లండన్: మెక్సీకో విదేశాంగ మంత్రి మార్సెలో ఇబ్రార్డ్‌ను నేటిజన్లు ఏకిపారేశారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు వెళ్లిన ఆయన.. భార్యతో కలిసి సెల్ఫీకి పోజులివ్వడంపై మండిపడ్డారు. దేశం తరఫున ప్రతినిధిగా వెళ్లి రాణి అంత్యక్రియల్లో ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తారా? అని విమర్శలు గుప్పించారు.
'మీరు భార్యతో కలిసి సెల్ఫీలు తీసుకోవడానికి అదేం బర్త్‌డే పార్టీ కాదు. మెక్సీకో ప్రతినిధిగా వెళ్లారు. అది గుర్తుపెట్టుకోండి' అని ఓ నెటిజన్ ఇబ్రార్డ్‌కు చురకలు అంటించాడు. 'ఈయన లండన్ పర్యటనకు వెళ్లిన వింత సందర్శకుడిలా ప్రవర్తించారు. ఇతరులను ఇబ్బందిపెట్టి అందరూ తనవైపు చూడాలనుకుంటున్నారమో?' అని మరో యూజర్ విమర్శించాడు.
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం జరిగాయి. 2,000 మంది విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో ఇబ్రార్డ్ ఒకరు. అయితే అంత్యక్రియలకు ముందు ఆయన భార్యతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇరకాటంలో పడ్డారు.
En el Funeral de Estado de S.M. la Reina Isabel II pic.twitter.com/GUiNPtJrSo
— Marcelo Ebrard C. (@m_ebrard) September 19, 2022
చదవండి: ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్
Comments
Please login to add a commentAdd a comment