Funny Moment
-
కిమ్ కాదు, సోరోస్ కాదు.. ఉపవాసానికే నా ఓటు!
ఓవైపు అంతర్జాతీయ అంశాలపై అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకునే విదేశాంగ మంత్రి ఎస్.జైశకంర్ తనలోని సరదా కోణాన్ని ఆవిష్కరించారు. వాక్చాతుర్యంతో సభికులను కడుపుబ్బా నవ్వించారు. ఒక కార్యక్రమంలో ముఖాముఖి సందర్భంగా వ్యాఖ్యాత ఆయనకు ర్యాపిడ్‌ఫైర్ ప్రశ్న సంధించారు. ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్, భారత్‌ను విమర్శించే హంగరీ అమెరికన్ కుబేరుడు జార్జ్ సోరోస్ల్లో మీరు ఎవరితో భోజనం చేస్తారని అడిగారు. జైశంకర్ ఏ మాత్రం తడుముకోకుండా, ‘దుర్గా నవరాత్రులు కదండీ! నేను ఉపవాస దీక్షలో ఉన్నా!’ అంటూ బదులివ్వడంతో అంతా పగలబడి నవ్వారు. ఐరాస.. ఓ పాత కంపెనీ ఐక్యరాజ్యసమితి ప్రస్తుత పరిస్థితిపై జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో స్థలాన్ని ఆక్రమించుకుని, మార్కెట్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చలేని పాత కంపెనీలా మారిందంటూ ఆక్షేపించారు. ఆదివారం ఆయన కౌటిల్య ఆర్థిక సదస్సులో మాట్లాడారు. ‘‘ప్రపంచ దేశాలను నేడు రెండు తీవ్ర సంక్షోభాలు తీవ్రంగా ఆందోళన పరుస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఐరాస ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. కీలకాంశాలను పట్టించుకోకుంటే దేశాలు తమ దారి చూసుకుంటాయి. కోవిడ్ కల్లోలంలోనూ ఐరాస చేసింది చాలా తక్కువ’’ అన్నారు. – న్యూఢిల్లీ -
ఇది ప్రతి ఇంటి కథ.. కడుపుబ్బా నవ్వించిన ‘బాసిర మాతా కీ జై’..
లక్డీకాపూల్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్– 1లోని లామకాన్ హాస్యపు జల్లులతో తడిసి ముద్దయ్యింది. రోడ్డు వేజ్, స్ట్రీట్ ప్లే థియేటర్ ఆధ్వర్యంలో సోమవారం మాజీ ఆర్మీ అధికారి కెప్టెన్ అహ్మద్ రచించిన హాస్యభరిత నాటకం ‘బాసిర మాతా కీ జై’ ఆసాంతం ఆహూతులను కడుపుబ్బా నవ్వించింది. నటీనటులు అద్భుత ప్రదర్శన కనువిందు చేసింది. అలనాటి హిందీ పాటలు మంత్ర ముగ్ధులను చేశాయి. పాటలు వచ్చినప్పుడు ప్రేక్షకులు శృతి కలపడం విశేషం. 45 నిమిషాల పాటు ప్రతి ఇతిహాసంతో సాగిన ఈ నాటకం అద్భుతమైన సందేశాన్ని ఇచ్చింది.ఓ మధ్య తరగతి కుటుంబం. అందులో శర్మా జీ, ఆయన భార్య శ్రీమతి జీ. తమ్ముడు సోను, చెల్లెలు మోను ఉంటారు. సోను, మోనులను పెంచడానికి ఈ జంట తమ జీవితాలను అంకితం చేస్తారు. వీరిద్దరినీ సొంత బిడ్డల్లా చూసుకుంటారు. శ్రీమతి జీకి వంట చేయడం ఇష్టం. ఏదీ వృథా పోనివ్వరు. మిగిలిన ఆహార పదార్థాలతో కొత్త కొత్త వంటకాలు చేస్తుంటారు. ప్రయోగాత్మక వంటకాలను తప్పించుకునేందుకు చూస్తారు. అది కూడా ఆమె మనోభావాలు దెబ్బతినకుండా.. ఈ ప్రయత్నం ఎంతో హాస్యం పండిస్తుంది. ఈ నాటకం ఆహార వృథా సమస్యను స్పృశిస్తుంది. -
సుప్రీంకోర్టులో సింగిల్ మాల్ట్ ఎపిసోడ్
న్యూఢిల్లీ: సంక్లిష్టమైన కేసులపై సీరియస్‌గా విచారణ జరిగే సుప్రీంకోర్టులో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. విస్కీ, దాని రకాలు తదితరాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, సీనియర్ న్యాయవాది దినేశ్ ద్వివేది మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ నవ్వులు పూయించింది. సీజేఐ హాస్య చతురత అందరినీ అలరించింది. పారిశ్రామిక ఆల్కహాల్ ఉత్పత్తి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు సంబంధించిన వివాదంపై సీజేఐ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ముందు జరిగిన విచారణ ఇందుకు వేదికైంది. ఈ కేసులో యూపీ తరఫున వాదిస్తున్న ద్వివేది తెల్ల జుట్టు రంగులమయంగా కని్పంచడంపై జస్టిస్ చంద్రచూడ్ సరదాగా ఆరా తీశారు. హోలీ సంబరాలు కాస్త శ్రుతి మించడమే కారణమంటూ ద్వివేది కూడా అంతే సరదాగా బదులిచ్చారు. ‘‘ఈ విషయంలో దయచేసి నన్ను క్షమించాలి. నా మనవల నిర్వాకం కూడా ఇందుకు కొంతవరకు కారణమే. సంతానం, మనవలు మరీ ఎక్కువగా ఉంటే, అందులోనూ వారంతా మనతో పాటే ఉంటుంటే ఇలాంటి గమ్మత్తైన సమస్యలుంటాయి. తప్పించుకోలేం’’ అన్నారు. సీజేఐ అంతటితో వదల్లేదు. ‘అంతేగానీ, ఆల్కహాల్‌కు ఏ సంబంధమూ లేదంటారు!’ అంటూ చెణుకులు విసిరారు. విస్కీప్రియుడైన ద్వివేది అందుకు చిరునవ్వులు చిందించారు. ‘‘విస్కీ పాత్ర కూడా ఉందని నేను ఒప్పుకుని తీరాలి. హోలీ అంటేనే ఆల్కహాల్ పారీ్టలు. పైగా నేను విస్కీకి వీరాభిమానిని’’ అనడంతో అంతా గొల్లుమన్నారు. సింగిల్ మాల్ట్ విస్కీ విషయంలో ఇంగ్లండ్‌లో తనకెదురైన గమ్మత్తైన అనుభవాన్ని విచారణ సందర్భంగా ద్వివేది ఏకరువు పెట్టారు. ‘‘నేను సింగిల్ మాల్ట్ విస్కీనే ఇష్టపడతా. ఆ విస్కీకి స్వర్గధామంగా చెప్పదగ్గ ఎడింబర్గ్ వెళ్లానోసారి. సింగిల్ మాల్ట్ తెప్పించుకుని ఐస్‌క్యూబ్స్ వేసుకోబోతుంటే వెయిటర్ అడ్డుకున్నాడు. ‘ఇదేం పని! అది సింగిల్ మాల్ట్ విస్కీ. దాన్నలాగే నేరుగా ఆస్వాదించాలి. అంతేతప్ప ఇలా ఐస్క్యూబులూ సోడాలూ కలపొద్దు! పైగా దానికంటూ ప్రత్యేకమైన గ్లాస్ ఉంటుంది. అందులో మాత్రమే తాగాలి’ అంటూ సుదీర్ఘంగా క్లాస్ తీసుకున్నాడు. సింగిల్ మాల్ట్ తాగేందుకు ఇంత తతంగం ఉంటుందని అప్పుడే నాకు తెలిసొచి్చంది’’ అంటూ వాపోయారు. దాంతో న్యాయమూర్తులతో పాటు కోర్టు హాల్లో ఉన్నవాళ్లంతా పడీపడీ నవ్వారు. ధర్మాసనంలోని మిగతా న్యాయమూర్తులు కూడా తమ చెణుకులతో ఈ సరదా సన్నివేశాన్ని మరింత రక్తి కట్టించారు. పారిశ్రామిక ఆల్కహాల్‌తో పాటు విస్కీ, వోడ్కా వంటివి కూడా రాష్ట్రాల నియంత్రణ పరిధిలోకే వస్తాయంటూ ద్వివేది వాదించడంతో ఒక న్యాయమూర్తి కలి్పంచుకున్నారు. ‘‘ఇంతకీ మీరనేదేమిటి? ఆల్కహాల్ మందుబాబులకు కిక్కిచి్చనా, ఇవ్వకపోయినా రాష్ట్రాల ఖజానాకు మాత్రం కిక్కివ్వాల్సిందేనంటారా?’’ అనడంతో నవ్వులు విరిశాయి. ఇంకో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, ‘‘కొన్ని రకాల మద్యం రుచి కాలం గడిచేకొద్దీ పెరుగుతుందని, కొన్ని తేలిక రంగులోనూ మరికొన్ని ముదురు రంగులోనూ ఉంటాయని... ఇలా ఆల్కహాల్‌కు సంబంధించిన చాలా అంశాలను మీరు ఎంతో చక్కగా వివరించారు. సాక్ష్యంగా ఆయా రకాల మద్యం బాటిళ్లను ప్రవేశపెడితే ఎలా ఉంటుందంటారు!’’ అనడంతో కోర్టు హాలంతా మరోసారి నవ్వులతో దద్దరిల్లిపోయింది. -
సభలో సరదాగా..
-
కామెడీ పెట్ ఫోటో అవార్డ్స్ 2021 ఫైనలిస్ట్‌లు
లండన్: ఏడాది కామెడీ పెట్ ఫోటో అవార్డ్స్ 2021కి దాదాపు 40 ఫోటోలు ఫైనల్ రేసులో నిలిచాయి. ఇవన్నీ ఒకదానికొకటి చాలా అత్యంత వినోధభరితంగానూ, ఆశ్చర్యంగానూ ఉన్నాయి. వీటిలో ఫోటోగ్రాఫర్ నైపుణ్యతతోపాటు వాటిలో ఏదో ఆసక్తికర సన్నివేశం దాగి ఉన్నట్లు అనిపిస్తోంది కదూ. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సుమారు 2 వేల ఫోటోల నుంచి దాదాపు 40 చిత్రాలు ఫైనల్‌కి ఎంపికవ్వడం విశేషం. (చదవండి: అమేజింగ్.. ప్రపంచంలోనే అత్యంత పొడగరి!) ఈ కామెడీ పెట్ ఫోటో అవార్డులను పాల్ జాయిన్సన్-హిక్స్, టామ్ సుల్లమ్లు రూపొందించారు అంతేకాదు మనుషులతో జంతువులు ఏవిధంగా అనుబంధం పెంచుకుంటాయో అనే దాని గురించి వివరించడమే కాక, జంతు సంక్షేమంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ అవార్డ్సును రూపోందించారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఈ పోటీని యానిమల్ ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో నిర్వహించడమే కాక జంతు సంరక్ష మద్దతుదారులకు సూమారు 10 వేల పౌండ్లను విరాళంగా ఇస్తోంది ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ఫన్నీ పెట్ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్ వేయండి (చదవండి: ‘అభినందనలు మోదీ జీ" అంటూ వ్యంగ్యాస్త్రాలు) -
తెలంగాణ అసెంబ్లీలో నవ్వులపువ్వులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి మాటలతో మళ్లీ అసెంబ్లీ ఘోల్లున నవ్వింది. ఆయన వ్యాఖ్యలతో స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు విరగబడి నవ్వారు.. నవ్వుల పువ్వులు విరిసాయి. సీఎం కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం మంత్రి మల్లారెడ్డి సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే దేశాన్ని కూడా కేసీఆర్ ప్రగతిపథంలోకి తీసుకెళ్తారని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. కేసీఆర్ ప్రధాని అయితే ప్రజలకు సమస్యలే ఉండవని తెలిపారు. దేశ చరిత్ర మారిపోతుందని తెలిపారు. 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రైవేటీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మికులను రోడ్డున పడేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ చూపు తెలంగాణ వైపు ఉందని పేర్కొన్నారు. మనం ఎదుగుతుంటే ఓర్వలేకుంటా.. అంటూ తడబడి ఇదే నా సవాల్ అని చెప్పడంతో ప్రతిపక్షంతో పాటు అధికార పక్షం సభ్యులు కూడా నవ్వారు. ఒక్కసారి.. ఒక్కసారి అంటూ సీఎం కేసీఆర్‌ను పీఎం కావాలని కోరారు. ఈ శాఖ పద్దు చాలా చిన్నది అని చమత్కరిస్తూనే సభ్యులందరూ సహకరించి ఆమోదం తెలపాలని మంత్రి మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. -
వైరల్: కూతురు స్కూల్ వీడియోలో తండ్రి డ్యాన్స్
స్కూల్ హోంవర్క్ చేస్తున్న ఓ అమ్మాయిని తన తండ్రి, సోదరుడు ఆటపట్టించాలకునే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి తల్లి జెన్నిఫర్ ఈ వీడియోను సోషల్ మీడియాతో పంచుకోగా అది నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. కాగా.. ఆ అమ్మాయి పేరు డెలానీ జోన్స్. ఆమె తను చేస్తున్న హొంవర్క్ను వీడియోను తీసి స్కూల్ టీచర్‌కు పంపడానికి కెమెరాను ఫిక్సింగ్ చేసింది. తర్వాత, ఆమె అలెక్సాను ఒక పాటను ప్లే చేయమని అడిగింది. ఆర్ట్ వర్క్ చేస్తుండగా, చిన్నారి తండ్రి, సోదరుడు వీడియోలో డ్యాన్స్ చేస్తూ పలు రకాలుగా ఆటపట్టించే ప్రయత్నాలు చేశారు. కాగా.. డెలానీ తల్లి జెన్నిఫర్ ఈ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ "నేను డెలానీ చేసిన వీడియో ను పాఠశాల యాప్ (సీసా)ను పంపిస్తున్నాను. డెలానీ తరచుగా ఏదో ఒక వీడియో తీసి ఉపాధ్యాయులకు పంపి.. వాళ్లను పలకరించడం, గుడ్‌నైట్ చెప్పడం, సరదాగా మాట్లాడటం లాంటివి చేస్తుంది. అయితే ఈ వీడియో మాత్రం మరికాస్త ఫన్నీగా ఉండబోతుంది. నేను అయితే చాలా నవ్వుకున్నాను. మీకు కూడా నచ్చుతుందని భావిస్తున్నా" అని క్యాప్షన్ జత చేశారు. అయితే.. తన కుమార్తె టీచర్స్ కోసం వీడియోను చేస్తుందని డెలానీ తండ్రికి తెలియదు. సరదాగా ట్యుటోరియల్ ఏదో వీడియో చేస్తుందనుకొని సరదాగా తనను ఆటపట్టించాలనుకోగా, చివరికి ఆయనే నవ్వులపాలయ్యాడు. కాగా.. నవంబర్ 18న పోస్ట్ చేసిన ఈ వీడియోకు 14 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా 11వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. -
బంతిని ఎదుర్కోబోయి బ్యాట్‌ను విసిరేసాడు...!
-
ఆసీస్-బంగ్లా టెస్టులో ఓ సరదా సన్నివేశం..
ఢాకా: క్రికెట్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే అందరికి గుర్తొచ్చేది స్లెడ్జింగ్ వివాదాలే.. కానీ బంగ్లాదేశ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఆటలో మూడో రోజు భాగంగా బంగ్లా ఆల్‌రౌండర్ నాసిర్ హుస్సెన్ అంపైర్‌ను అనుకరిస్తూ నవ్వులు పూయించాడు. స్పిన్నర్ మెహిదీ హసన్ మీర్జా బౌలింగ్‌లో ఆసీస్ ఆటగాడు ప్యాట్ కమ్మిన్స్ దూరంగా వెళ్లున్న బంతికి అనూహ్యంగా ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. తొలుత అంపైర్ నిగెల్ లియాంగ్ నాటౌట్ అనడంతో బంగ్లా రివ్యూ కోరింది. టీవీ అంపైర్ అవుట్ అని తేల్చడంతో అంపైర్ నిగెల్ వికెట్ ఇవ్వబోతుండగా ఫీల్డర్‌గా ఉన్న నాసిర్ అంపైర్ పక్కన నిల్చోని వేలెత్తుతూ అతన్ని సరదాగా అనుకరించాడు. దీంతో మైదానమంతా నవ్వులు పూసాయి. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఏడు వికెట్లతో నెగ్గడంతో సిరీస్ 1-1 సమమైంది.