Queen Elizabeth 2
-
బ్రిటిష్ రాణి కారు కొన్న ఇండియన్ బిజినెస్ టైకూన్.. ఎవరీ యోహాన్?
బ్రిటిష్ రాచరిక చరిత్రలో ఒక ప్రత్యేకమైన భాగాన్ని భారతీయ బిజినెస్ టైకూన్ సొంతం చేసుకున్నారు. బ్రిటిష్ రాణి దివంగత క్వీన్ ఎలిజబెత్ 2 ఉపయోగించిన రేంజ్ రోవర్ కారును పూనావాలా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ యోహాన్ పూనావాలా కొనుగోలు చేశారు. దివంగత రాణి ఉపయోగించిన అదే రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఈ కారు ఇప్పటికీ కలిగి ఉండటం విశేషం. విశేషమైన చరిత్రను ఉన్న కారును సొంతం చేసుకున్నందుకు పూనావాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అసలు రిజిస్ట్రేషన్ నంబర్‌ను అలాగే ఉంచడం అదనపు బోనస్ అని ఆయన పేర్కొన్నారు. "ఈ అద్భుతమైన ఆటోమోటివ్ చరిత్రను సంపాదించినందుకు నేను సంతోషిస్తున్నాను" అని పూనావాలా చెప్పినట్లు ఎకనామిక్స్ టైమ్స్ పేర్కొంది. “సాధారణంగా రాజ కుటుంబం ఆధీనం నుంచి వెళ్లిపోయిన తర్వాత కారు నంబర్ ప్లేట్ మారుతుంది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే.. దివంగత క్వీన్ ఉపయోగించిన అదే రిజిస్ట్రేషన్ నంబర్ OU16 XVHని ఇప్పటికీ కలిగి ఉంది. ఇది అదనపు బోనస్‌గా మారింది” అని ఆయన చెప్పారు. ఐవరీ అప్హోల్స్టరీతో లోయిర్ బ్లూ పెయింట్ చేసిన 2016 రేంజ్ రోవర్ SDV8 ఆటోబయోగ్రఫీ LWB ఎడిషన్ కారు సుమారు 18,000 మైళ్లు తిరిగింది. బ్రామ్లీ ఆక్షనీర్స్ వెబ్సైట్లో ఈ కారు రిజర్వ్ ధర 224,850 పౌండ్లు (రూ. 2.25 కోట్లకు పైగా) ఉంది. అయితే ఈ వేలం ప్రక్రియ లేకుండానే పూనావాలా కారును ప్రైవేట్‌గా కొనుగోలు చేశారు. కారు ప్రత్యేకతలివే.. ఈ రేంజ్ రోవర్ కారును ప్రత్యేకంగా రాణి ఉపయోగించేందుకు రూపొందించారు. రహస్య లైటింగ్, పోలీసు ఎమర్జెన్సీ లైటింగ్‌తో సహా ప్రత్యేకమైన మార్పులు ఇందులో ఉన్నాయి. రాణి కోసం చేసిన ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. సులువుగా కారు ఎక్కేందుకు, దిగేందుకు వెనుక భాగంలో గ్రాబ్ హ్యాండిల్స్ జోడించడం. కారులో చేసిన అన్ని మార్పులను అలాగే ఉంచాలని భావిస్తున్నట్లు పూనావాలా పేర్కొన్నారు. -
ప్రపంచంలోనే ఖరీదైన కాయిన్.. కిలోలకొద్దీ బంగారం, వజ్రాలు.. చూస్తే కళ్లు చెదరాల్సిందే!
World's Most Expensive Coin: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాయిన్‌ను బ్రిటన్‌లో ఆవిష్కరించారు. దివంగత క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth 2) గౌరవార్థం ఈ నాణేన్ని రూపొందించారు. ఇది అన్ని కాలాలలో అత్యంత విలువైనదని భావిస్తున్నారు. దాదాపు 4 కిలోల బంగారం (Gold), 6,400 కంటే ఎక్కువ వజ్రాలతో (Diamonds) తయారు చేసిన ఈ నాణెం విలువ సుమారు 23 మిలియన్ డాలర్లు (రూ.192 కోట్లు) అని సీఎన్ఎన్ వార్తా సంస్థ నివేదించింది. (Birmingham bankrupt: బ్రిటన్‌లో సంచలనం.. దివాలా తీసిన ప్రముఖ నగరం!) లగ్జరీ లైఫ్ స్టైల్ బ్రాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసిన ఈ నాణేన్ని క్వీన్ ఎలిజబెత్-2 మొదటి వర్ధంతి సందర్భంగా విడుదల చేశారు. కామన్వెల్త్ దేశాల్లోని హస్తకళాకారులు 16 నెలలపాటు శ్రమించి దీన్ని తయారు చేశారు. దీన్ని మరింత ఘనంగా రూపొంచాలనుకున్నా వజ్రాల కొరత కారణంగా సాధ్యం కాలేదు. స్కై న్యూస్ ప్రకారం.. 9.6 అంగుళాల కంటే ఎక్కువ వ్యాసం కలిగిన ఈ నాణెం బాస్కెట్‌బాల్ పరిమాణంలో ఉంది. దీనిపై ప్రఖ్యాత పోర్ట్రెయిట్ కళాకారులు మేరీ గిల్లిక్, ఆర్నాల్డ్ మచిన్, రాఫెల్ మక్లౌఫ్, ఇయాన్ ర్యాంక్-బ్రాడ్లీలు దివంగత చక్రవర్తి చిత్రాలను తీర్చిదిద్దారు. దీని మధ్య భాగంలో అమర్చిన నాణెం 2 పౌండ్లపైగా బరువుంటుంది. చుట్టూ ఉన్న చిన్న నాణేలు ఒక్కొక్కటి ఒక ఔన్స్ బరువు కలిగి ఉంటాయి. నాణెం అంచుల్లో క్వీన్ సూక్తులను ముద్రించారు. 2021 జూన్ లో సోథెబైస్ న్యూయార్క్‌లో 18.9 మిలియన్ డాలర్లు పలికిన అరుదైన 1933 యూఎస్ "డబుల్ ఈగిల్" నాణెమే ఇప్పటి వరకు వేలంలో విక్రయించిన అత్యంత ఖరీదైనది. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్ట్‌లో నమోదైంది. Introducing The Crown – a once in a lifetime tribute to The Queen An extraordinary tribute coin created to commemorate the enduring legacy of Her Majesty Queen Elizabeth II. We invite you to view the piece and the making of in more detail on our website. pic.twitter.com/SiZXjfvjPB — The East India Company (@TheEastIndia) September 7, 2023 -
ఎలిజబెత్ అంత్యక్రియలకు రూ.1,655 కోట్లు
లండన్: క్వీన్ ఎలిజబెత్–2 అంత్యక్రియలకు 162 మిలియన్ పౌండ్లు (రూ.1,655 కోట్లు) ఖర్చయినట్లు బ్రిటన్ కోశాగార విభాగం (ట్రెజరీ) వెల్లడించింది. రాణి అంత్యక్రియల ఖర్చులను ట్రెజరీ చీఫ్ సెక్రెటరీ జాన్ గ్లెన్ పార్లమెంట్‌కు సమరి్పంచారు. 70 ఏళ్ల పాటు బ్రిటన్ మహారాణి హోదాలో కొనసాగిన ఎలిజబెత్–2 గత ఏడాది సెపె్టంబర్ 8న మరణించిన సంగతి తెలిసిందే. గత సెపె్టంబర్ 19న జరిగిన ఆమె అంత్యక్రియలకు వివిధ దేశాల నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు -
చార్లెస్–3 పట్టాభిషేకంలో... విశేషాలెన్నో!
బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్–3కి మే 6న పట్టాభిషేకం జరగనుంది. ఆయనకు 74 ఏళ్లు. ఇప్పటిదాకా బ్రిటన్ ఏలికలుగా పట్టాభిషేకం చేసుకున్న వారిలో అత్యంత పెద్ద వయస్కుడు చార్లెసే! ఆయన వయసు మొదలుకుని కార్యక్రమపు ఖర్చు, అన్ని మతాల పెద్దలను భాగస్వాములను చేయడం దాకా ఎన్నో విశేషాలకు పట్టాభిషేక కార్యక్రమం వేదిక కానుంది... ► చారిత్రక వెస్ట్ మినిస్టర్స్ అబేలో పట్టాభిషేకం జరుగుతుంది. గత వెయ్యేళ్లుగా ఈ వేడుక ఇక్కడే జరుగుతూ వస్తోంది. ► ఉదయం 11కు కార్యక్రమం మొదలవుతుంది. ► చార్లెస్–3 సతీసమేతంగా బకింగ్‌హాం ప్యాలెస్ నుంచి చారిత్రక డైమండ్ జూబ్లీ రథంలో అట్టహాసంగా బయల్దేరతారు. రాణి ఎలిజబెత్–2 పాలనకు 60 ఏళ్లయిన సందర్భంగా 2012లో ఈ రథాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ఐదు దశల్లో... ► కార్యక్రమం ఐదు దశల్లో జరుగుతుంది. తొలుత ఆర్చిబిషప్ ఆఫ్ కాంటర్బరీ ముందుగా రాజును ప్రజలకు పరిచయం చేస్తారు. అనంతరం ‘గాడ్ సేవ్ కింగ్ చార్లెస్’ అంటూ ఆహూతుల ద్వారా గీతాలాపన జరుగుతుంది. ► మత గ్రంథంపై చార్లెస్ ప్రమాణం చేస్తారు. అనంతరం ఆయనను రాజుగా ప్రకటిస్తారు. ► తర్వాత కింగ్ ఎడ్వర్డ్ కుర్చీపై చార్లెస్ ఆసీనులవుతారు. పట్టాభిషేకానికి ఉపయోగించే ఈ కుర్చీ ఏకంగా 700 ఏళ్ల నాటిది. కింగ్ ఎడ్వర్డ్ నుంచి ఇప్పటిదాకా 26 మంది బ్రిటన్ ఏలికలు దీనిపై కూర్చునే పట్టం కట్టుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఈ కుర్చీని పూర్తిస్థాయిలో రిపేరు చేశారు. ► తర్వాత అనూచానంగా వస్తున్న రాజ లాంఛనాలను ఒక్కొక్కటిగా చార్లెస్ అందుకుంటారు. ► వీటిలో కొన్నింటిని హిందూ, సిక్కు, ఇస్లాం తదితర మత పెద్దలు ఆయనకు అందజేయనుండటం విశేషం. హిందూ మతం తరఫున లార్డ్ నరేంద్ర బాహుబలి పటేల్ (84) చార్లెస్‌కు రాజముద్రిక అందజేస్తారు. ► తర్వాత కీలక ఘట్టం వస్తుంది. సంప్రదాయం ప్రకారం ప్రత్యేక వస్త్రపు ఆచ్ఛాదనలో ఆర్చిబిషప్ చేతుల మీదుగా చార్లెస్‌కు కిరీట ధారణ జరుగుతుంది. కిరీటం పరిమాణాన్ని చార్లెస్‌కు సరిపోయేలా ఇప్పటికే సరిచేశారు. ► ఈ ప్రత్యేక వస్త్రంపై భారత్‌తో పాటు కామన్వెల్త్ దేశాలన్నింటి పేర్లుంటాయని బకింగ్‌హాం ప్యాలెస్ ప్రకటించింది. ► తర్వాత యువరాజు విలియం రాజు ముందు మోకరిల్లుతారు. విధేయత ప్రకటిస్తూ ఆయన ముంజేతిని ముద్దాడతారు. ► తర్వాత సాదాసీదా కార్యక్రమంలో చార్లెస్ భార్య కెమిల్లాను రాణిగా ప్రకటించే తంతు ముగుస్తుంది. ► భారత మూలాలున్న హిందువు అయిన ప్రధాని రిషి సునాక్ ఈ సందర్భంగా పవిత్ర బైబిల్ పంక్తులు పఠించనుండటం విశేషం! ► చివరగా హిందూ, సిక్కు, ముస్లిం, బౌద్ధ, యూదు మత పెద్దల నుంచి చార్లెస్ శుభాకాంక్షలు అందుకుంటారు. రూ.1,000 కోట్ల ఖర్చు ► పట్టాభిషేక మహోత్సవానికి దాదాపు రూ.1,000 కోట్ల దాకా వెచ్చిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం ఈ ఖర్చంతటినీ బ్రిటన్ ప్రభుత్వమే భరిస్తోంది. దేశం మాంద్యం కోరల్లో చిక్కి అల్లాడుతున్న వేళ ఎందుకీ ఆడంబరమంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార హక్కులు తదితరాల ద్వారా అంతకంటే ఎక్కువే తిరిగొస్తుందని సమాచారం. ఈ కార్యక్రమం దేశ పర్యాటకానికి ఎంతో ఊపునిస్తుందని సర్కారు ఆశ పడుతోంది! ► బ్రిటన్ పౌరుల్లో ఏకంగా 52 శాతం మంది ఈ రాచరికపు సంప్రదాయం కొనసాగింపును వ్యతిరేకించినట్టు ఇటీవలి సర్వేలో తేలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్రిటన్ రాణికి గొప్ప నివాళి... ఆకాశమే హద్దుగా పోర్ట్రెయిట్‌ని రూపొందించిన పైలెట్
బ్రిటన్‌రాణి క్వీన్ ఎలిజబెత్ 2న సెప్టెంబర్ 8న స్కాట్లాండ్లోని బాల్మోరల్లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు దివగంత బ్రిటన్ రాణికి సరిగ్గా ఒక నెల తర్వాత ఆమెకు ఒక పైలెట్ అత్యంత ఘనమైన నివాళి అందించింది. అదీ కూడా విమానంతో ఆకాశంలో అతిపెద్ద క్విన్ ఎలిజబెత్ పోర్ట్రెయిట్‌ని రూపొందించింది. ఈ మేరకు పైలెట్ అమల్ లార్లిడ్ అక్టోబర్ 6న క్వీన్ ఎలిజబెత్ పోర్ట్రెయిట్‌ని రూపొందిచిందని గ్లోబల్ ఫ్టైట్ ట్రాకింగ్ సర్వీస్ రాడార్ 24 తన ట్విట్టర్లో పేర్కొంది. ఆమె సుమారు రెంగు గంటలు దాదాపు 413 కిలోమీటర్లు ప్రయాణించి లండన్‌కి వాయువ్యంగా 105 కి.మీ పొడవు, 63 కి.మీ వెడల్పుతో బ్రిటన్ రాణి పోర్ట్రెయిట్‌ని రూపొందించింది. ఆమె ఫ్టైట్ జర్నీకి వెళ్లే ముందే రాడార్‌తో మాట్లాడు తాను సిద్ధం చేసుకున్న ప్లైట్ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఫోర్ఫ్లైట్ ద్వారా గుర్తించబడిన ఫార్మాట్లో విమానాన్ని పోనిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపింది. అంతేకాదు తాను అవసానదశలో ఉన్న రోగుల సంరక్షణ కోసం పనిచేసే యూకే స్చచ్ఛంద సంస్థ కోసం డబ్బులను సేకరిస్తున్నట్లు అమల్ పేర్కొంది. ఈ బ్రిటన్ రాణి పోర్ట్రెయిట్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా యూకే పేర్కొంది. Pilot @amal_larhlid wanted to pay tribute to the late Queen and raise money for @hospiceuk, so earlier today she completed the world’s largest portrait of Queen Elizabeth II. https://t.co/79BHv357dQ pic.twitter.com/CAl5Vfemr9 — Flightradar24 (@flightradar24) October 6, 2022 (చదవండి: విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు) -
క్వీన్ ఎలిజబెత్ హ్యాండ్‌బ్యాగ్ వెనక ఇంత రహస్యముందా?
హ్యాండ్‌బ్యాగ్... మహిళల జీవితంలో ఓ భాగం. ఇటీవల మరణించిన బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్–2 సైతం నిత్యం హ్యాండ్‌బ్యాగ్‌ను క్యారీ చేసేవారు. 1950 నుంచి 2022వరకు ఆమె ఫొటోలను గమనిస్తే.. అన్నింట్లో ఆమె బ్లాక్ లానర్ హ్యాండ్‌బ్యాగ్‌ను ధరించే కనిపిస్తారు. బ్లాక్ బ్యాగ్ మాత్రమే ఎందుకు వాడేవారు? ఫ్యాషన్ స్టేట్మెంట్గానా? అంటే కానేకాదు. అంతకుమించి. బ్యాగ్ ద్వారా తన సిబ్బందికి రహస్య సమాచారాన్ని చేరవేసేవారామె. బ్యాగ్ ప్రతి కదలిక, పొజిషన్‌ను బట్టి డిఫరెంట్ మెసేజ్‌ను పంపించేవారు. ఎలా అంటే... ►ఆమె ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎడమ చేతిపై బ్యాగ్‌ను కుడిచేతికి మార్చారంటే.. ఆ సంభాషణను ముగించాలి అనుకుంటున్నారని అర్థం. ► చేతిలోని బ్యాగ్‌ను కింద పెట్టారంటే... తాను అసౌకర్యంగా ఫీలవుతున్నానని, వెంటనే ఆ వ్యక్తిని బయటికి పంపించేయాలని సూచన. ► భోజనం చేసేటప్పుడు ఆ బ్యాగ్‌ను టేబుల్ మీద పెట్టారంటే.. ఐదు నిమిషాల్లో భోజనం ముగించేయాలి అనుకున్నారన్నట్టు. ►అలాంటి కీలకమైన పాత్రపోషించే బ్యాగ్ ఉంటేనే ఆమె కంఫర్టబుల్‌గా ఫీలయ్యేవారు. ►ఆ చివరకు సెప్టెంబర్ 6న ప్రధానిగా లిజ్‌ట్రస్ బాధ్యతలు తీసుకునేరోజు సైతం బాల్మోరల్ క్యాజిల్‌లో జరిగిన కార్యక్రమంలో సైతం క్వీన్ బ్లాక్ హ్యాండ్‌బ్యాగ్ ధరించి ఉన్నారు. ►ఆఇంతకూ ఆ బ్యాగ్‌లో ఏముండేవో తెలుసా? సాధారణ మహిళల బ్యాగుల్లో ఉన్నట్టే... చిన్న అద్దం, లిప్‌స్టిక్, కొన్ని మింట్ బిల్లలు, ఒక జత రీడింగ్ గ్లాసెస్. -
Elizabeth-2: అంత్యక్రియలకు వెళ్లి సెల్ఫీకి పోజులా? అదేమైనా బర్త్‌డే పార్టీనా?
లండన్: మెక్సీకో విదేశాంగ మంత్రి మార్సెలో ఇబ్రార్డ్ను నేటిజన్లు ఏకిపారేశారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు వెళ్లిన ఆయన.. భార్యతో కలిసి సెల్ఫీకి పోజులివ్వడంపై మండిపడ్డారు. దేశం తరఫున ప్రతినిధిగా వెళ్లి రాణి అంత్యక్రియల్లో ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తారా? అని విమర్శలు గుప్పించారు. 'మీరు భార్యతో కలిసి సెల్ఫీలు తీసుకోవడానికి అదేం బర్త్‌డే పార్టీ కాదు. మెక్సీకో ప్రతినిధిగా వెళ్లారు. అది గుర్తుపెట్టుకోండి' అని ఓ నెటిజన్ ఇబ్రార్డ్కు చురకలు అంటించాడు. 'ఈయన లండన్ పర్యటనకు వెళ్లిన వింత సందర్శకుడిలా ప్రవర్తించారు. ఇతరులను ఇబ్బందిపెట్టి అందరూ తనవైపు చూడాలనుకుంటున్నారమో?' అని మరో యూజర్ విమర్శించాడు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం జరిగాయి. 2,000 మంది విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో ఇబ్రార్డ్ ఒకరు. అయితే అంత్యక్రియలకు ముందు ఆయన భార్యతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇరకాటంలో పడ్డారు. En el Funeral de Estado de S.M. la Reina Isabel II pic.twitter.com/GUiNPtJrSo — Marcelo Ebrard C. (@m_ebrard) September 19, 2022 చదవండి: ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్ -
ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం అశ్రునయనాల మధ్య జరిగిన విషయం తెలిసిందే. రాజకుటుంబంలోని సభ్యులందరితో పాటు 2,000 మంది అతిథులు, విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే రాణి అంత్యక్రియల్లో ఆమె మనవడు, కింగ్ చార్లెస్-3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ వ్యవహరించిన తీరుపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. రాణి భౌతికకాయం వెస్ట్‌మినిస్టర్ అబెలో ఉన్నప్పుడు ఆమెకు నివాళిగా అందరూ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ద కింగ్'ను ఆలపించారు. అయితే డేగ కళ్లున్న కొందరు ఈ సమయంలో ప్రిన్స్ హ్యారీని వీడియో తీశారు. ఆయన పెదాలు కదపనట్లు, జాతీయ గీతం ఆలపించనట్లు అందులో కన్పించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేయగా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. Prince Harry not singing the national anthem 👀 #queensfuneral pic.twitter.com/laNk5JMZ6R — Kieran (@kierknobody) September 19, 2022 ప్రిన్స్ హ్యారీ.. రాణికి మీరిచ్చే మర్యాద ఇదేనా? అని ఓ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరొకొందరు మాత్రం ప్రిన్స్ హ్యారీకి మద్దతుగా నిలిచారు. ఆయన జాతీయ గీతాన్ని ఆలపించారని, పెదాలు కదిలాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరేమో.. జాతీయ గీతం మారింది కాబట్టి ఆయనకు కష్టంగా అన్పించిందేమో ఓ సారి అవకాశం ఇచ్చిచూద్దాం అన్నాడు. మరో నెటిజన్.. ఈ కార్యక్రమంలో ఇంకా చాలా మంది ప్రిన్స్ హ్యారీలాగే ప్రవర్తించారని, కింగ్ చార్లెస్ కూడా పెదాలు కదపలేదన్నారు. వాళ్లను పట్టించుకోకుండా ఈయనపైనే ఎందుకుపడ్డారని ప్రశ్నించాడు. మరికొందరు మాత్రం తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు నోట మాటరాదని, అందుకే ప్రిన్స్ హ్యారీ జాతీయ గీతాన్ని ఆలపించలేకపోయి ఉండవచ్చని ఆయనకు అండగా నిలిచారు. ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. దీన్ని సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు. చదవండి: బ్రిటన్ రాణి అంత్యక్రియలు పూర్తి.. ప్రపంచ దేశాల అధినేతలు హాజరు -
భారమైన హృదయాలతో... రాణికి వీడ్కోలు
లండన్: అసంఖ్యాక అభిమానుల అశ్రు నివాళుల నడుమ బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్–2 అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. కార్యక్రమం ఆసాంతం పూర్తి ప్రభుత్వ లాంఛనాల నడుమ సాగింది. రాచ కుటుంబీకుల అంతిమయాత్రకు ఉపయోగించే ప్రత్యేక వాహనంలో రాణి పార్థివ దేహాన్ని ఉదయం 11 గంటలకు వెస్ట్‌మినిస్టర్ హాల్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబేకు తరలించారు. రాజు చార్లెస్–3తో పాటు ఆయన తోబుట్టువులు, కొడుకులు, కోడళ్లు, మనవడు, మనవరాలు, ఇతర రాజకుటుంబీకులు వెంట నడిచారు. అబేలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులతో పాటు 2,000 మందికి పైగా దేశాధినేతలు, రాజులు, ప్రముఖులు చివరిసారిగా నివాళులర్పించారు. నేపథ్యంలో విషాద సంగీతం వినిపిస్తుండగా గంటకు పైగా ప్రార్థనలు కొనసాగాయి. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తదితరులంతా బైబిల్ వాక్యాలు పఠించారు. ఈ సందర్భంగా రాణికి నివాళిగా బ్రిటన్వ్యాప్తంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. వెస్ట్‌మినిస్టర్ డీన్ తదితరులు శోక సందేశం వినిపించారు. దేశసేవకు జీవితాన్ని అంకితం చేస్తానంటూ రాణి తన 21వ పుట్టినరోజున చేసిన ప్రతిజ్ఞను ఆసాంతం నిలబెట్టుకున్నారంటూ కొనియాడారు. అనంతరం ఎలిజబెత్–2 వివాహ, పట్టాభిషేక వేడుకలకు వేదికగా నిలిచిన వెస్ట్‌మినిస్టర్ అబే నుంచే ఆమె అంతిమయాత్ర మొదలైంది. చారిత్రక లండన్ వీధుల గుండా భారంగా సాగింది. ఈ సందర్భంగా ఇరువైపులా అభిమానులు అసంఖ్యాకంగా బారులు తీరారు. తమ అభిమాన రాణికి శోకతప్త హృదయాలతో తుది వీడ్కోలు పలికారు. రాణికి తుది నివాళులర్పిస్తున్నరాష్ట్రపతి ముర్ము, పలు దేశాధినేతలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లపై లక్షలాది మంది అంతిమయాత్రను వీక్షిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. 96 ఏళ్లు జీవించిన రాణికి నివాళిగా లండన్‌లోని చారిత్రక బిగ్‌బెన్ గడియారం నిమిషానికోసారి చొప్పున 96 సార్లు మోగింది. హైడ్ పార్కులో రాయల్ గన్ సెల్యూట్ నిరంతరాయంగా కొనసాగింది. అనంతరం రాణి పార్థివ దేహాన్ని జాతీయ గీతాలాపన నడుమ దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని చారిత్రక విండ్సర్ కోటకు ప్రత్యేక వాహనంలో తరలించారు. శవపేటికపై ఉంచిన రాజ చిహ్నాలైన కిరీటం తదితరాలను తొలగించారు. సంప్రదాయ ప్రార్థనల అనంతరం సెయింట్ జార్జి చాపెల్‌కు తరలించారు. రాజ కుటుంబీకుల సమక్షంలో రాణి తల్లిదండ్రులు, భర్త, సోదరి సమాధుల పక్కనే ఖననం చేశారు. బ్రిటన్ను అత్యధిక కాలం పాలించిన రాణి పవిత్రాత్మ పరలోకంలోని ప్రభువును చేరాలంటూ బైబిల్ వాక్యాల పఠనం తర్వాత మరోసారి జాతీయ గీతాలాపనతో అంత్యక్రియలు ముగిశాయి. క్వీన్ విక్టోరియా మెమొరియల్ మార్గం గుండా సాగుతున్న రాణి అంతిమయాత్ర ఇదీ చదవండి: బ్రిటన్ రాజు బాడీగార్డులకు నకిలీ చేతులు! నెటిజన్ల అయోమయం -
రాణి చనిపోయింది కాబట్టి మా వజ్రాలు మాకిచ్చేయండి!
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ మృతి తర్వాత బ్రిటన్ రాజ కుంటుంబం అధీనంలో ఉన్న వజ్రాలను తమ దేశాలకు ఇచ్చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభమైంది. బ్రిటన్ రాణి కిరీటంలో అనేక వజ్రాలు పొదగబడి ఉంటాయి. అవన్ని బ్రిటీష్ పాలిత దేశాల నుంచి దురాక్రమణంగా తెచ్చిన వజ్రాలే. ఐతే ప్రస్తుతం రాణీ మరణించింది కాబట్టి 'మా వ్రజాలు మాకిచ్చేయండి' అంటూ పలు దేశాలు డిమాండ్ చేయడం మొదలు పెట్టాయి. ఆయ దేశాల సరసన దక్షిణాఫ్రికా కూడా చేరింది. ఆప్రికాలో ప్రసిద్ధిగాంచిని కల్లినన్ I అనే వజ్రాన్ని వలస పాలకులు బ్రిటీష్ రాజకుటుంబానికి అప్పగించాయి. ఆ వజ్రం ప్రస్తుతం రాణి రాజదండంపై అమర్చబడి ఉంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా తమ దేశ ఖనిజాలతోనూ, ప్రజల సొమ్ముతోనూ బ్రిటన్ లబ్ధి చేకూర్చుకుందంటూ ఎత్తిపొడుస్తూ...తమ దేశ వజ్రాన్ని ఇచ్చేయమంటూ డిమాండ్ చేసింది. అంతేకాదు వజ్రాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ ఆన్లైన్లో.. change.org అనే వెబ్సైట్లో పిటిషన్ కూడా వేసింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పార్లమెంటు సభ్యుడు వుయోల్వేతు జుంగులా బ్రిటన్ చేసిన నిర్వాకానికి పరిహారం ఇవ్వాల్సిందేనని, పైగా దొంగలించిన మొత్తం సొత్తును కూడా ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆ వజ్రం ఒక బిందువు ఆకారంలో ఉంటుందని, 1600 ఏళ్ల నాటి పట్టాభిషేక వేడుకలో రాజ దండంలోని క్రాస్ గుర్తులో పొదగబడి ఉందని దక్షిణాఫ్రికా పేర్కొంది. ఈ వజ్రం అత్యంత విలువైనదే కాకుండా చారిత్రత్మకంగా చాలా ప్రసిద్ధి చెందినదని చెబుతోంది. దీన్ని లండన్ టవర్లోని జ్యువెల్ హౌస్‌లో బహిరంగ ప్రదర్శనలో ఉంచినట్లు పేర్కొంది. (చదవండి: వెస్ట్‌మినిస్టర్ హాల్: రాణి శవపేటికను అక్కడే ఎందుకు ఉంచారంటే..) -
కింగ్ చార్లెస్‌ని కలిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... సంతాప పుస్తకంలో..
లండన్‌లోని వెస్ట్మిన్స్టర్ అబ్బేలో క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియలు సెప్టంబర్ 19న సోమవారం 11 గంటలకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. భారత్ తరుఫున క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరైందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్‌కి చేరుకున్నారు కూడా. ఆ తర్వాత బకింగ్‌హామ్ ప్యాలెస్ సమీపంలోని లాంకాస్టర్ హౌస్‌లో ముర్ము ముందుగా కింగ్ చార్లెస్‌ని కలిశారు. తదనంతరం క్వీన్ ఎలిజబెత్2 జ్ఞాపకార్థం ద్రౌపది ముర్ము సంతాప పుస్తకంపై సంతకం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ట్విట్టర్లో పేర్కొంది. అంతేకాదు ముర్ము వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉన్న బ్రిటన్ రాణి శవపేటిక వద్ద క్వీన్ ఎలిజబెత్‌కి నివాళులర్పించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత్ తరుపున సంతాపం తెలియజేసేందుకు ఆమె సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు బ్రిటన్ అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన నిమిత్తం ముర్ము విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాతో సహా తన పరివార సభ్యులతో కలిసి లండన్‌లోని గ్యాట్రిక్ విమానాశ్రయానకి చేరుకుని అక్కడ నుంచి బస చేసే హోటల్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంకు చేరకున్న ద్రౌపది ముర్ముకు బ్రిటన్‌లోని భారత హై కమిషనర్ ఘన స్వాగతం పలికారు. ద్రౌపది ముర్ము వెస్ట్‌మినిస్టర్ అబ్బేలోని వెస్ట్గేట్లో జరిగే క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియలకు హాజరయ్యి, తదనంతరం బ్రిటన్ కామన్వెల్త్ అభివృద్ధి వ్యవహారాల కార్యదర్శి జేమ్స్ క్లీవర్లీ నిర్వహించే రిసెప్షన్‌కి హాజరవుతారు. President Droupadi Murmu signed the Condolence Book in the memory of Her Majesty the Queen Elizabeth II at Lancaster House, London. pic.twitter.com/19udV2yt0z — President of India (@rashtrapatibhvn) September 18, 2022 (చదవండి: రాణి ఎలిజబెత్2 అంత్యక్రియలు.. లండన్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము) -
క్వీన్ అంత్యక్రియల వేళ అనుహ్య ఘటన... షాక్‌లో బ్రిటన్
లండన్: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు వేళ ఒక అనుహ్య ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పోలీసు అధికారులు కత్తిపోటుకు గురయ్యారు. ఒక దుండగుడుని దాడులకు తెగబడతాడన్న అనుమానంతో ఇద్దరు అధికారులు అదుపులోకి తీసుకుంటుండగా.. వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ ఇద్దరు అధికారుల తోపాటు సదరు దుండగుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పుడు వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందతున్నట్లు పోలీసులు తెలిపారు. ఐతే ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా పరిగణించడం లేదని లండన్ మెట్రో పాలిటన్ పోలీస్ శాఖ పేర్కొంది. ఈ సంఘటనకు గల కారణాలపై పూర్తి స్తాయిలో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. లండన్ మేయర్ ఈ దాడిని అత్యంత భయంకరమైనదిగా పేర్కొన్నారు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత యూకేలో తొలిసారిగా జరుగుతున్న ప్రభుత్వ లాంఛన అంత్యక్రియలకు యూఎస్ అధ్యక్షుడు జో బిడెన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు హాజరుకానున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని కట్టదిట్టంగా పర్యవేక్షించడానికి బ్రిటన్ దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది పోలీసులు లండన్‌లో మోహరించారు. అందులో 15 వందల మంది ఆర్మీ సిబ్బంది ప్రజల భద్రతను నిర్వహిస్తారు. (చదవండి: రాణి తుది వీడ్కోలు... ఆహ్వానం లేనిది వీళ్లకే) -
Queen Elizabeth II: అరుదైన వ్యక్తిత్వం
‘రవి అస్తమించని సామ్రాజ్యం’ తన ప్రాభవం క్రమేపీ కోల్పోతూ, కొడిగడుతున్న తరుణంలో బ్రిటిష్ పట్టపు రాణిగా వచ్చిన రాణి ఎలిజబెత్–2 గురువారం రాత్రి కన్నుమూశారు. బ్రిటన్‌తో పాటు మరో 14 దేశాలకు లాంఛనప్రాయపు రాజ్యాంగాధినేత హోదాలో అయితేనేమి, పూర్వపు బ్రిటిష్ వలస దేశాలతో కూడిన కామన్వెల్త్ అధినేత హోదాలో అయితేనేమి... ఈ ఏడు దశాబ్దాలూ ఆమె తనదైన ముద్రవేశారు. ఎలిజబెత్–2 సింహాసనం అధిష్ఠించేనాటికి అదే యూరప్ ఖండంలోని అనేక దేశాలు హింసాత్మకంగానో, సామరస్యపూర్వక మార్గంలోనో రాచరిక వ్యవస్థల్ని పూర్తిగా వదుల్చుకుని ప్రజాస్వామ్య రిపబ్లిక్‌లుగా అవతరిస్తున్నాయి. బ్రిటన్ గురించే చెప్పాలంటే అంతకు రెండున్నర శతాబ్దాల పూర్వమే అది ప్రజాస్వామ్య ఫలాలను రుచిచూడటం ప్రారంభించింది. అయినా బ్రిటన్ ప్రజాజీవన రంగం ఈనాటికీ రాచరిక వ్యవస్థతోనే పెనవేసుకుని ఉండటం, బకింగ్‌హామ్ రాజప్రాసాద పరిణామాలు ఈనాటికీ అక్కడి పౌరుల్లో ఆసక్తిదాయకం కావడం ఆ సమాజ తీరుతెన్నుల్ని పట్టిచూపుతుంది. ఇందుకు రాణిగా ఎలిజబెత్–2 నిర్వహించిన పాత్ర కూడా తక్కువేమీ కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారేందుకు సిద్ధపడటం, తమ పరిధులు, పరిమితులు గుర్తెరిగి మసులుకోవడం వ్యక్తులకైనా, వ్యవస్థలకైనా శోభనిస్తుంది. రాణి ఎలిజబెత్ ఆ పని చేశారు కాబట్టే పెద్దగా వివాదాలు ముసురుకోలేదు. తనదైన ఆ శైలే 70 ఏళ్లపాటు ఆమెను అవిచ్ఛిన్నంగా నిలబెట్టింది. దేశానికి రాచరికం ఎందుకన్న ప్రశ్న తలెత్తకుండా చేసింది. రాజ్యాధినేతగా ఆమె ప్రతి వారం ప్రధానితో, విదేశాంగ మంత్రి తదితరులతో సంభాషించటం ఆనవాయితీ. ఇంటా బయటా జరిగే పరిణామాలను తెలుసుకోవటం, సలహాలివ్వటం రివాజు. ఆమె రాణి అయ్యేనాటికి విన్స్టన్ చర్చిల్ దేశ ప్రధాని. అప్పటికే రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటన్ అన్నివిధాలా దెబ్బతిని, తన వలస రాజ్యాల్లో పెల్లుబుకుతున్న జనాగ్రహం పర్యవసానంగా ఒక్కో దేశంనుంచే నిష్క్రమించకతప్పని దుస్థితిలో పడింది. ఆమె వచ్చాక సైతం అది కొనసాగింది. తన తాతలకాలం లోనే రాజ కుటుంబీకులకు ప్రత్యేక ప్రతిపత్తి ఉండే దశ అంతరించి సమానత్వ భావన వచ్చింది. ఇక 1956 నాటి సూయెజ్ కాల్వ సంక్షోభం బ్రిటన్ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రపంచంలో తన వాస్తవ స్థానమేమిటో చూపింది. సామ్రాజ్యంగా వెలుగులీనిన బ్రిటన్ యూరోప్ యూనియన్ (ఈయూ)లో ఒక భాగస్వామిగా మారడం... ఆర్థిక సంక్షోభం పర్యవసానంగా అదే ఈయూ నుంచి రెండేళ్లక్రితం బయటకు రావడం వంటి పరిణామాలకు ఆమె ప్రత్యక్ష సాక్షి. స్కాట్లాండ్లో స్వాతంత్య్ర కాంక్ష క్రమేపీ పెరిగి ఒక దశలో ఆ ప్రాంతం విడిపోతుందేమోనన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. కూటమి ప్రభుత్వాలూ, వాటి అస్థిరతా సరేసరి. వీటన్నిటినీ చూస్తూ, దశాబ్దాల తన అనుభవంతో ప్రభుత్వంలో ఉండేవారికి ఎప్పటికప్పుడు సలహాలిస్తూ ఆమె తన ప్రభావాన్ని చూపగలిగారు. అదే సమయంలో అనవసర జోక్యం చేసుకుంటున్నారన్న అపప్రథ రాకుండా చూసుకున్నారు. అందుకే బ్రిటన్ రాచరికానికి ఇప్పటికీ ప్రాసంగికత అడుగంటకపోవటం వెనక ఆమె వ్యక్తిగత ముద్రను కాదనలేం. ‘రాచరిక వ్యవస్థలోకి తొంగి చూడనంత కాలం దానిపై పూజ్యభావన ఉంటుంది. ఒక్కసారి అలా చూశాక మరి దాన్ని కీర్తించడం అసాధ్యం. అందుకే ఆ మార్మికతను అట్లే కొనసాగనీయండి’ అన్నాడు రాజ్యాంగ నిపుణుడు వాల్టర్ బాజెట్ ఒక సందర్భంలో వ్యంగ్యంగా. అలా చూస్తే బకింగ్ హామ్ రాజప్రాసాదంలో దిగ్భ్రాంతిపరిచేవి ఎన్నో కనబడతాయి. 1992లో ఒకేసారి ఆమె సంతానం లోని ముగ్గురు విడాకులు తీసుకోవటం బ్రిటన్ ప్రజానీకం జీర్ణించుకోలేకపోయారు. ఆ మాటకొస్తే తాను రాణి అయిన కొద్దికాలానికే తన సోదరి ఒక సాధారణ వ్యక్తితో సాన్నిహిత్యం నెరపడం, మీడియాలో అది చిలవలు పలవలుగా రావడం, చివరికామె అతన్ని పెళ్లాడి, ఆ తర్వాత కొద్దికాలానికే విడాకులు తీసుకోవటం వంటి పరిణామాలు రాజకుటుంబీకుల్ని ఊపిరాడని స్థితిలో పడేశాయి. ఎందుకంటే రాణిగా ఆమె చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్‌కు సుప్రీం గవర్నర్. సంప్రదాయానికి అత్యంత విలువ నిచ్చే సమాజం దృష్టిలో ఇవన్నీ ‘జరగకూడని ఘోరాలు’. ఇక యువరాణి లేడీ డయానా స్పెన్సర్ విషయంలో ఆమె తీవ్ర విమర్శలే ఎదుర్కొన్నారు. కోడలిగా సంప్రదాయ పాత్రలో ఒదిగి, ప్రచారానికి దూరంగా ఉండాల్సిన డయానా ప్రముఖురాలిగా మారడం రాజప్రాసాదంలో ఎవరికీ నచ్చలేదంటారు. డయానాను ఆమె అత్తగా ఆరళ్లు పెట్టారని ఆరోపణ లొచ్చాయి. దానికి తగ్గట్టే 1995లో ప్రిన్స్ చార్లెస్‌తో విడిపోయిన డయానా మరో రెండేళ్లకు పారిస్‌లో దుర్మరణం పాలైనప్పుడు మొదట్లో రాణి నుంచి స్పందన లేదు. చివరకు ప్రజాభిప్రాయానికి ఆమె తలొగ్గక తప్పలేదు. నాలుగురోజులు ఆలస్యమైనా విషాద సూచకంగా రాజప్రాసాదంపై ఉన్న యూనియన్ జాక్‌ను అవనతం చేయమని ఆదేశించవలసి వచ్చింది. ఇక భిన్న సందర్భాల్లో రాజ్యాధినేతగా అమెరికా, ఇజ్రాయెల్ తదితర దేశాల అధినేతలకూ, సీనియర్ సైనికాధికారులకూ నైట్‌హుడ్, ఆనరరీ నైట్ కమాండర్ వంటి భుజకీర్తులు తగిలించడం విమర్శలకు తావిచ్చింది. వీరంతా వియత్నాం, పాలస్తీనా, ఇరాక్ తదితరచోట్ల రక్తపుటేర్లు పారించారన్న ఆరోపణలు ఎదు ర్కొన్నవారు. ఏదేమైనా ఎలిజెబెత్లా సంయమనంతో మెలగటం, ఆ ఒరవడిని కొనసాగించటం కుమారుడు చార్లెస్‌కు సంక్లిష్టమైనదే. ఆయన ఆ బాధ్యత ఎలా నెరవేరుస్తారో బ్రిటన్ గమనిస్తూనే ఉంటుంది. -
వింత ఘటన: ఆకాశంలో కనువిందు చేస్తున్న క్వీన్ ఎలిజబెత్ ఆకృతి
లండన్: క్విన్ ఎలిజబెత్ ఇక లేరు అని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించినన కొద్ది క్షణాల్లో యూకేలోని గగనపు వీధుల్లో పలు వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక చోట ఆకాశంలో మేఘం ఆమె ఆకృతిలో కనువిందు చేసింది. సెప్టెంబర్ 8న ఆమె మరణాన్ని ధృవీకరించిన కొద్ది క్షణాల్లో ఇలా యూకే గగన వీధుల్లో మేఘం ఇలా కనువిందు చేయడం అందర్నీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. ఈ ఘటన యూకేలోని ష్రాప్‌షైర్‌లోని టెల్ఫోర్డ్లో చోటు చేసుకుంది. లీన్ అనే మహిళ తన కుమార్తె లీసాతో కలసి కారులో ప్రయాణిస్తున్నప్పుడూ ఆకాశంలో ఈ దృశ్యం కనువిందు చేసింది. దీంతో వారు కొన్ని ఫోటోలను తమ కెమరాలో బంధించారు. ఇలాంటి వింత సంఘటనే బకింగ్‌హామ్ ప్యాలెస్ పై కూడా కనిపించింది. ప్యాలెస్ ఆమె లేరని ప్రకటించిన వెంటనే అక్కడ ఆకాశంలో డబుల్ రెయిన్ బో కనువిందు చేసింది. Queen Elizabeth spotted in the clouds. What a photo 🇬🇧❤️ pic.twitter.com/9AxJZlJknv — airborne assault services (@Wayne57072607) September 8, 2022 A double rainbow today over Buckingham Palace ❤️ They say a double rainbow symbolizes a transformation in life and when it appears after someone passes it is a gateway to heaven. Rest In Peace #QueenElizabeth pic.twitter.com/uXhdjYHTUQ — Jennifer Valentyne (@JennValentyne) September 8, 2022 (చదవండి: యాభై ఏళ్ల తర్వాత... ప్రభుత్వ లాంఛనాలతో క్వీన్‌కి అంత్యక్రియలు) -
ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఫోన్ ఎవరిదంటే..
Queen Elizabeth II Uses Phone And Facebook: ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న సమస్య ‘స్మార్ట్‌ఫోన్ డాటా థ్రెట్’. ఫోన్ ఎంతటి అప్డేట్ వెర్షన్ అయినప్పటికీ.. డాటాను చోరీ చేయగలిగే సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు హ్యాకర్లు. ఈ క్రమంలో బిలియనీర్లు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలనే తేడా లేకుండా తమ చేత వాటం ప్రదర్శిస్తున్నారు. అయితే.. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II మాత్రం ఈ విషయంలో మినహాయింపు కలిగి ఉన్నారట! ఈ భూమ్మీద అత్యంత సెక్యూరిటీ కలిగి ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ ఫోన్‌ను క్వీన్ ఎలిజబెత్ II వాడుతున్నారట!. బకింగ్హమ్ ప్యాలెస్‌లో క్వీన్ ఛాంబర్లో ఇప్పటికీ సంప్రదాయ ల్యాండ్ లైన్ ఫోన్లను మాత్రమే ఉపయోగిస్తూ వస్తున్నారు. ఏ దేశాల నేతలు ఫోన్ చేసినా ఆమె ఆ ఫోన్‌తో మాత్రమే మాట్లాడతారు. అలాంటిది రాజవంశంలో మొట్టమొదటిసారి పాలించే ఓ వ్యక్తి.. వ్యక్తిగతంగా ఫోన్ ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది. న్యూస్ ఏజెన్సీ స్ఫుతినిక్ ప్రకారం.. క్వీన్ ఎలిజబెత్ II ఉపయోగించే మొబైల్ హైసెక్యూరిటీ వ్యవస్థను కలిగి ఉందట. బ్రిటిష్ నిఘా విభాగం ఎం16 రూపొందించిన ఈ వ్యవస్థ హ్యాకర్లకు చిక్కదని, పైగా ఆ ఫోన్లో ఫేస్బుక్ సైతం ఆమె ఉపయోగిస్తున్నారని ఆ కథనం ఉటంకించింది. ఇక ఫేస్బుక్ మెసేజ్‌లు ఇంకా ఎన్క్రిప్షన్కు(సెండర్- రీడర్ మాత్రమే చూడగలిగే సెక్యూరిటీ) నోచుకోని విషయం తెలిసిందే. యూజర్లకు అందుబాటులోకి రావడానికి మరో రెండేళ్లపైనే పట్టొచ్చని ఫేస్బుక్ ప్రకటించుకుంది కూడా. కానీ, ఎలిజబెత్ రాణి వాడుతున్న ఫోన్లో మాత్రం ఎం16 రూపొందించిన యాంటీ హ్యాకర్ ఎన్క్రిప్షన్ ఆప్షన్ ఉందని, అందువల్ల ఆ ఫోన్లో ఉండే ఫేస్బుక్ మాత్రమే కాదు.. ఫోన్లోని ఇతర డాటా మొత్తం చాలా భద్రంగా ఉంటుందని యూకేపాడ్కాస్ట్ ఓ కథనంలో వెల్లడించింది. ఇంతకీ ఫోన్ కంపెనీ ఏంటంటే.. శాంసంగ్. కెమెరాతో కూడిన ఈ అల్ట్రా స్లిమ్ ఫోన్‌ను ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫోన్‌గా పేర్కొంటున్నారు. ఈ ఫోన్‌ను చూసుకునేందుకు ప్రత్యేకంగా ముగ్గురు మనుషులు ఉన్నారట! వాళ్లు ఎప్పుడూ ఆ ఫోన్ ఛార్జ్ డౌన్ కాకుండా చూసుకుంటారట. అంతేకాదు ఆ ఫోన్లో ఆమె ఇద్దరితో ఎక్కువగా ఛాటింగ్ చేస్తోందని(ప్రైవసీ వల్ల వివరాలు వెల్లడించలేదు), ఆమె స్పందించనప్పుడు ఆమె ఫోన్‌ను హ్యాండిల్ చేసే వీలు ఇద్దరికి మాత్రమే ఉందని(ఒకరు ఆమె కూతురు యువరాణి అన్నె, రాణి మేనేజర్ జాన్ వారెన్) స్పుత్నిక్ సారాంశం. సీక్రెట్ ఫేస్బుక్ అకౌంట్ అమెరికా మెటా (ఒకప్పుడు ఫేస్బుక్) అందించే ఫేస్బుక్ మీద యూకేలో వ్యతిరేకత ఉంటుందన్నది తెలిసిందే. కానీ, బ్రిటన్ రాణి ఫోన్లో ఒక రహస్య ఫేస్బుక్ అకౌంట్ ఉండడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఇందులో ఆమె ఎక్కువగా వీడియోస్ చూస్తూ సమయం గడుపుతున్నారట. ఈ భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్.. అదీ 95 ఏళ్ల బ్రిటన్ మహరాణి వాడుతున్నారనే స్టింగ్ ఆపరేషన్ కథనాలు టెక్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఇప్పుడు. కరోనా పరిస్థితుల తర్వాత వీడియో కాల్స్ ఉద్దేశంతో ఆమె ఈ ఫోన్‌ను వాడుతున్నారని తెలుస్తోంది. -
బ్రిటన్ మహారాణి ఎలిజబెత్2 కు మరోసారి అనారోగ్యం
-
బ్రిటన్ రాణి తొలిసారి అలా కనిపించడంతో.. షాక్‌లో ప్రజలు
లండన్: బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2కు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలనే ఆసక్తి యూకే ప్రజలకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారందరికి ఉంటుంది. మరి ఆమే ఏం పడుచు పిల్ల కూడా కాదు. బ్రిటన్ రాణి వయసు ప్రస్తుతం 95 సంవత్సరాలు. ఈ ఏజ్‌లోనూ రాణివారు ఎంతో ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తుంటారు. బహుశా ఈ విషయమే ప్రజలకు ఆసక్తి రేకెత్తిస్తుంటుంది. చదవండి: బ్రిటన్ మహారాణి కన్నుమూస్తే...! సాధారణంగా ఇప్పటివరకు ఎలిజబెత్ రాణి బయట ఎక్కడ కనిపించినా ఎవరి సాయం లేకుండా స్వతహాగా నడుస్తూ ఉంటారు. అయితే తొలిసారి ఎలిజబెత్ తన చేతిలో కర్ర పట్టుకొని బయటకు వచ్చారు. మంగళవారం లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో చర్చిలో సమావేశానికి హాజరైన ఎలిజబెత్ కర్ర సాయంతో నడుస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కారు.ఘీ 95 ఏళ్ల చక్రవర్తి ఆమె కుమార్తె ప్రిన్సెస్ అన్నేతో కలిసి నల్ల కర్ర పట్టుకుని కారు నుంచి బయటకు దిగారు. చదవండి: ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే బ్రటిన్ రాణి కర్ర పట్టుకొని నడవడం చాలా అరుదు కావడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమె అనారోగ్యానికి గురయ్యారేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా 2004లో మోకాలి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత చివరిసారిగా ఆమె కర్రను పట్టుకొని కనిపించారు. అయితే ప్రస్తుతం ఎలిజబెత్ ఇలా ఎందుకు కర్రను ఉపయోగించాల్సి వచ్చిందో ఆమె కార్యాలయం కారణం వెల్లడించలేదు. -
బ్రిటన్ మహారాణి కన్నుమూస్తే...!
లండన్: బ్రిటన్‌లో రాజ వంశంపై ప్రజలకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. రాజవంశానికి సంబంధించిన ఏవార్తైనా ప్రజల్లో ఆసక్తి రేకిత్తిస్తుంది. అలాంటిది ఏకంగా మహారాణి మరణానికి సంబంధించిన వార్తైతే దానికి ఉండే ప్రాముఖ్యమే వేరు! రాణిగారి అంతిమశ్వాస నుంచి అధికారికంగా సమాధి చేసేవరకు ఒకపెద్ద మహాయజ్ఞంలాగా నిర్వహిస్తారు. మహారాణి క్వీన్ ఎలిజబెత్–2 మరణించిన అనంతరం తీసుకొనే చర్యల వివరాలు శుక్రవారం లీకయ్యాయి. రాణి మరణించిన వెంటనే ఆరంభమయ్యే ఈ కార్యకలాపాలను ‘‘ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్’’గా పిలుస్తారని పొలిటికో వార్తా సంస్థ వెల్లడించింది. రాణి మరణించిన రోజును అధికారికంగా ‘డీ డే’గా పిలుస్తారని, ఆమె మరణించిన రోజును జాతి సంతాపదినంగా ప్రధాని ప్రకటిస్తారని, సెలవు కూడా ఇస్తారని తెలిపింది. (చదవండి: మాయ‘లేడి’: చాటింగ్‌తో మొదలై.. నగ్నంగా వీడియో కాల్) రికార్డు పాలన బ్రిటన్ చరిత్రలో సుదీర్ఘకాలం పరిపాలిస్తున్న రాణిగా ఎలిజబెత్2 రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమెకు 95 సంవత్సరాల వయసు. ఆమె తుది శ్వాస విడిచిన అనంతరం పదిరోజుల పాటు పారి్థవ కాయాన్ని అలాగే ఉంచుతారు. ఈ పదిరోజులు ఆమె వారసుడు ప్రిన్స్ ఛార్లెస్ బ్రిటన్ మొత్తం పర్యటించి రాణి మరణ వార్తను పౌరులకు వెల్లడిస్తారు. అనంతరం ఆమెను సమాధి చేసే కార్యక్రమం షురూ అవుతుంది. మరణానంతరం ఆమె భౌతిక కాయాన్ని మూడు రోజుల పాటు హౌస్ ఆఫ్ పార్లమెంట్లో సందర్శకుల కోసం ఉంచుతారు. ఆ సమయంలో వేలాది మంది ప్రజలు లండన్‌కు వస్తారని, దీంతో ట్రాఫిక్ జామ్‌లు, ఆహార కరువు ఏర్పడతాయన్న అంచనాలు లీకైన పత్రాల్లో ఉన్నాయి. సందర్శనార్ధం వచ్చేవారిని నియంత్రించేందుకు సెక్యూరిటీ ఏర్పాట్లను సైతం ఇందులో పొందుపరిచారు. ఈ లీకు పత్రాలపై స్పందించేందుకు బకింగ్‌హామ్ ప్యాలెస్ వర్గాలు నిరాకరించాయి. (చదవండి: TSRTC-Sajjanar: ఆర్టీసీ ఉద్యోగులకు 1నే జీతాలు!) -
'క్వీన్ ఎలిజబెత్ ఆరోగ్యంపై దిగులుగా ఉంది'
లండన్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. బ్రిటన్ రాజకుటుంబం కూడా మహమ్మారి బారీన పడిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకుటుంబంలో క్వీన్ ఎలిజబెత్ పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ కరోనా బారీన పడి ప్రస్తుతం కోలుకుంటున్నారు. కాగా తండ్రి ఆరోగ్యంపై ప్రిన్స్ విలియమ్స్ స్పందించాడు. ' 70 ఏళ్ల వయసున్న నా తండ్రి ప్రిన్స్ చార్లెస్ గత నెలలో కోవిడ్-19 బారీన పడ్డాడు. ఒక వారం పాటు స్కాట్లాండ్లోని తన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే నా తండ్రికి చాతి ఇన్ఫెక్షన్తో పాటు పలు ఆరోగ్య సమస్యలు ఉండడంతో ఇప్పట్లో కోలుకోలేడోమోనని భావించాం. కానీ కరోనాను జయించిన వారిలో ఇప్పుడు మా నాన్న ముందు వరుసలో ఉంటాడు. అయితే నానమ్మ క్వీన్ ఎలిజబెత్, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ వయసులో పెద్దవారు కావడంతో వారి ఆరోగ్యంపై కొంచెం దిగులుగా ఉంది. అయినా వారి ఆరగ్యో పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది. కరోనా మహమ్మారి వారి దరి చేరకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం' అంటూ చెప్పుకొచ్చారు. అంతేగాక కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించిడంతో ప్రజలంతా తమ మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దని, అది అంతా మన మంచికేనని ప్రిన్స్ విలియమ్స్, అతని భార్య కేట్ పేర్కొన్నారు. దేశంలో పరిస్థితులు చక్కబడేవరకు ప్రజలంతా మనో నిబ్భరం కోల్పోవద్దని, అందరూ దైర్యంగా ఉండాలని తెలిపారు. (హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల కరోనా పూర్తిగా తగ్గదు: చైనా) -
వాయిస్ ఓవర్
రాజకుటుంబంలో సభ్యురాలు (క్వీన్ ఎలిజిబెత్–2 మనవడు ప్రిన్స్ హ్యారీని వివాహం చేసుకున్నారు) కావడంతో సినిమాలకు దూరమయ్యారు హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్. అయితే ఇటీవలే రాజకుటుంబం నుంచి తప్పుకుని స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నట్టు ప్రకటించారు. వెంటనే డిస్నీ సంస్థ వాళ్లు మేఘన్ మార్కెల్‌తో ఓ సినిమాకి ఒప్పందం కుదుర్చున్నారు. ఏనుగుల మీద డిస్నీ సంస్థ ఓ సినిమా తెరకెక్కించింది. ఈ సినిమాలో వచ్చే వాయిస్ ఓవర్‌ను మేఘన్ మార్కెల్ చెప్పనున్నారు. ఆమె పారితోషికం ఏనుగుల పరిరక్షణకి విరాళంగా వెళ్తుందట. -
మార్చి 31 నుంచి వారు సామాన్యులు..
లండన్ : బ్రిటన్ రాజు ప్రిన్స్ హ్యారీ ఆయన భార్య మేఘన్ మార్కెల్ మార్చి 31 నుంచి రాజ కుటుంబంతో సంబంధాలు అధికారికంగా పూర్తిగా తెగతెంపులవుతాయని దంపతుల కార్యాలయం వెల్లడించింది. ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌లు రాజరిక విధుల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్న తరువాత బకింగ్‌హామ్ ప్యాలెస్ డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ సస్సెక్స్ యొక్క "సస్సెక్స్ రాయల్" హోదాను సమీక్షించే క్రమంలో ప్రిన్స్ కపుల్ ఈ విషయం వెల్లడించడం గమనార్హం. రాజకుటుంబం నుంచి తాము దూరమవుతామని ఈ ఏడాది జనవరిలో ప్రిన్స్ దంపతులు ప్రకటించడం బ్రిటన్‌లో కలకలం రేపింది. ప్రశాంత జీవనం గడిపేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రిన్స్హ్యారీ అప్పట్లో ప్రకటించారు. తాను పుట్టినప్పటి నుంచి తాను ఎక్కడికి వెళ్లినా తనను ఫోటోగ్రాఫర్లు వెంబడించడం, కెమెరాలలో బంధించడం, తన గురించి జర్నలిస్టులు రాయడంతో విసిగిపోయానని చెప్పుకొచ్చారు. మరోవైపు రాజప్రాసాదాన్ని వీడటంతో వారు ఇక రాయల్ హైనెస్ హోదాను కోల్పోతారని, వారు మనసు మార్చుకుని భవిష్యత్‌లో రాజప్రాసాదంలోకి అడుగుపెడితే ఆ హోదాలు తిరిగి వర్తించే అవకాశం ఉందని బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కొంది. హ్యారీస్ దివంగత ల్లి డయానా ప్రిన్స్ చార్లెస్‌తో విడాకులు పొందినపుడు ఆమె రాయల్ హైనెస్ హోదాను తొలగించారు. చదవండి : ప్రిన్స్ హ్యారీ దంపతుల భద్రతా ఖర్చుకు ‘నో’ -
క్వీన్ కారుణ్యం
క్వీన్ ఎలిజబెత్ 2 ఇకనుంచి ‘ఫర్’ దుస్తులు ధరించబోవడం లేదని బ్రిటన్ రాజప్రాసాదం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై జంతు హక్కుల పరిరక్షణ సంస్థ ‘పెటా’.. ‘రాణిగారి నిర్ణయానికి ఛీర్స్ చెబుతున్నాం’ అని ట్వీట్ చేసింది. బ్రిటిష్ రాణి.. క్వీన్ ఎలిజబెత్ – 2.. ఫర్ని త్యజిస్తున్నారు! జంతువుల చర్మాన్ని వలిచి ఆ వెంట్రుకలతో చేసే ఫర్ దుస్తులను ధరించరాదనే నియమం పెట్టుకున్నారట క్వీన్. బకింగ్ హామ్ ప్యాలెస్ అధికారి వెల్లడించిన తాజా సమాచారం ఇది. క్వీన్ ఎలిజబెత్ డ్రెస్ మేకర్ ఏంజెలా కెల్లీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘‘రాణిగారు పాల్గొనే వేడుకల్లో ఆమె గొప్పదనానికి ప్రతీకగా గానీ, చలికాలంలో వెచ్చదనం కోసం కానీ ఆమె ఫర్ దుస్తులు ధరించి కనిపించినా సరే... అవి జంతువుల ఫర్‌తో చేసినవి కాబోవు. కృత్రిమ ఫర్‌తో చేసినవే అయి ఉంటాయి’’ అని కూడా చెప్పారు ఏంజెలా కెల్లీ. క్వీన్ ఎలిజబెత్ తీసుకున్న ఈ కరుణ పూరిత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పెటా ( పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) యాక్టివిస్టులు తమవంతుగా రాణికి మద్దతు ప్రకటించారు. రాణిగారు తను ధరించే దుస్తుల విషయంలో అనేక నియమాలు పాటిస్తారు. అయితే వస్త్రధారణ విషయంలో ఏనాడూ సంప్రదాయం తప్పని రాణిగారు.. జీవితంలో ఒకే ఒకసారి మాత్రం ప్యాంట్ ధరించారు. అది కూడా విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు! 1970లో రాణిగారు కెనడా టూర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలియగానే ఒక ఔత్సాహిక కుర్ర టైలరు రాణిగారి కోసమని మ్యాటీ–సిల్క్ ట్రౌజర్ సూట్‌ని ప్రత్యేకంగా కుట్టి తెచ్చాడు. అదీగాక.. కెనడా వెళుతూ రాణిగారు ఈ మాత్రం మోడర్న్‌గా లేకుంటే ఎలా అని ఆస్థానంలోని వారందరినీ ఆ టైలర్ ఒప్పించాడు. ముఖ్యంగా రాణిగారిని మెప్పించాడు. అతడి ఆరాటాన్ని కాదనలేక రాణిగారు టూర్లో ఆ ప్యాంట్ వేసుకుని టూర్ నుంచి వచ్చీ రాగానే తీసి పక్కన పెట్టేశారు. మళ్లీ దానిని వేసుకోనే లేదు. ఆ సంగతలా ఉంచితే, రాణి గారు వేసుకునే దుస్తులకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఆ దుస్తులది కాదు. ఆ దుస్తులపైకి ఆమె పట్టుకునే గొడుగుది! ఏ రంగు డ్రెస్ వేసుకుంటే ఆ రంగు గొడుగును చేత పట్టుకుంటారు క్వీన్ ఎలిజబెత్. ఇక బయటికి వచ్చినప్పుడు ఆమె తన చేతికి తగిలించుకునే బ్యాగు కూడా ప్రత్యేకమైనదే. ‘లానర్’బ్రాండ్ బ్యాగు అది. ఒక్కో బ్యాగు వెల కనీసం వెయ్యి డాలర్ల నుంచి మొదలవుతుంది. రాణి గారి అంతస్తుతో పోలిస్తే 70 వేల రూపాయలు (వెయ్యి డాలర్లు) తక్కువే కానీ, అది ప్రారంభ ధర మాత్రమే. అలాంటి బ్యాగులు రాణిగారి చేతి పట్టున 200 వరకు ఉన్నాయి! ఈ బ్యాగులు, బూట్లు, షూజ్, వాచీలను అలా ఉంచితే.. రాణి గారు వేసుకునే దుస్తుల్లో తొంభై శాతం లేత నీలం, లేదా ముదురు నీలం రంగుల్లో ఉండేవే. నీలం తర్వాత లేత ఆకుపచ్చ, ఆ తర్వాత ఎరువు రంగులను క్వీన్ ఎలిజబెత్ ఇష్టపడతారట. రంగు ఏదైనా ఇక ముందు రాణిగారు ధరించే దుస్తులు ఫర్‌తో చేసినవి మాత్రం అయి ఉండవు. -
కోహ్లి కోహినూర్ తీసుకురావా!
లండన్ : ప్రపంచకప్ ఆరంభానికి ముందు యునైటెడ్ కింగ్డమ్(యూకే) క్వీన్ ఎలిజబెత్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో గురువారం జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో కోహ్లితో పాటు ఇతర జట్ల కెప్టెన్లు క్వీన్ ఎలిజబెత్‌ను కలిసారు. వారందరికీ ఆమె ‘బెస్ట్ విషెస్’ చెప్పారు. ప్రిన్స్ హ్యారీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ భేటీ విషయాన్ని తెలియజేస్తూ సంబంధించిన ఫొటోలను రాయల్ ప్యాలెస్, బీసీసీఐలు ట్విటర్లో అభిమానులతో పంచుకున్నాయి. అయితే ఎలిజబెత్‌ను కోహ్లి కలవడంపై భారత అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘కోహ్లి ఎలిజబెత్‌ను కలిస్తే కలిసావు.. కానీ మన కోహినూర్ వజ్రం వారి దగ్గరే ఉంది. అది తీసుకురా’ అంటూ సెటైర్లేస్తున్నారు. ఇక ఎలిజబెత్, కోహ్లి మధ్య జరిగిన సంభాషణలను హాస్యంగా మలుస్తూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ‘ ఎలిజబెత్: బేటా ఏం కావాలి నీకు? కోహ్లి: కోహినూర్ కావాలి’ అనే క్యాప్షన్స్తో కామెంట్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రంగా పేరుగాంచిన కోహినూర్ వజ్రం భారత్‌కు చెందినది. కాకతీయుళు ఈ వజ్రాన్ని చేయించారని చరిత్ర చెబుతోంది. దీన్ని బ్రీటీష్ వాళ్లు తీసుకుపోవడంతో ప్రస్తుతం ఇది రాణి కిరిటంలో ఒదిగి ఉంది. దీన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారని, రాణులు మాత్రం తమ రాజ్యాలను విస్తరింపజేశారనే ప్రచారం ఉంది. ఈ కారణంగా కోహినూర్ వజ్రం ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టమనే ప్రచారం సాగుతుంది. ప్రపంచంలోని వజ్రాలలోకెల్లా కాంతివంతమైన కోహినూర్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. ప్రపంచకప్ సమరం గురువారం ఇంగ్లండ్-దక్షిణాఫ్రికాతో ఆరంభం కాగా.. భారత్ జూన్ 5న అదే దక్షిణాఫ్రికాతో సౌతాంప్టన్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే రెండు సార్లు(1983, 2011) ఈ మెగా టైటిల్ సొంతం చేసుకున్న టీమిండియా.. మూడోసారి కప్పును ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. -
రాణి అయితే.. నాకేంటి?
లండన్: క్వీన్ ఎలిజబెత్... ఈమె ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ రకంగా ఆమె బ్రిటన్‌కే కాదు.. ప్రపంచానికే రాణి. ఎందుకంటే ప్రపంచంలోని సగానికిపైగా దేశాలు ఒకప్పుడు బ్రిటన్ పాలనలోనే ఉండేవి. అలాంటి రాణికి బొకే ఇచ్చే అవకాశమే వస్తే... నిజానికి రాదనుకోండి.. ఒకవేళ వస్తే.. ఎగిరి గంతేయడం ఖాయం కదూ! కానీ అల్ఫీ లన్ మాత్రం.. అందుకు ససేమిరా అన్నాడు. ఎందుకు.. అనే కదా మీరు అడుగుతోంది. నిజానికి తాను బొకే ఎందుకు ఇవ్వనన్నాడో బహుశా అల్ఫీకి కూడా తెలియదనుకుంటా. వివరాల్లోకెళ్తే.. అల్ఫీ లన్ అనే రెండేళ్ల బుడతకి బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌కు బొకే ఇచ్చే అవకాశం వచ్చింది. రాణి వచ్చే సమయానికి పిల్లాణ్ని ఎత్తుకొని తల్లి సిద్ధంగా ఉంది. రాణి రావడంతోనే బొకే ఇవ్వాలని కూడా చెప్పింది. ముందు బాగానే తల ఊపిన అల్ఫీ.. తీరా రాణి దగ్గరకు వచ్చేసరికి ఏడుపు లంఘించుకున్నాడు. అంతటితో ఆగాడా... తల్లి చేతుల్లో నుంచి కిందకు దిగి బొకే ఇవ్వనంటూ మారం చేశాడు. తల్లి ఎంతగా బతిమాలినా ససేమిరా అన్నాడు. దీంతో తల్లి బలవంతంగా చేయి పట్టుకొని బొకే ఇప్పించింది. దీంతో క్వీన్ ఎలిజబెత్ నవ్వుకుంటూనే బొకే తీసుకొని అక్కడి ఉంచి వెళ్లిపోయింది. తీరా ఆమె వెళ్లాక మళ్లీ ముసిముసి నవ్వులు నవ్వాడు. -
ట్రంప్ కు రాణి ఆహ్వానం?
లండన్: అమెరికాతో సంబంధాలను బలపరుచుకోవాలని భావిస్తున్న బ్రిటన్ ప్రభుత్వం రాణి ఎలిజబెత్ 2 ను ఆయుధంగా వినియోగించుకోబోతోందా?. యూకే పత్రికలు ఈ విషయాన్నే చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ను 2017 ప్రథమార్ధంలో ఎలిజబెత్ 2 ద్వారా బకింగ్ హామ్ పాలెస్ కు ఆహ్వానించాలని బ్రిటన్ యోచినట్లు అక్కడి పత్రికలు పేర్కొన్నాయి. ప్యాలెస్ లోని విన్డ్స్ ర్ క్యాసిల్ లో ట్రంప్ దంపతులకు ఆతిథ్యం ఇవ్వాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఆహ్వానానికి సంబంధించిన పూర్తి వివరాలను రహస్యంగా ఉంచారు. వచ్చే వారం థెరిస్సా మే, యూఎస్ ప్రస్తుత అధ్యక్షుడు ఒబామాను కలవనుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ విషయంపై బకింహామ్ ప్యాలెస్ అధికార ప్రతినిధిని సంప్రదించగా ప్రభుత్వం నిర్ణయం మేరకే ప్యాలెస్ లో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.