Nasir Hossain
-
పాకిస్తాన్ అనుకూల నినాదాలపై రగడ
బెంగళూరు: కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ నసీర్ హుస్సేన్ గెలుపొందిన తర్వాత ఆయన అనుచరులు పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం పట్ల రాష్ట్ర అసెంబ్లీ బుధవారం అట్టుడికిపోయింది. విపక్ష బీజేపీ సభ్యుల ఆందోళనలతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారిని అరెస్టు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ సభ్యులు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. దీంతో అధికార కాంగ్రెస్ సభ్యులు ఎదురుదాడికి దిగారు. అరుపులు కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పాకిస్తాన్ అనుకూల నినాదాల వ్యవహారంపై హోంమంత్రి జి.పరమేశ్వర అసెంబ్లీలో మాట్లాడారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో అసలైందో కాదో తేలుతుందని అన్నారు. ఇది నిజంగా జరిగినట్లు బయటపడితే దోషులను గుర్తించి, చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. మంగళవారం రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. సయ్యద్ నసీర్ హుస్సేన్ గెలిచిన తర్వాత ఆయన అనుచరులు పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేశారంటూ ఓ వీడియో బయటకు వచి్చంది. దాన్ని చానళ్లు ప్రసారం చేశాయి. -
ICC: బంగ్లాదేశ్ క్రికెటర్‌పై రెండేళ్ల నిషేధం.. ఐసీసీ ప్రకటన
Bangladesh all-rounder banned from all cricket: బంగ్లాదేశ్ క్రికెటర్ నాసిర్ హొసేన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి భారీ షాకిచ్చింది. రెండేళ్ల పాటు క్రికెట్ ఆడకుండా అతడిపై నిషేధం విధించింది. ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకుగానూ ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం ప్రకటన విడుదల చేసింది. అబుదాబి టీ10 లీగ్‌లో 2020-21 సీజన్‌కు గానూ పుణె డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన నాసిర్ హుసేన్.. మరో ఏడుగురితో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం సెప్టెంబరు, 2023లో అభియోగాలు నమోదు చేసింది. తప్పు చేశాడని తేలింది ఈ అంశంపై దృష్టి సారించిన ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణ చేపట్టగా నాసిర్ హుసేన్ తప్పు చేసినట్లు తేలింది. ఖరీదైన ఐఫోన్ 12ను బహుమతిగా పొందడం సహా ఫిక్సింగ్‌కు సంబంధించి ఆ ఫోన్లో బుకీలతో మాట్లాడటం.. ఈ విషయాల గురించి ఏ దశలోనూ అవినీతి నిరోధక విభాగంతో సంప్రదించకపోవడం, విచారణలో సహకరించకపోవడం అతడిపై వేటుకు కారణమైంది. మళ్లీ అపుడే రీఎంట్రీ సాధ్యం కాగా తాజా నిషేధం నేపథ్యంలో.. మళ్లీ 2025 ఏప్రిల్ 7 తర్వాతనే నాసిర్ హుసేన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం ఉంటుంది. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ అయిన నాసిర్ హుసేన్ బంగ్లాదేశ్ తరఫున 19 టెస్టులు, 65 వన్డేలు, 31 టీ20లు ఆడాడు. ఆఖరిసారిగా 2018లో బంగ్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు ఈ 32 ఏళ్ల ఆల్‌రౌండర్. చదవండి: అతడు ఎవరినీ కాపీ కొట్టడం లేదు.. హార్దిక్ తిరిగొస్తే తలనొప్పి: టీమిండియా దిగ్గజం -
బంగ్లాదేశ్ క్రికెటర్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు..
దుబాయ్: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై బంగ్లాదేశ్ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ సహా ఎనిమిది మందిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అవినీతి వ్యతిరేక విభాగం అభియోగాలు నమోదు చేసింది. 2020–21 సీజన్ అబుదాబి టి10 లీగ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు వీరిపై ప్రధాన ఆరోపణ. ఈ ఎనిమిది మందీ ‘పుణే డెవిల్స్’ జట్టుతో సంబంధం ఉన్న వారే. టీమ్ సహయజమానులైన కృషన్ కుమార్ చౌదరి, పరాగ్ సంఘ్వీ, అసిస్టెంట్ కోచ్ సన్నీ ధిల్లాన్ భారతీయులు కాగా, మిగతావారు విదేశీ యులు. నాటి లీగ్‌లో డెవిల్స్ ఆరు మ్యాచ్‌లలో ఒక టే గెలిచింది. నాసిర్ హుస్సేన్ బంగ్లా తరఫున 19 టెస్టులు, 65 వన్డేలు, 31 టి20 మ్యాచ్‌లు ఆడాడు. -
ఆసీస్-బంగ్లా టెస్టులో ఓ సరదా సన్నివేశం..
ఢాకా: క్రికెట్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే అందరికి గుర్తొచ్చేది స్లెడ్జింగ్ వివాదాలే.. కానీ బంగ్లాదేశ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఆటలో మూడో రోజు భాగంగా బంగ్లా ఆల్‌రౌండర్ నాసిర్ హుస్సెన్ అంపైర్‌ను అనుకరిస్తూ నవ్వులు పూయించాడు. స్పిన్నర్ మెహిదీ హసన్ మీర్జా బౌలింగ్‌లో ఆసీస్ ఆటగాడు ప్యాట్ కమ్మిన్స్ దూరంగా వెళ్లున్న బంతికి అనూహ్యంగా ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. తొలుత అంపైర్ నిగెల్ లియాంగ్ నాటౌట్ అనడంతో బంగ్లా రివ్యూ కోరింది. టీవీ అంపైర్ అవుట్ అని తేల్చడంతో అంపైర్ నిగెల్ వికెట్ ఇవ్వబోతుండగా ఫీల్డర్‌గా ఉన్న నాసిర్ అంపైర్ పక్కన నిల్చోని వేలెత్తుతూ అతన్ని సరదాగా అనుకరించాడు. దీంతో మైదానమంతా నవ్వులు పూసాయి. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఏడు వికెట్లతో నెగ్గడంతో సిరీస్ 1-1 సమమైంది.