
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ డెబ్యూ ఆటగాడు కెవిన్ సింక్లైర్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను సంచలన క్యాచ్‌తో సింక్లైర్ పెవిలియన్‌కు పంపాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన కీమర్ రోచ్ బౌలింగ్‌లో లబుషేన్ లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు.
అయితే బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో నాలుగో స్లిప్‌లో ఉన్న సింక్లైర్ డైవ్ చేస్తూ కళ్లుచెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన లబుషేన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. చేసేదేమి లేక లబుషేన్(3) నిరాశతో మైదాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 54 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కీమర్ రోచ్ 4 వికెట్లతో ఆసీస్‌ను దెబ్బతీశాడు. ఖ్వాజా(24), ఆలెక్సీ క్యారీ(22) ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తమ మొదట ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది.
A fourth-slip SCREAMER!
— cricket.com.au (@cricketcomau) January 26, 2024
Kevin Sinclair is having a debut to remember! #PlayOfTheDay | @nrmainsurance | #AUSvWI pic.twitter.com/jrwK4jmkuD