Kevin Sinclair
-
విండీస్ ప్లేయర్ క్రేజీ సెలెబ్రేషన్స్
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (121) సెంచరీ.. బెన్ డకెట్ (71), బెన్ స్టోక్స్ (69) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3, జేడన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, కవెమ్ హాడ్జ్ తలో 2, షమార్ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్.. లంచ్ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ 48, మికైల్ లూయిస్ 21, కిర్క్ మెక్కెంజీ 11 పరుగులు చేసి ఔట్ కాగా..అలిక్ అథనాజ్ 5, కవెమ్ హాడ్జ్ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, అట్కిన్సన్ ఓ వికెట్ పడగొట్టారు. వెస్టిండీస్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 327 పరుగులు వెనుకపడి ఉంది.The Crazy Celebration of Kevin Sinclair.🤯- ONE OF THE BEST CELEBRATION IN CRICKET. 🔥 pic.twitter.com/o9OZOwhSWu— Tanuj Singh (@ImTanujSingh) July 19, 2024సింక్లెయిర్ క్రేజీ సెలెబ్రేషన్స్ఈ మ్యాచ్ తొలి రోజు విండీస్ ఆటగాడు కెవిన్ సింక్లెయిర్.. హ్యారీ బ్రూక్ వికెట్ తీసిన ఆనందంలో వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్న వైనం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. సింక్లెయిర్.. బ్రూక్ ఔట్ అవ్వగానే గాల్లోకి పల్టీలు కొడుతూ క్రేజీగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. సింక్లెయిర్‌కు ఇలాంటి సెలబ్రేషన్స్ కొత్తేమీ కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన తన తొలి మ్యాచ్‌లోనూ ఇలాంటి సంబురాలే చేసుకున్నాడు. -
వారెవ్వా.. క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్! వీడియో వైరల్
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ డెబ్యూ ఆటగాడు కెవిన్ సింక్లైర్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను సంచలన క్యాచ్‌తో సింక్లైర్ పెవిలియన్‌కు పంపాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన కీమర్ రోచ్ బౌలింగ్‌లో లబుషేన్ లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో నాలుగో స్లిప్‌లో ఉన్న సింక్లైర్ డైవ్ చేస్తూ కళ్లుచెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన లబుషేన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. చేసేదేమి లేక లబుషేన్(3) నిరాశతో మైదాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 54 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కీమర్ రోచ్ 4 వికెట్లతో ఆసీస్‌ను దెబ్బతీశాడు. ఖ్వాజా(24), ఆలెక్సీ క్యారీ(22) ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తమ మొదట ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. A fourth-slip SCREAMER! Kevin Sinclair is having a debut to remember! #PlayOfTheDay | @nrmainsurance | #AUSvWI pic.twitter.com/jrwK4jmkuD — cricket.com.au (@cricketcomau) January 26, 2024 -
టీమిండియాతో రెండో టెస్టు.. వెస్టిండీస్ జట్టు ప్రకటన! యువ సంచలనం ఎంట్రీ
టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో ఓటమిపాలైన వెస్టిండీస్.. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్దమవుతోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించాలని విండీస్ భావిస్తోంది. భారత్- విండీస్ మధ్య రెండో టెస్టు ట్రినిడాడ్ వేదికగా జూలై 20 నుంచి ప్రారంభం కానుంది. ఇది భారత్-విండీస్ మధ్య వందో టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం. ఈ క్రమంలో రెండో టెస్టు కోసం 13 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రెండో టెస్టుకు ఆల్‌రౌండర్ రైమన్ రీఫర్కు చోటు దక్కలేదు. అతడి స్ధానంలో యువ స్పిన్నర్ కెవిన్ సింక్లెయిర్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఇప్పటికే వన్డే, టీ20ల్లో అద్భుతంగా రాణిస్తుండడంతో టెస్టు జట్టులో కూడా ఈ యువ స్పిన్నర్‌కు చోటిచ్చారు. ఇప్పటివరకు 18 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సింక్లెయిర్..756 పరుగులతో పాటు 54 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 7 వన్డేలు, 6 టీ20లు ఆడిన సింక్లెయిర్ వరుసగా 11, 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌తో సింక్లెయిర్ టెస్టుల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్ కోసం రిజర్వ్ ప్లేయర్స్‌గా టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్ ఎంపికయ్యారు. రెండో టెస్టుకు విండీస్ జట్టు: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, టాగెనరైన్ చందర్‌పాల్, రహ్కీమ్ కార్న్‌వాల్, జాషువా డా సిల్వా (వికెట్ కీపర్), షానన్ గాబ్రియేల్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెక్కెంజీ, కెవిన్ సింక్లెయిర్, కెమర్ రోచ్, జోమెల్ వారికన్ రిజర్వ్: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్ చదవండి: ఐపీఎల్లో సెంచరీ సాధించిన అనామక క్రికెటర్ రిటైర్మెంట్