లండన్: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు వేళ ఒక అనుహ్య ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పోలీసు అధికారులు కత్తిపోటుకు గురయ్యారు. ఒక దుండగుడుని దాడులకు తెగబడతాడన్న అనుమానంతో ఇద్దరు అధికారులు అదుపులోకి తీసుకుంటుండగా.. వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ ఇద్దరు అధికారుల తోపాటు సదరు దుండగుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
ఇప్పుడు వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందతున్నట్లు పోలీసులు తెలిపారు. ఐతే ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా పరిగణించడం లేదని లండన్ మెట్రో పాలిటన్ పోలీస్ శాఖ పేర్కొంది. ఈ సంఘటనకు గల కారణాలపై పూర్తి స్తాయిలో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. లండన్ మేయర్ ఈ దాడిని అత్యంత భయంకరమైనదిగా పేర్కొన్నారు.
దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత యూకేలో తొలిసారిగా జరుగుతున్న ప్రభుత్వ లాంఛన అంత్యక్రియలకు యూఎస్ అధ్యక్షుడు జో బిడెన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు హాజరుకానున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని కట్టదిట్టంగా పర్యవేక్షించడానికి బ్రిటన్ దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది పోలీసులు లండన్‌లో మోహరించారు. అందులో 15 వందల మంది ఆర్మీ సిబ్బంది ప్రజల భద్రతను నిర్వహిస్తారు.
(చదవండి: రాణి తుది వీడ్కోలు... ఆహ్వానం లేనిది వీళ్లకే)
Comments
Please login to add a commentAdd a comment