బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ 101 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను వెస్టిండీస్ ఆటగాళ్లు జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్‌లకు జరిమానా పడింది. సీల్స్ వికెట్ తీసిన ఆనందంలో బంగ్లా ఆటగాళ్ల పట్ల దూకుడుగా వ్యవహరించినందుకు గాను అతని మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత విధించారు. అలాగే అతనికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా లభించింది.
ఆల్‌రౌండర్ కెవిన్ సింక్లెయిర్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో లేకపోయినా, ప్రత్యామ్నాయ ఫీల్డర్‌గా వచ్చి స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పడింది. సింక్లెయిర్, సీల్స్ అంపైర్లు ఎన్ని సార్లు హెచ్చరించినా పట్టించుకోకుండా బంగ్లాదేశ్ ఆటగాళ్ల పట్ల దూకుడుగా వ్యవహరించారు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సీల్స్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 15.5 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ తొలి టెస్ట్‌లో నెగ్గగా.. బంగ్లాదేశ్ రెండో టెస్ట్‌లో విజయం సాధించింది. ఫలితంగా 1-1తో సిరీస్ సమంగా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment