దావోస్ : ప్రధాని నరేంద్ర మోదీపై హంగరీ అమెరికన్ బిలియనీర్, దాతృత్వశీలి జార్జ్ సొరోస్ దావోస్ వేదికగా నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యయుతంగా అధికార పగ్గాలు చేపట్టిన మోదీ భారత్‌లో హిందూ రాజ్యాన్ని స్ధాపిస్తున్నారని, ముస్లిం ప్రాబల్య కశ్మీర్‌లో నియంత్రణలు విధిస్తూ ముస్లింల పౌరసత్వాన్ని లాగేసుకునేలా వారిని బెదరగొడుతున్నారని ఆరోపించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పైనా సొరోస్ విమర్శలు గుప్పించారు.
ప్రపంచమంతా తన చుట్టూ తిరగాలని ట్రంప్ కోరుకుంటారని, అధ్యక్షుడు కావాలనే తన కోరిక నెరవేరడంతో అధ్యక్షుడికి రాజ్యాంగం నిర్ధేశించిన పరిమితులను అతిక్రమించారని వ్యాఖ్యానించారు. ట్రంప్ తన చేష్టలతో అభిశంసనను ఎదుర్కొన్నారని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం కోసం దేశ ప్రయోజనాలను విస్మరించేందుకూ ట్రంప్ వెనుకాడరని, తిరిగి ఎన్నికయ్యేందుకు ఏదైనా చేస్తారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment