రం అలాంటి జోకుకు చెల్లుచీటీ పలికారు. 'కిమ్ ఫాటీ ద థర్డ్' లాంటి పదాలను చైనా వెబ్సైట్లు సెన్సార్ చేస్తున్నాయి. ఇలాంటి పదాలు విపరీతంగా వాడుతున్నారంటూ ఉత్తరకొరియా అధికారులు చైనా అధికారులతో జరిగిన సమావేశంలో తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. దాంతో చైనా వెంటనే వాటిని నిరోధించే చర్యలు మొదలుపెట్టింది. 'జిన్ సాన్ పాంగ్' లాంటి పదాలను చైనా సెర్చింజన్ బైదులో వెతికినా, మైక్రో బ్లాగింగ్ సైట్ వైబోలో వెతికినా ఎలాంటి ఫలితాలు చూపించడం లేదు. కిమ్ వంశంలో మూడోతరానికి చెందిన కిమ్ జోంగ్ ఉన్ కాస్తంత లావుగా ఉండటంతో పాటు.. ఆయన నిరంకుశ విధానాల కారణంగా ప్రపంచం నలుమూలలా ఆయన చర్చనీయాంశంగా మారారు. ప్రపంచం మొత్తమ్మీద కమ్యూనిస్టులలో కూడా వారసత్వ పాలన ఉన్న ఏకైక దేశం ఉత్తర కొరియా మాత్రమే. దాంతో చైనా యువతీ యువకులు ఉత్తర కొరియా గురించి, ఆ దేశ పాలకుడి గురించి ఇంటర్నెట్లో విపరీతంగా వెతుకుతుంటారు. వాస్తవానికి అణ్వస్త్రాలను పరీక్షించిన తర్వాత ఉత్తరకొరియాపై చైనా కూడా మండిపడింది. కానీ, కొద్దిపాటి వాణిజ్యంతో పాటు దౌత్య సంబంధాలు కూడా ఉండటంతో మళ్లీ కిమ్ పాలనకు చైనా మద్దతు పలుకుతోంది. దాంతో.. తమ దేశాధ్యక్షుడికి ఇలాంటి నిక్ నేమ్‌లు ఉన్నాయని తెలిస్తే ఏం జరుగుతుందోనన్న భయంతో కొరియా అధికారులు ఆ విషయాన్ని వెంటనే చైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే చైనా కూడా దీనిపై స్పందించింది. ఈ నిక్ నేమ్‌లు ఏవీ వాస్తవాలకు దగ్గరగా ఉండబోవని, అందువల్ల వాటిని నిషేధిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ తెలిపారు. కిమ ఫాటీ ద థర్డ్ అనే పదాన్ని చైనాలో ఇంతకుముందు విస్తృతంగా ఉపయోగించేవారు. ఇక మీదట ఇప్పుడు అలాంటివేవీ కనిపించవన్నమాట.