హాస్యపు జల్లులతో తడిసి ముద్దయిన ‘లామకాన్’
అలనాటి పాటలతో శృతి కలిపిన ప్రేక్షకులు
లక్డీకాపూల్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్– 1లోని లామకాన్ హాస్యపు జల్లులతో తడిసి ముద్దయ్యింది. రోడ్డు వేజ్, స్ట్రీట్ ప్లే థియేటర్ ఆధ్వర్యంలో సోమవారం మాజీ ఆర్మీ అధికారి కెప్టెన్ అహ్మద్ రచించిన హాస్యభరిత నాటకం ‘బాసిర మాతా కీ జై’ ఆసాంతం ఆహూతులను కడుపుబ్బా నవ్వించింది. నటీనటులు అద్భుత ప్రదర్శన కనువిందు చేసింది. అలనాటి హిందీ పాటలు మంత్ర ముగ్ధులను చేశాయి. పాటలు వచ్చినప్పుడు ప్రేక్షకులు శృతి కలపడం విశేషం. 45 నిమిషాల పాటు ప్రతి ఇతిహాసంతో సాగిన ఈ నాటకం అద్భుతమైన సందేశాన్ని ఇచ్చింది.
ఓ మధ్య తరగతి కుటుంబం. అందులో శర్మా జీ, ఆయన భార్య శ్రీమతి జీ. తమ్ముడు సోను, చెల్లెలు మోను ఉంటారు. సోను, మోనులను పెంచడానికి ఈ జంట తమ జీవితాలను అంకితం చేస్తారు. వీరిద్దరినీ సొంత బిడ్డల్లా చూసుకుంటారు. శ్రీమతి జీకి వంట చేయడం ఇష్టం. ఏదీ వృథా పోనివ్వరు. మిగిలిన ఆహార పదార్థాలతో కొత్త కొత్త వంటకాలు చేస్తుంటారు. ప్రయోగాత్మక వంటకాలను తప్పించుకునేందుకు చూస్తారు. అది కూడా ఆమె మనోభావాలు దెబ్బతినకుండా.. ఈ ప్రయత్నం ఎంతో హాస్యం పండిస్తుంది. ఈ నాటకం ఆహార వృథా సమస్యను స్పృశిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment