ఆసీస్-బంగ్లా టెస్టులో ఓ సరదా సన్నివేశం..
ఆసీస్-బంగ్లా టెస్టులో ఓ సరదా సన్నివేశం..
Published Fri, Sep 8 2017 7:52 AM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM
ఢాకా: క్రికెట్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే అందరికి గుర్తొచ్చేది స్లెడ్జింగ్ వివాదాలే.. కానీ బంగ్లాదేశ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఆటలో మూడో రోజు భాగంగా బంగ్లా ఆల్‌రౌండర్ నాసిర్ హుస్సెన్ అంపైర్‌ను అనుకరిస్తూ నవ్వులు పూయించాడు. స్పిన్నర్ మెహిదీ హసన్ మీర్జా బౌలింగ్‌లో ఆసీస్ ఆటగాడు ప్యాట్ కమ్మిన్స్ దూరంగా వెళ్లున్న బంతికి అనూహ్యంగా ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.
తొలుత అంపైర్ నిగెల్ లియాంగ్ నాటౌట్ అనడంతో బంగ్లా రివ్యూ కోరింది. టీవీ అంపైర్ అవుట్ అని తేల్చడంతో అంపైర్ నిగెల్ వికెట్ ఇవ్వబోతుండగా ఫీల్డర్‌గా ఉన్న నాసిర్ అంపైర్ పక్కన నిల్చోని వేలెత్తుతూ అతన్ని సరదాగా అనుకరించాడు. దీంతో మైదానమంతా నవ్వులు పూసాయి. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఏడు వికెట్లతో నెగ్గడంతో సిరీస్ 1-1 సమమైంది.
Advertisement
Advertisement