![Bangladesh cricketer Nasir Hossain among 8 charged by ICC under anti corruption code - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/09/20/bangla.jpg.webp?itok=Cw4vZuNR)
దుబాయ్: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై బంగ్లాదేశ్ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ సహా ఎనిమిది మందిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అవినీతి వ్యతిరేక విభాగం అభియోగాలు నమోదు చేసింది. 2020–21 సీజన్ అబుదాబి టి10 లీగ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు వీరిపై ప్రధాన ఆరోపణ. ఈ ఎనిమిది మందీ ‘పుణే డెవిల్స్’ జట్టుతో సంబంధం ఉన్న వారే.
టీమ్ సహయజమానులైన కృషన్ కుమార్ చౌదరి, పరాగ్ సంఘ్వీ, అసిస్టెంట్ కోచ్ సన్నీ ధిల్లాన్ భారతీయులు కాగా, మిగతావారు విదేశీ యులు. నాటి లీగ్‌లో డెవిల్స్ ఆరు మ్యాచ్‌లలో ఒక టే గెలిచింది. నాసిర్ హుస్సేన్ బంగ్లా తరఫున 19 టెస్టులు, 65 వన్డేలు, 31 టి20 మ్యాచ్‌లు ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment