టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో ఓటమిపాలైన వెస్టిండీస్.. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్దమవుతోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించాలని విండీస్ భావిస్తోంది. భారత్- విండీస్ మధ్య రెండో టెస్టు ట్రినిడాడ్ వేదికగా జూలై 20 నుంచి ప్రారంభం కానుంది. ఇది భారత్-విండీస్ మధ్య వందో టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం. ఈ క్రమంలో రెండో టెస్టు కోసం 13 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
రెండో టెస్టుకు ఆల్‌రౌండర్ రైమన్ రీఫర్‌కు చోటు దక్కలేదు. అతడి స్ధానంలో యువ స్పిన్నర్ కెవిన్ సింక్లెయిర్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఇప్పటికే వన్డే, టీ20ల్లో అద్భుతంగా రాణిస్తుండడంతో టెస్టు జట్టులో కూడా ఈ యువ స్పిన్నర్‌కు చోటిచ్చారు. ఇప్పటివరకు 18 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సింక్లెయిర్..756 పరుగులతో పాటు 54 వికెట్లు పడగొట్టాడు.
అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 7 వన్డేలు, 6 టీ20లు ఆడిన సింక్లెయిర్ వరుసగా 11, 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌తో సింక్లెయిర్ టెస్టుల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్ కోసం రిజర్వ్ ప్లేయర్స్‌గా టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్ ఎంపికయ్యారు.
రెండో టెస్టుకు విండీస్ జట్టు: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, టాగెనరైన్ చందర్‌పాల్, రహ్కీమ్ కార్న్‌వాల్, జాషువా డా సిల్వా (వికెట్ కీపర్), షానన్ గాబ్రియేల్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెక్‌కెంజీ, కెవిన్ సింక్లెయిర్, కెమర్ రోచ్, జోమెల్ వారికన్
రిజర్వ్: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్
చదవండి: ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన అనామక క్రికెటర్ రిటైర్మెంట్
Comments
Please login to add a commentAdd a comment