
కాన్‌బెర్రా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ అద్బుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో అకట్టుకున్నాడు. కళ్లు చెదిరే క్యాచ్‌తో వెస్టిండీస్ బ్యాటర్ కార్టీని పెవిలియన్‌కు పంపాడు. విండీస్ ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసిన లాన్స్ మోరిస్ బౌలింగ్‌లో మూడో బంతిని కార్టీ.. బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో బ్యాక్‌వర్డ్ పాయింట్‌కు కొంచెం వైడ్‌గా ఉన్న లబుషేన్.. పక్షిలా గాల్లో ఎగురుతూ మెరుపు వేగంతో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన బ్యాటర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అదే విధంగా ఆసీస్ ఆటగాళ్లందరూ లబుషేన్‌కు వద్దకు వెళ్లి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీంతో క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారులు క్లీన్ స్వీప్ చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు.. ఆసీస్ బౌలర్ల దాటికి కేవలం 86 పరుగులకే కుప్పకూలింది.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో యువ పేసర్ జేవియర్ బార్ట్‌లెట్ 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. లాన్స్ మోరిస్, జంపా రెండు వికెట్లతో రాణించారు. విండీస్ బ్యాటర్లలో ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అనంతరం 87 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 6.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
చదవండి: IND vs ENG: శ్రీకర్ భరత్‌కు బైబై.. యువ వికెట్ కీపర్ అరంగేట్రం పక్కా!?
MARNUS!
— cricket.com.au (@cricketcomau) February 6, 2024
Whatta catch - and first international wicket for Lance Morris too!#PlayOfTheDay | #AUSvWI pic.twitter.com/KwZP43hEFd