ట్రంప్ కు రాణి ఆహ్వానం?
ట్రంప్ కు రాణి ఆహ్వానం?
Published Sun, Nov 20 2016 7:12 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
లండన్: అమెరికాతో సంబంధాలను బలపరుచుకోవాలని భావిస్తున్న బ్రిటన్ ప్రభుత్వం రాణి ఎలిజబెత్ 2 ను ఆయుధంగా వినియోగించుకోబోతోందా?. యూకే పత్రికలు ఈ విషయాన్నే చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ను 2017 ప్రథమార్ధంలో ఎలిజబెత్ 2 ద్వారా బకింగ్ హామ్ పాలెస్ కు ఆహ్వానించాలని బ్రిటన్ యోచినట్లు అక్కడి పత్రికలు పేర్కొన్నాయి. ప్యాలెస్ లోని విన్డ్స్ ర్ క్యాసిల్ లో ట్రంప్ దంపతులకు ఆతిథ్యం ఇవ్వాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అయితే ఆహ్వానానికి సంబంధించిన పూర్తి వివరాలను రహస్యంగా ఉంచారు. వచ్చే వారం థెరిస్సా మే, యూఎస్ ప్రస్తుత అధ్యక్షుడు ఒబామాను కలవనుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ విషయంపై బకింహామ్ ప్యాలెస్ అధికార ప్రతినిధిని సంప్రదించగా ప్రభుత్వం నిర్ణయం మేరకే ప్యాలెస్ లో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
Advertisement