George Soros
-
కిమ్ కాదు, సోరోస్ కాదు.. ఉపవాసానికే నా ఓటు!
ఓవైపు అంతర్జాతీయ అంశాలపై అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకునే విదేశాంగ మంత్రి ఎస్.జైశకంర్ తనలోని సరదా కోణాన్ని ఆవిష్కరించారు. వాక్చాతుర్యంతో సభికులను కడుపుబ్బా నవ్వించారు. ఒక కార్యక్రమంలో ముఖాముఖి సందర్భంగా వ్యాఖ్యాత ఆయనకు ర్యాపిడ్‌ఫైర్ ప్రశ్న సంధించారు. ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్, భారత్‌ను విమర్శించే హంగరీ అమెరికన్ కుబేరుడు జార్జ్ సోరోస్ల్లో మీరు ఎవరితో భోజనం చేస్తారని అడిగారు. జైశంకర్ ఏ మాత్రం తడుముకోకుండా, ‘దుర్గా నవరాత్రులు కదండీ! నేను ఉపవాస దీక్షలో ఉన్నా!’ అంటూ బదులివ్వడంతో అంతా పగలబడి నవ్వారు. ఐరాస.. ఓ పాత కంపెనీ ఐక్యరాజ్యసమితి ప్రస్తుత పరిస్థితిపై జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో స్థలాన్ని ఆక్రమించుకుని, మార్కెట్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చలేని పాత కంపెనీలా మారిందంటూ ఆక్షేపించారు. ఆదివారం ఆయన కౌటిల్య ఆర్థిక సదస్సులో మాట్లాడారు. ‘‘ప్రపంచ దేశాలను నేడు రెండు తీవ్ర సంక్షోభాలు తీవ్రంగా ఆందోళన పరుస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఐరాస ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. కీలకాంశాలను పట్టించుకోకుంటే దేశాలు తమ దారి చూసుకుంటాయి. కోవిడ్ కల్లోలంలోనూ ఐరాస చేసింది చాలా తక్కువ’’ అన్నారు. – న్యూఢిల్లీ -
కార్పొరేట్లకు ‘హిండెన్‌బర్గ్’ తరహా షాక్!
న్యూఢిల్లీ: కొద్ది నెలల క్రితం పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్‌ను కుదిపేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తరహాలో మరో సంస్థ దేశీ కార్పొరేట్ గ్రూప్‌ల అవకతవకలను బయటపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాక్‌ఫెలర్ బ్రదర్స్ ఫండ్, జార్జ్ సొరోస్ వంటి దిగ్గజాల దన్ను గల ఓసీసీఆర్పీ (ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోరి్టంగ్ ప్రాజెక్టు) సన్నద్ధమవుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. యూరప్, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వ్యాప్తంగా ఉన్న 24 లాభాపేక్షరహిత ఇన్వెస్టిగేటివ్ సంస్థలు కలిసి ఈ పరిశోధనాత్మక రిపోరి్టంగ్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసినట్లు వివరించాయి. అవి త్వరలోనే ఏదైనా నివేదిక లేదా వరుస కథనాలను ప్రచురించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. ముందుగా ఒక నిర్దిష్ట కార్పొరేట్ కంపెనీలో విదేశీ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి సంబంధించిన అవకతవకలను బయటపెట్టవచ్చని సంబంధిత వర్గాలు వివరించాయి. అయితే సదరు కార్పొరేట్ సంస్థ పేరును మాత్రం వెల్లడించలేదు. 2006లో ఏర్పాటైన ఓసీసీఆర్పీ వెబ్సైట్ ప్రకారం సంఘటిత నేరాలను శోధించడం సంస్థ ప్రత్యేకత. ఇన్వెస్టర్ జార్జ్ సొరోస్‌కి చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్, ఫోర్డ్ ఫౌండేషన్, ఓక్ ఫౌండేషన్, రాక్ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ మొదలైనవి దీనికి నిధులు సమకూరుస్తున్నాయి. -
దావోస్‌లో మోదీపై బిలియనీర్ సొరోస్ ఫైర్..
దావోస్ : ప్రధాని నరేంద్ర మోదీపై హంగరీ అమెరికన్ బిలియనీర్, దాతృత్వశీలి జార్జ్ సొరోస్ దావోస్ వేదికగా నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యయుతంగా అధికార పగ్గాలు చేపట్టిన మోదీ భారత్‌లో హిందూ రాజ్యాన్ని స్ధాపిస్తున్నారని, ముస్లిం ప్రాబల్య కశ్మీర్లో నియంత్రణలు విధిస్తూ ముస్లింల పౌరసత్వాన్ని లాగేసుకునేలా వారిని బెదరగొడుతున్నారని ఆరోపించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పైనా సొరోస్ విమర్శలు గుప్పించారు. ప్రపంచమంతా తన చుట్టూ తిరగాలని ట్రంప్ కోరుకుంటారని, అధ్యక్షుడు కావాలనే తన కోరిక నెరవేరడంతో అధ్యక్షుడికి రాజ్యాంగం నిర్ధేశించిన పరిమితులను అతిక్రమించారని వ్యాఖ్యానించారు. ట్రంప్ తన చేష్టలతో అభిశంసనను ఎదుర్కొన్నారని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం కోసం దేశ ప్రయోజనాలను విస్మరించేందుకూ ట్రంప్ వెనుకాడరని, తిరిగి ఎన్నికయ్యేందుకు ఏదైనా చేస్తారని దుయ్యబట్టారు. చదవండి : తదుపరి ప్రధానిగా మళ్లీ మోదీకే మొగ్గు.. -
గూగుల్, ఎఫ్బీలపై సంచలన ఆరోపణలు
దావోస్ : గూగుల్, ఫేస్‌బుక్‌లపై బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సొరోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి వినూత్న ఒరవడులకు అవరోధమని, సోషల్ మీడియా కంపెనీలు ప్రజాస్వామ్యానికి చేటని ఆందోళన వ్యక్తం చేశారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఓ సదస్సును ఉద్దేశించి సొరోస్ మాట్లాడుతూ అమెరికన్ ఐటీ దిగ్గజాలకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ప్రజల ఆలోచనాసరళి, ప్రవర్తనలపై వారికి తెలియకుండానే సోషల్ మీడియా ప్రతికూల ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల రాజకీయాలపై, ప్రజాస్వామ్య పనితీరుపై ఇవి దుష్ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా జోక్యంతో ఫేస్బుక్, ట్విట్టర్లు పోషించిన పాత్రపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో సొరోస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సోషల్ మీడియా కంపెనీలు అవి అందించే సేవలకు యూజర్లను ఉద్దేశపూర్వకంగా కట్టిపడేస్తున్నాయని అన్నారు. ఈ పరిణామాలు యుక్తవయసు వారికి తీవ్ర హానికరమని ఆయన హెచ్చరించారు. -
ట్రంప్ వైఫ్యలం తప్పదు..మార్కెట్ల కల కల్లే..
ఒక పక్క అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతోంటే.. మరోపక్క కోటీశ్వరుడు, పెట్టుబడిదారుడు జార్జ్ సోరోస్ మాత్రం ట్రంప్ విఫలం కావడం తధ్యమని జోస్యం చెప్పారు. అంతేకాదు మార్కెట్ల కల ఇక ముగిసినట్టే నని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ చేపటనున్న విధానాలతో అంతర్జాతీయ మార్కెట్లలో మరింత అనిశ్చితి కొనసాగనుందని బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ అభిప్రాయపడ్డారు. స్విట్జర్లాండ్ లోని దావూస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన వార్షిక సమావేశంలో బ్లూమ్ బర్గ్ తో మాట్లాడిన సోరస్ గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మార్కెట్ల అనిశ్చితి పీక్ స్టేజ్ లోఉందన్నారు. ఇకముందు మార్కెట్టు మరింత తడబాటుకు గురవుతాయని, ఇంతకంటే బావుంటాయని తాను భావించడంలేదన్నారు. మొత్తంమీద ట్రంప్ విఫలం కానున్నాడని తాను వ్యక్తిగతంగా విశ్వశిస్తున్నానన్నారు. ముందు ముందు ఎలా వ్యవహరించనున్నాడనే దాన్ని అంచనావేయడం కష్టమని పేర్కొన్నారు. అమెరికా వాస్తవ ఆర్థిక వ్యవస్థ మరింత ఆర్థిక మాంద్యంలోకి కూరుకు పోనున్నదని సొరోస్ హెచ్చరించారు. ఇతర దేశాల ప్రజలు.. చైనీయులు, చమురు ఉత్పత్తి దేశాల ప్రజలు డాలర్ నిల్వలను పోగేసుకున్నారని, ఈ సంక్షోభ కాలంలో వీటిని వాస్తవ సంపదలుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని సోరోస్ చెప్పారు. కాబట్టే ఈ దేశాలు ఇప్పుడు సంపన్నదేశాలుగా మారుతుండడతో, అమెరికన్లకు మరింత రుణాభారం మీదపడుతోందని పేర్కొన్నారు. ఇంధనం, భూతాపం, ఇంధన పరాధీనతకు సంబంధించిన సమస్యలపై తలపడేందుకు భారీస్థాయిలో పెట్టుబడులు అవసరమని సోరోస్ పేర్కొన్నారు. ఆర్థికవృద్ధిలో చైనా దూసుకుపోతుందన్నారు. నవంబర్ 8 ట్రంప్ గెలుపు తర్వాత అమెరికా మార్కెట్లు భారీగా లాభపడిన సంగతి విదితమే. అలాగే బ్రిటన్ ప్రధాని థెరిసా మే పదవిలో కొనసాగుతారని వ్యాఖ్యానించారు. ప్రధాని మే మంగళవారం బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమణ చర్చలు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో, బ్రెగ్జిట్ పరిణామాలు రెండు వైపులా ప్రభావితం చేయనున్నాని చెప్పారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డెమొక్రటిక్ పార్టీ హిల్లరీ క్లింటన్ కి జార్జ్ సోరోస్ సుమారు13 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ.86 కోట్లు) విరాళం ప్రకటించారు. వైట్‌హౌస్‌లోకి రిపబ్లికన్నేత ఎవరూ రావడానికి వీల్లదేని ఆయన తెగేసి చెప్పారు. వలసవాదానికి, ఇస్లాంకు వ్యతిరేకంగా తీవ్రమైన విధానాన్ని వారు ఎంచుకున్నారంటూ రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌ల ప్రచార తీరుతెన్నులపై అప్పట్లో మండిపడిన సంగతి తెలిసిందే. -
పౌండు చరిత్రాత్మక పతనం..
బిలియనీర్ ఇన్వెస్టరు జార్జ్ సరోస్ అంచనాలకు అనుగుణంగానే అమెరికా డాలరుతో బ్రిటన్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ 11 శాతం పతనమయ్యింది. క్రితం రోజు 1.5 డాలర్లకు ఒక పౌండు లభించేది. తాజాగా 1.32 డాలర్లకే వచ్చేంతగా విలువ తగ్గిపోయింది. ఈ మారకపు విలువ 1970వ దశకంలో పౌండు ట్రేడింగ్ కరెన్సీగా మారిన తర్వాత ఇంతలా పతనం కావడం ఇదే ప్రధమం. పైగా గురువారం ప్రపంచంలో అధికంగా నష్టపోయిన కరెన్సీ ఇదే. యూరోతో పోలిస్తే పౌండు 6 శాతం నష్టపోయింది. పౌండు బేర్‌గా ప్రసిద్ధిగాంచిన జార్జ్ సరోస్ పాతికేళ్ల క్రితం 1992లో ఈ పతనాన్ని అంచనావేసి ఒక బిలియన్ డాలర్ల లాభాన్ని సంపాదించారు. బ్రెగ్జిట్ జరిగితే పౌండ్ భారీగా పతనమవుతుందంటూ రెండు రోజుల క్రితమే సరోస్ వెల్లడించిన అభిప్రాయాన్ని పలు ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు తోసిపుచ్చాయి. అయితే చివరకు ఆయన అంచనాలే నిజమై, 1992లో జరిగిన పతనంకంటే ఈ దఫా మరింత ఎక్కువగా పౌండు పడిపోయింది. సరోస్ మరో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు. బ్రిటన్ వైదొలిగితే యూరో విలువతో కూడా పౌండు పతనమై, కొద్ది రోజుల్లో యూరోతో సమానమైపోతుందని, ఇది బ్రిటన్వాసులు ఇష్టపడని పరిణామమని అన్నారు.