
న్యూఢిల్లీ: కొత్తగా జారీ చేస్తున్న పాస్‌పోర్ట్‌ల్లో కమలం గుర్తును ముద్రించడంపై గురువారం విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. కమలం గుర్తును ముద్రించడం నకిలీ పాస్‌పోర్ట్‌లను గుర్తించేందుకు ఉద్దేశించిన భద్రతాచర్యల్లో భాగమని తెలిపింది. ‘కమలం జాతీయ పుష్పం. భద్రతా చర్యల్లో భాగంగా దీన్ని ముద్రించాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. మిగతా జాతీయ చిహ్నాలను కూడా రొటేషన్ పద్దతిలో ముద్రిస్తామని వివరించారు. ఈ అంశాన్ని బుధవారం లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు ఎంకే రాఘవన్ ఈ అంశాన్ని లేవనెత్తి.. కేరళలోని కోజికోడ్‌లో కమలం గుర్తు ముద్రించిన పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయని, ఇది ప్రభుత్వ కాషాయీకరణలో భాగమని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment