
లండన్: ఏడాది కామెడీ పెట్ ఫోటో అవార్డ్స్ 2021కి దాదాపు 40 ఫోటోలు ఫైనల్ రేసులో నిలిచాయి. ఇవన్నీ ఒకదానికొకటి చాలా అత్యంత వినోధభరితంగానూ, ఆశ్చర్యంగానూ ఉన్నాయి. వీటిలో ఫోటోగ్రాఫర్ నైపుణ్యతతోపాటు వాటిలో ఏదో ఆసక్తికర సన్నివేశం దాగి ఉన్నట్లు అనిపిస్తోంది కదూ. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సుమారు 2 వేల ఫోటోల నుంచి దాదాపు 40 చిత్రాలు ఫైనల్‌కి ఎంపికవ్వడం విశేషం.
(చదవండి: అమేజింగ్.. ప్రపంచంలోనే అత్యంత పొడగరి!)
ఈ కామెడీ పెట్ ఫోటో అవార్డులను పాల్ జాయిన్సన్-హిక్స్, టామ్ సుల్లమ్‌లు రూపొందించారు అంతేకాదు మనుషులతో జంతువులు ఏవిధంగా అనుబంధం పెంచుకుంటాయో అనే దాని గురించి వివరించడమే కాక, జంతు సంక్షేమంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ అవార్డ్సును రూపోందించారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఈ పోటీని యానిమల్ ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో నిర్వహించడమే కాక జంతు సంరక్ష మద్దతుదారులకు సూమారు 10 వేల పౌండ్లను విరాళంగా ఇస్తోంది ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ఫన్నీ పెట్ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్ వేయండి
Comments
Please login to add a commentAdd a comment